బండ్ల గణేష్ నోటిదూలతో కామెంట్స్ చేసి వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పంచాయితీ పెట్టుకున్నారు. నన్ను కెలకొద్దు.. విశ్వరూపం చూపిస్తానని వార్నింగ్ లు ఇచ్చారు.
అసలు విషయమేంటంటే…పవన్ కల్యాణ్ కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ బండ్ల గణేష్ పూర్తిగా ఇవ్వలేదన్న అర్థంలో అన్ స్టాపబుల్ షోలో పవన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. బండ్ల గణేష్ పవన్ కు పారితోషకం ఇవ్వకుండా మోసం చేశారని టీజ్ చేశారు. ఇంకేముంది బండ్ల గణేష్ కు కోపమొచ్చింది.
నోరు తెరిస్తే గుండె ఆగిపోయి చస్తావ్ నన్ను కెలకొద్దు అంటూ రెచ్చిపోయారు. పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ పైఆయన స్పందించక పోయుంటే బాగుండేది. కాని ఆయన ఈ విషయంలో తలదూర్చి విషయాన్ని మరింత పెద్దదిగా చేసుకున్నారు. సాధారణంగా బండ్ల గణేష్ తో సినీ ఇండస్ట్రీకి చెందిన వారెవరు పెద్దగ ర్యాపో మెయింటేన్ చేయరు. ఆయనతో సినిమా చేసిన వాళ్ళు మళ్ళీ సినిమాలు చేయరు.
సోషల్ మీడియాలో , ఈవెంట్లలో అవసరమైనప్పుడు మెగా భజన చేస్తుంటారు. రవితేజను టైగర్ అంటారు. పవన్ కళ్యాణ్ దేవుడని..అదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీని గాడ్ ఫాదర్ అంటారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో క్లారిటీ ఉండదు.
ఇక..పవన్ తో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ తీశారు. అది పవన్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. అయినా పవన్ కు రెమ్యూనరేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్న విషయం మాత్రం అందరికీ స్పష్టత వచ్చింది.