బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొదటి సీజన్ కాస్త చప్పగా అనిపించిన సెకండ్ సీజన్ మాత్రం దుమ్మురేపుతోంది.
రెండో సీజన్ లోనూ మూడు ఎపిసోడ్ లు అంతగా మెప్పించలేదు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో కు మరింత పాపులారిటీ వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ఎపిసోడ్ చూసేందుకు చాలా మంది ఆహ యాప్ లో కొత్తగా లాగిన్ అయ్యారు. ఇటీవలే ప్రసారమైన ప్రభాస్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రభాస్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ టాక్ షో కు మెగాస్టార్ కూడా వస్తే బాగుండేదని ఆడియన్స్ అనుకుంటుండగా ఓ వార్త వైరల్ అవుతోంది.
చిరంజీవి ‘అన్ స్టాపబుల్’ షో లో పాల్గొనడానికి అంగీకరించాడట. ఈ మొత్తం ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న చిరంజీవి నటించిన‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య చేసిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాలపైనే ఉండబోతుందని ఫిలింవర్గాల టాక్.
ఈ రెండు సినిమాలు జనవరి 12 , జనవరి 13 వ తేదీలలో వరుసగా విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో టాక్ షో లో పాల్గొంటే ఈ రెండు సినిమాలకు ప్రొమోషన్స్ కు కలిసి వస్తుందని ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలీకాస్ట్ అయ్యేలా డేట్ అనుకున్నారట.
త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
Also Read : బాలయ్య “అన్ స్టాపబుల్ “షో పై రోజా సంచలన వ్యాఖ్యలు