బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టీపీసీసీ చీఫ్ ను ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ పెద్దల విధానాలపై పోరాడేందుకు రేవంత్ ను అనుసరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని గతంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ విసరగా తాజాగా అదే సవాల్ ను బండి సంజయ్ విసిరారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కౌంటర్ గా బండి సంజయ్ డ్రగ్స్ కేసును ఎత్తుకున్నారు. ఏడాదికిందటి బెంగళూర్ డ్రగ్స్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ తారల ప్రమేయముందని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ తప్పదని అంత అనుకున్నారు. కాని తరువాత రాజకీయ జోక్యంతో ఆ కేసు చప్పున చల్లారిపోయింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు.
టెస్టులకు రావాలని ఒత్తిడి చేశారు. దాంతో ఆరోపణలు చేయకుండా కోర్టుకు వెళ్లి కేటీఆర్ స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో కేటీఆర్ కు రేవంత్ విసిరిన సవాల్ ను తాజాగా బండి సంజయ్ చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడుతారని, ఆయన రక్త నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానంటూ సవాల్ చేశారు. గతంలో రేవంత్ సవాల్ విసిరితే తోకముడిచిన కేటీఆర్ , ఇప్పుడు బండి సంజయ్ విసిరిన అదే చాలెంజ్ ను స్వీకరిస్తారో లేదో చూడాలి.
1 Comment
Pingback: డ్రగ్స్ టెస్టుకు ఏడాది తరువాత కేటీఆర్ రెడీ - ఏంటి మేటర్..? - Polytricks.in