మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ భోళా శంకర్’ సినిమా తాజాగా విడుదలైంది. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తోపాటు భావోద్వేగాలను మేళవించి తీసిన ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటించారు. మెగాస్టార్ కు జోడిగా తమన్నా కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టొరీ : మహాలక్ష్మి (కీర్తి సురేష్) పెయిటింగ్ కళాకారిణి. పెయిటింగ్ పై మక్కువతో కలకత్తాలో మంచి ఆర్ట్స్ కాలేజ్ ఉందని తెలియడంతో ఆమెను అందులో జాయిన్ చేయడానికి అన్నయ్య శంకర్ కలకతా షిఫ్ట్ అవుతాడు. అక్కడే చెల్లి బాగోగులు కోసం క్యాబ్ డ్రైవర్ గా చేరుతాడు. అయితే , కలకత్తాలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుల ఫోటోలను డ్రైవర్లకు ఇవ్వడంతో… శంకర్ సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ బారి నుంచి కాపాడుతారు. ఈ సమాచారం పోలీసులకు ఎవరిచ్చారని తెలుసుకున్న అలెక్స్ (తరుణ్ అరోరా) … శంకర్ , మహాలక్ష్మిలను టార్గెట్ చేస్తారు. ఆ తరువాత ఎం జరిగిందనేది అసలు కథ.
విశ్లేషణ : భోళా శంకర్ అనేది రీమేక్ సినిమా అనేది తెలిసిందే. అయితే సినిమాలో ఎమోషన్ సీన్స్ , యాక్షన్ సీన్స్ తప్ప మిగతా సన్నివేశాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించలేదు. ప్రేక్షకులను హత్తుకునేలా సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యారు దర్శకుడు మెహర్ రమేష్. కామెడి సీన్స్ లో దర్శకుడు వైఫల్యం చెందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి తప్పితే సినిమాలో బలమైన సీన్స్ ఎక్కడ అనిపించలేదనే అనుభూతి కల్గుతుంది.
ఫస్టాఫ్ లో ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిన ఫీల్ కల్గుతుంది. సెకండాఫ్ ఒకే. పరవాలేదు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన బిల్లాలో అతను తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఔరా అనిపిస్తాయి. ఈ సినిమాలోనూ అదే అనిపిస్తుంది. సినిమా ఎండింగ్ కు వచ్చేసరికి సినిమాలో మునిగిపోయెలా చేశాడు అక్కడే డైరక్టర్ సక్సెస్ అయ్యారు. పాటలు పెద్దగా మెప్పించలేదు.
నటీనటుల ప్రదర్శన : యాక్షన్ సీన్స్ లో చిరంజీవిని బాగానే ఎలివేట్ చేశారు దర్శకుడు. ఎమోషనల్ సన్నివేశాల్లో చిరు అదరగొట్టేశాడు. కీర్తి సురేష్ సైతం తన పాత్రకు న్యాయం చేసింది. తమన్నా కూడా మెప్పించింది. మిగతా నటులు ఉన్నంతలో పరవాలేదు అనిపించారు.
ఎండ్ పాయింట్ : భారీ అంచనాల నడుమ వచ్చిన భోళా శంకర్ బోల్తా కొట్టించాడు.