మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖకు జాతీయ నాయకత్వం అక్షింతలు వేసిందా..? ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న లోపాయికారీ ఒప్పందాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి గుర్తించి సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడా..? బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని, బీజేపీపై యుద్ధం చేస్తుంది కాంగ్రెస్సేనని ఆ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో సపోర్ట్ చేయకుండా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంపై ఏచూరి అసహనం వ్యక్తం చేశారా..? టీఆర్ఎస్ , బీజేపీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించడంలో విఫలం అయ్యారని రాష్ట్ర నాయకత్వాన్ని ఏచూరి ఎకిపారేయడంతోనే తమ్మినేని టీఆర్ఎస్ పై బిగ్ బాంబ్ పేల్చారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి తప్పు చేశామనే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బీజేపీపై వ్యతిరేక పోరులో టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది కనుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పిన తమ్మినేని తాజాగా టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం కూడా లేకపోలేదనే హెచ్చరికలు పంపారు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ పై ప్రశంసల జల్లు కురిపించిన సీపీఎం నేతలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడానికి కారణం ఎంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో సాగిస్తోన్న బెరసారాలను తెలుసుకున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి తెలంగాణ రాష్ట్ర నేతలపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురిని కాపాడుకునేందుకు ఇక్కడ లాబీయింగ్ చేస్తున్నాడని.. బీజేపీకి గులాం గిరి చేసేందుకు కూడా కేసీఆర్ అంగీకరించాడని అలాంటిది ఆ పార్టీకి మునుగోడులో ఎలా మద్దతు ఇవ్వాలనిపించిందని క్లాస్ పీకారట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా బీజేపీ బీ టీం గానే కొనసాగుతుంది..కేంద్రం తీసుకున్న పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు జై కొట్టింది. కాని గతంలోని విషయాలను పక్కనపెట్టేసి కేసీఆర్ రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ వ్యతిరేక పల్లవి అందుకోగానే ఆ పార్టీ పల్లకి ఎలా మోస్తారని ఏచూరి ప్రశ్నించారట. కొద్దోగొప్పో క్యాడర్ ఉన్న చోట పార్టీని బలహీన పరిచే నిర్ణయాలు తీసుకోవద్దని…వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ నిర్ణయాలుగా మార్చకండి. పార్టీ పరువు తీసేలా వ్యవహరించకండని ఏచూరి సీరియస్ అవ్వడంతో తమ్మినేని సైలెంట్ అయ్యారట.
ఏచూరి ఓ రేంజ్ లో క్లాస్ పీకడంతోనే తమ్మినేని వీరభద్రం తాజాగా టీఆర్ఎస్ పై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశాడని సుందరయ్య భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడుకు నిధులిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రులు ప్రకటించడం పట్ల తమ్మినేని అసంతృప్తి వ్యక్తం చేయడం ఏచూరి కోటింగ్ ఫలితమేనని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. బీజేపీపై టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంభిస్తోందని, భవిష్యత్ లో ఆ పార్టీతో టీఆర్ఎస్ కలిసిపోయే అవకాశం ఉందని తమ్మినేని ప్రకటించడం వెనక సీతారాం ఏచూరి ఉన్నారని అంటున్నారు.