అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు ఉంది ఎమ్మెలి కవిత సుప్రీం కోర్టుకు వెళ్లిన వ్యవహారం. ‘తనకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదు, తాను నిర్దోషిని’ అని సుప్రీం కోర్ట్ లో కేస్ వేసివుంటే బ్యుటి పార్లర్ నుంచి వచ్చినంత అందంగా ఉండేది. ఓ మంచి సందేశం జనాల్లోకి వెళ్ళేది. కానీ ఆమె సుప్రీం కోర్ట్ లో వేసింది ఈ విషయం మీద కాదు. చాలా సిల్లి కేసు.
‘అనుమానితురాలు ఒకవేళ మహిళ అయితే, ఆమె ఇంటికి ఈడి వెళ్లి విచారించాలి’ అనే నిబంధన ఉన్నది. దీనిని ఈడి అధికారిలు అతిక్రమించి తమ కార్యాలయానికి రమ్మని తనకు నోటిసులు ఇచ్చారు అన్న సిల్లి ఆరోపణ. ఈడి తమ కార్యాలయానికి పిలిచి అవమానపరిచింది అనే అంశం మీది సుప్రీం కోర్ట్ లో కేసు వేశారు. అంటే ఈ కేసుతో ఆమెకు సంబంధం ఉన్నదని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నట్లా?
ఇంత పెద్ద నిబంధనను ఈడి అధికారాలు ఎలా మరిచిపోతారు? ప్రతి నిబంధనకు ఉప నిబంధన, ఒక వెసులుబాటుగా కూడా ఉంటుంది. అది లోతుకు వెళ్ళితే కానీ తెలియదు. ఇలాంటి విషయాలు ఈడికి బాగా తెలుసు. కానీ లాయర్లకు తెలియకపోవచ్చు. అందుకే తమ క్లయింట్ మెప్పు పొందేందుకు ఇలాంటి లొసుగులు చూపి కోర్ట్ చుట్టూ తిరుగుతారు.
రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడితే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా ప్రయాణిస్తున్న వాహనం కూడా ఆగాల్సిందే అనే రూల్ ఉన్నదని మనకు తెలుసు. రాంగ్ రూట్ లో వెళ్ళినా ప్రెసిడెంట్ అఫ్ ఇండియాకు కూడా ఫైన్ వేయాలి అనే మరో రూల్ ఉన్నది.
కానీ ఈ నిబంధన ఆంబులెన్స్ కు వర్తించదు. రోగి ప్రాణం కాపాడేందుకు ఆంబులెన్స్ రెడ్ సిగ్నల్ ని లెక్క చేయవలసిన అవసరం లేదు. రాంగ్ రూట్ లో కూడా వెళ్ళవచ్చు అనే ఉపనిబంధన ఉన్నది. కాబట్టి చట్టంలో ఉన్న ఇలాంటి వెసులుబాటులు ముందు మనం తెల్సుకోవాలి.
ఈ కేసు వేసిన కవిత ఈడి ఆగ్రహానికి గురికావడం మినహా మరొకటి కాదు. ఆకలితో ఉన్న పులి ముందు జింక తన ఒంటి మీద గరంమషాలా వేసుకుని నిలుచోవడమే.
కానీ ఈ సిల్లి కేసు ద్వారా ఆమె చాలా తెలివిగా ప్రజలకు ఓ సందేశం పంపాలి అనుకున్నారు. ఆదేమిటంటే – ఈడి అధికారులు తన మీద తప్పుడు కేసులు పెట్టారు అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ – ”ఈడి అధికారులు మా ఇంటికి వచ్చి నన్ను విచారించకుండా తమ కార్యాలయానికి పిలిచి నన్ను అవమానపరిచారు. కావున వాళ్ళు నా మీద కత్తి కట్టారు” అని చెప్పదలిచారు.
కానీ దీనిని ఎవరు నమ్ముతారు? సోనియా గాంధీని కూడా ఈడి తమ కార్యాలయానికి పిలిచి గంటల తరబడి విచారించలేదా? ఇప్పటివరకు కొన్ని వందల మంది మహిళలను తమ కార్యాలయానికి పిలిపించి ఈడి విచారించాలేదా? మరి ఈ టైం పాస్ కేస్ సుప్రీం కోర్ట్ లో ఎందుకు వేసినట్లు? తన మీద తప్పుడు కేసులు పెట్టారు కాబట్టే సుప్రీం కోర్టుకు వెళ్ళాను అనే ఓ నివురు కప్పిన నిప్పు సందేశాని పంపడమేనా?
దీనికితోడు కవిత ఈ కేసులో ఈడి మీద మరో ఆరోపణ చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడిని ఆదేశించాలి అని కోరారు. చట్టం నుంచి కవితకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? ఆమె ఓ సిఎం కూతురనా? ఆమె నోబుల్ సాధించిన మహిళా? పద్మవిభూషణ్ సాధించిన సంఘసేవకురాలా? ఆమె ఒక సాధారణ ఎమ్మెల్సి అని ఎందుకు మరిచారు? తనను తాను లెజెండ్ గా డబ్బా కొట్టుకోవడం? ఈ దేశంలో ఉన్న వేలాది ఎమ్మెల్సి లల్లో ఆమె కూడా ఒక ఎమ్మెల్సి. చట్టం అందరికి సమానం.
అందుకే సిజెఐ జేస్టిస్ చంద్రచూడ్ ఆమె కోరికను నిరాకటించి ఆమెకు మొట్టికాయలు వేశారు. అందుకే ఈ నెల 24 జరగవలసిన విచారణను ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఈ నెల 27 కు వాయిదా వేశారు. ఇది ఈడి కీ పరోక్షంగా ఉపయోగపడుతుంది.
మొత్తానికి చూస్తే కెసిఆర్ లాంటి తలపండిన మేధావులు కూడా అప్పుడప్పుడు సిల్లి పనులు చేస్తుంటారు. దీనికి చక్కటి ఉదాహరణ ఆయిన్ స్టీన్ జోక్ గుర్తుకు వస్తోంది. అయన ప్రపంచలోనే గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఇంట్లో పిల్లి నాలుగు పిల్లలను పెట్టింది. ఆయన తలుపు వేసుకుని గదిలో కూర్చుంటే పిల్లి, దాని పిల్లలు ఆ తలుపును రక్కుతూ ఇబ్బంది పెట్టాయి. అయన వడ్రంగి ని పిలిపించి ఆ తలుపుకు తల్లి పిల్లి కోసం పెద్ద రంద్రం, పిల్లల కోసం చిన్న రంద్రాలు చేయించాడు.
అది చూసిన పనిపిల్ల ‘పెద్ద రంద్రంలోంచి తల్లితో పాటు పిల్లలు కూడా వస్తాయి కదా? మరి చిన్న రంద్రం ఎందుకు? అని అడిగింది. ఇది కూడా అలాంటి సంఘటనే.