టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కూతురి వివాహ వేడుక ఇటీవల అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. గుంటూరులో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరై నూతన దంపతులను దీవించారు.
అలీ కూతురి పెళ్లి వేడుకకు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. రాజకీయలను పట్టించుకోకుండా పవన్ – అలీల సాన్నిహిత్యం దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఈ మ్యారేజ్ కు అటెండ్ అవుతారని అనుకున్నారు కాని, జనసేనాని పెళ్లికి హాజరు కాకపోవడంతో రకరకాల ప్రచారం జరిగింది.
Also Read : ” జై భీమ్ ” కు సీక్వెల్ రాబోతుందా..?
ఈ విషయంపై తాజాగా అలీ స్పందించారు. తాను పెళ్లికార్డు పవన్ కు ఇచ్చానని తెలిపారు. ఫిలింసిటీలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లి పవన్ కల్యాణ్ తోపాటు డైరక్టర్ క్రిష్ కు పెళ్లి కార్డు ఇచ్చానని వెల్లడించారు. కార్డు అందుకున్న వెంటనే వివాహానికి తప్పకుండా వస్తానని పవన్ చెప్పినట్లు అలీ తెలిపారు.
ఎదో మీటింగ్ ఉండటం వలన ఫ్లయిట్ ను అందుకోలేకపోయారని చెప్పారు అలీ. తరువాత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి.. పెళ్లికి రాలేకపోయినందుకు ఎం అనుకోవద్దని చెప్పారని తెలిపారు. నీ కూతురు, అల్లుడు ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ చేస్తే వ్యక్తిగతంగా తానే వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పేర్కొన్నారు అలీ.