గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ లో జరుగుతున్నా హై డ్రామా అంతా ఇంతా కాదు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కూడా మీరు ఇంతటి హై డ్రామా చూసి ఉండరు. గత ఏడాది బిఆర్ఎస్ ప్రభుత్వం గురుకులలో 9,౦౦౦ వేల ఉద్యోగాలు బర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి ఆర్థిక శాఖా అనుమతి లభించింది. కానీ అది ఇప్పటివరకు కార్యాచరణకు నోచుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తడిగుడ్డ వేసుకుని కూర్చుంది. దానికి కారణం అందరికి తెలిసిందే.
వాటిని పక్కన పెట్టి గురుకుల శాఖలో మరో 2,391 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కూడా ఆర్థిక శాఖా అనుమతి పొందింది. అంటే మొత్తం 11,231 ఉద్యోగాలు రాబోతున్నట్లు తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకున్నారు. మరి ఎందుకు ఉద్యోగాలు బర్తీ చేయడం లేదని నిరుదోగులు నిలదీస్తే ”టీచర్ ఎం ఎల్ సి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ ఎన్నికల తర్వాత చూద్దాం” అని గురువుగారు కెసిఆర్ తప్పించుకుంటున్నారు. ఈ కుంటిసాకు ఇప్పట్లో తీరేలా లేదు. త్వరలో కంటోన్మెంట్ ఉపఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఎలాగో వస్తాయి. అంటే ఈ ఏడాది గురుకుల ఉద్యోగాలు రానట్లే.
మీరు ఒకటి గమనిచారా – ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందుకే బిఎస్ఆర్ ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగాలు హడావుడిన బర్తీ చేసింది. దానికి, దీనికి చాలా తేడా ఉంది. గురుకుల ఉద్యోగాల సంఖ్యా 11,231 ఉద్యోగాలు. కొన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అంత డబ్బు ఆర్థిక శాఖలో లేదు. ఉద్యోగాలు ఇవ్వక పొతే ప్రతిపక్షాలు దుమ్మెతి పోస్తాయి.
అటు కర్ర విరగకుండా, ఇటు పాము చావకుడా తెలివిగా కెసిఆర్ డ్రామా మొదలు పెట్టారు. అందుకే మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అనే హడావుడి మొదలు పెట్టింది సర్కార్. రోజుకో ప్రకటన గుప్పిస్తోంది. తీరా చూస్తే ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రిలో 81 ఉద్యోగాలు, అయుష్ విభాగంలో 61 ఉద్యోగాలు ఇలా రెండు అంకెలు దాటని ఉద్యోగాలే. బిల్డ్ అప్ చూస్తే మాత్రం వేలాది ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ ప్రకటనలు కోకా-కోలా సూపర్ రిన్ ప్రకటన కంటే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిని ప్రజలు గమనిస్తున్నారు.