బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులోనూ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఓటీటీ వర్షన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా హిట్ అయింది. కానీ గత ఏడాది సీజన్ మాత్రం తుస్సుమనిపించింది. తెలియని మొహాలను తీసుకొచ్చారు. పసలేని గేమ్స్ పెట్టి ఆడియన్స్ కు బోర్ కొట్టేలా చేశారు. ఏంట్రా మాకి ఖర్మా అనేలా ఒకటే ఫార్ములాతో బిగ్ బాస్ ను రన్ చేశారు. ప్రేక్షకులకు కోపం వచ్చింది. బిగ్ బాస్ ను కట్ చేసి పడదొబ్బారు. ఫన్ డే అంటూ వచ్చే నాగ్ హోస్టింగ్ కూడా యమా బోరు కొట్టించింది. పైగా.. నాగ్ కొంతమంది పట్ల పర్శియాలిటి చూపిస్తారు. ఇది న్యూట్రటల్ ఆడియన్స్ కు ఏమాత్రం నచ్చట్లెదు. నాగ్ మాత్రం తన తీరు మార్చుకోకుండా రొటీన్ కాన్సెప్ట్ తో షో ను నడిపించేస్తున్నాడు.
అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి భిన్నంగా బిగ్ బాస్ షో ను ప్లాన్ చేయాలనుకుంటున్నారు. పెళ్ళైన జంటలతో కొత్త సీజన్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇందుకోసం పలు జంటలను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, విడిపోయిన జంటలను కూడా ఈ షో లో పార్టిసిపేట్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ అంశం బయటకు రావడంతో బిగ్ బాస్ ప్రేమికులు ఈ సీజన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న సింగర్, నటుడు నోయల్ ఈ సీజన్ లో కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈయనకి అనారోగ్యం కారణం గా మధ్యలోనే బయటకి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే నోయల్ కి ప్రముఖ హీరోయిన్ ఈస్టర్ తో వివాహం జరిగి.. కొనేళ్లకు విడిపోవాల్సి వచ్చింది.ఇప్పుడు ఈ ఇద్దరినీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. దీనికి వీళ్లిద్దరు కూడా అంగీకరించినట్లు సమాచారం.బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ ఆలోచించని విధంగా ఈసారి మన బిగ్ బాస్ టీం ఆలోచించింది.
నెక్స్ట్ సీజన్ లో హోస్ట్ నాగార్జున ప్లేసులో మరో కొత్త హీరో కనిపించే అవకాశం కనిపిస్తోంది.