ఆపరేషన్ చేసేటప్పుడు గ్రీన్ యూనిఫాం ఎందుకో తెలుసా?
పోలీసులు ఖాకీ యూనిఫాం వేసినట్లు, లాయర్లు నల్ల రంగు యూనిఫాం వేసినట్లు డాక్టర్లు తెల్ల యూనిఫాం వేస్తారు. కానీ ఆపరేషన్ ధియేటర్ లో మాత్రం గ్రీన్ యూనిఫాం ఎందుకు వేస్తారో తెలుసా? అంతేకాదు ఆస్పత్రిలో, ఆపరేషన్ ధియేటర్ లో గ్రీన్ కర్టెన్లు, గ్రీన్ బెడ్ షీట్లు కూడా వాడతారు. అందరు వేసే యూనిఫాం లకు సోషల్ కారణాలు ఉనాయి. కానీ డాక్టర్లు వేసే గ్రీన్ యూనిఫాంకీ ఓ సైంటిఫిక్ కారణం ఉంది.
అదేమిటంటే – సినిమా షూటింగ్ కి వాడే కేమరలో రెండు రకాల లెన్స్ లు ఉంటాయి. క్లోజ్ షార్ట్ (దగ్గరి షార్ట్) తీసే తప్పుడు 45 నెంబర్ లెన్స్ వాడతారు. అదే లాంగ్ షార్ట్ (దూరపు షార్ట్) వాడేటప్పుడు ఆ లెన్స్ తీసి 120 నెంబర్ లెన్స్ పెడతారు. లేకపోతే షార్ట్ అవుట్ ఫోకస్లో మసకగా కనిపిస్తుంది.
ఇదే ఫోర్ములాలో మనిషి కన్ను లో కూడా క్లోజ్ షార్ట్ లెన్స్, లాంగ్ షార్ట్ లెన్స్ లు విడి విడిగా ఉంటాయి. మనకు ఎదురుగా క్లోజ్ షార్ట్ లో ఉన్న మనిషిని చూసి, ఆ మనిషికి వెనక ఉన్న అక్కశాన్ని లాంగ్ షార్ట్ లో చూసేందుకు మన కన్ను ఆటోమాటిక్ గా లెన్స్ ని మార్చుకుంటుంది. దానికి దాదాపు 2 నుంచి ౩ సెకన్ల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో మన కళ్ళు ఒత్తిడికి గురవ్వుతాయి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు మనకు తలనొప్పి వస్తుంది. అందుకే మనకు షార్ట్ సైట్, లాంగ్ షార్ట్ అనే సైట్ వస్తుంది. మనం వాడే కాళ్ళ జోడుకు ఉండే లెన్స్ లు కూడా షార్ట్ సైట్, లాంగ్ షార్ట్ అద్దాలుగా విడి విడిగా ఉంటాయి. ఇది ప్రకృతిలో ఉన్న అన్ని రంగులకు వర్తిస్తుంది. కానీ గ్రీన్ రంగుకు ఇది వర్తించదు.
గ్రీన్ రంగు వస్తువుని కన్ను క్లోజ్ లో చూసిన తరువాత వెంటనే అదే లెన్స్ తో లాంగ్ షార్ట్ ని కూడా చూడగలదు. అంటే కన్నుకు లెన్స్ మార్చుకునే అవసరం లేదు. కాబట్టి కన్ను అలసి పోడు. తలా నొప్పి రాదు. అందుకే డాక్టర్ లు ఆపరేషన్ ధియేటర్ లో గ్రీన్ యూనిఫాం వేసుకుంటే వాళ్ళ కళ్ళు స్టెయిన్ కావు. చురుకుగా పనిచేస్తాయి. తల నొప్పి రాదు. అందుకే తప్పక గ్రీన్ యూనిఫాం వేసుకుంటారు. దీనికి తోడూ గ్రీన్ బట్టకు రక్తం అంటుకున్నా అది డామినేట్ చేయదు. కళ్ళను అలసిపోనివ్వదు.
అందుకే మన పెద్దలు ఇంటి ముందు పచ్చదనం ఉండాలి అని అంటారు. పెరటి తోటలో చెట్లు పెంచాలి అని చెపుతారు. దాని వలన మనకు సైట్ రాదు. అడవిలో ఉండే వాళ్ళకు సైట్ రాకపోవడానికి కారణం కూడా ఇదే.
అయితే ఈ మధ్య కొందరు కార్పొరేట్ డాక్టర్ లు గ్రీన్ యునిఫోరం కి బదులు నీలం రంగు యూనిఫాంలు కూడా ధరిస్తున్నారు. దానివలన కూడా సైట్ రాదనీ వాదిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని కంటి డాక్టర్లు చెపుతున్నారు. గ్రీన్ యూనిఫాంని 1914 నుంచి మొదలు పెట్టారు. మన దేశంలో 1998 నుంచి దీనిని అమలు చేస్తున్నారు.