విజయనిర్మల మొదటి భర్త సంతానమే నరేష్. కృష్ణను విజయనిర్మల వివాహం చేసుకున్నాక వారి వద్దే నరేష్ పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నరేష్ సక్సెస్ ఫుల్ నటుడిగా గురింపు పొందారు.
1982లో జంధ్యాల తెరకెక్కించిన రొమాంటిక్ కామెడి చిత్రం ‘నాలుగు స్తంభాలాట’ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కామెడి కథాంశంతో తెరకెక్కే సినిమాల్లో నరేష్ హీరోగా ఉంటె ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అప్పట్లో అందరి దర్శకుల నమ్మకం.
నరేష్ కెరీర్ లో అతి పెద్ద హిట్ జంబలకడిపంబ. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆయన దర్శకత్వంలో నరేష్ చేసిన మరో హిట్ సినిమా “ఆమె”. ఈ లేడి ఓరియంటెడ్ సినిమాలో మరో హీరోగా శ్రీకాంత్ నటించారు. ఇక 2002నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికీ పలు సినిమాలు చేస్తున్నారు.
రీల్ లైఫ్ లో విజయవంతమైన నరేష్ రియల్ లైఫ్ లోని వ్యక్తిగత జీవితం మాత్రం ఆటుపోట్లకు గురైంది. ముగ్గురు భార్యలతో విడిపోయాడు. ఆ వివరాలు చూద్దాం. సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెతో నరేష్ కి మొదటి వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. ఇతను హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి భార్యతో విడిపోయిన ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను నరేష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళ తరువాత ఆమెతో కూడా విడిపోయాడు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు.
ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు రమ్య రఘుపతితో నరేష్ కలిసి కాపురం చేశారు.రమ్య రఘుపతి-నరేష్ లకు ఒక సంతానం. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. నరేష్ ఇంకా విడాకులు ఇవ్వలేదని రమ్య ఆరోపిస్తున్నారు.
Also Read : మూడు పెళ్ళిళ్ళపై అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ
కొంతకాలంగా నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని చెప్తూ పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించారు.
Also Read : పవిత్రతో నరేష్ లిప్ కిస్ – పెళ్లిపై అధికారిక ప్రకటన