650కోట్లతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా సెక్రటేరియట్ ను ఓపెన్ చేయనున్నారు. అయితే.. నూతన సెక్రటేరియట్ లోకి సందర్శకులను అంటే ప్రజలని అంత ఈజీగా లోపలికి అనుమతించారని అధికారులు చెప్తున్నారు. మరీ…ముఖ్యంగా ఆరో అంతస్తులో ఉండే సీఎంవోలోకి జనాలను అసలే అనుమతించారట. ప్రజా సమస్యలను వినేందుకు గతంలో సచివాలయాన్ని ఓ వేదికగా చేసుకున్నారు ముఖ్యమంత్రులు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు ప్రజలను కలిసి.. వారిచ్చే వినతి పత్రాలను తీసుకొని సమస్యలను పరిష్కరించేవారు.ఇలా చేయడం ద్వారా వైఎస్సార్ ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకొని మహానేత అయ్యారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా సచివాలయానికి వెళ్ళని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలోకెక్కాడు. ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం తన పంథా మార్చుకోలేదు. సచివాలయంలో కేసీఆర్ లేకున్నా, ఫామ్ హౌజ్ లోనున్నా, ప్రగతి భవన్ లో పండినా అభివృద్ధి ఎక్కడైనా ఆగిందా..? అంటూ ఆయన సుపత్రుడు భలే కవరింగ్ చేసుకొచ్చాడు. పాత సచివాలయంలోకి అడుగిడుతే మరోసారి సీఎం కాలేవని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతోనే కేసీఆర్ సచివాలయం మెట్లు ఎక్కలేదని ప్రచారం ఉంది. అందుకే ఆయన పాత సచివాలయాన్ని కూల్చివేయించి కొత్త సచివాలయ నిర్మాణం చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
నూతన సచివాలయ నిర్మాణం చేపట్టారు. హౌరా అనిపించేలా, అబ్బురపరిచే డిజైనింగ్ తో కొత్త సచివాలయం కనిపిస్తోంది. సెక్రటేరియట్ ద్వారానైనా కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి వస్తాడని అంత అనుకున్నారు. పార్టీపై , ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత దృష్ట్యా ఇకనైనా ఫామ్ హౌజ్ పాలనకు ముగింపు పలుకుతారని అనుకున్నారు. కాని ఆక్కడుంది కేసీఆర్. సొంత పార్టీ నేతలనే కలిసేందుకే ఇష్టపడరు ఆయన. అలాంటిది సామాన్య ప్రజలను కలిసేందుకు ఎలా ఆసక్తి చూపిస్తారు..? పరిపాలన సౌకర్యం కోసం, పాలనాధిపతిని కలిసి సమస్యలను చెప్పుకునేందు కోసం సచివాలయ నిర్మాణం చేయలేదని తాజాగా తేలిపోయింది. జనాలు సీఎంను కలిసి గోడు చెప్పుకునే అవకాశం ఉందని తేలింది. పై అంతస్తులోకి వెళ్ళే అవకాశం ఇవ్వరు ఒకే. కాని సీఎంను కలిసి, సంబంధింత అధికారులను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడమే విడ్డూరంగా ఉంది. సాధారణ జనాలకు విజిట్ చేసే అవకాశం కూడా ఇవ్వరట. సిఎంను కలిసేందుకు అస్సలు అనుమతి ఉండదని చెప్తున్నారు. అలాంటప్పుడు అది సచివాలయం కాదు.. దొర కోసం నిర్మించుకున్న గడీ అంటున్నారు ప్రజలు.
Also Read : మహిళ ఉన్నాతాధికారులకే రక్షణ లేదు – సాధారణ మహిళల పరిస్థితేంటి..?