*ఇటీవల జరిపిన నియామకాలు చెల్లవు*
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోను, అనుబంధ విభగలలోను ఏ స్థాయి లో కూడా ఎలాంటి నియామకాలు జరపవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఆర్గనైజేషన్ ఇంచార్జి మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు పీఏసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి నియామకాలు జరపవద్దని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యాక జరిపిన అన్ని నియామకాలు చెల్లవని, సంస్థాగత ఎన్నికల తర్వాత అన్ని నియామకాలు మళ్ళీ నూతనంగా నియమిస్తామని ఆయన వివరించారు.