బేబీ వరలక్ష్మి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలకు చెల్లెలి రోల్ చేసి మెప్పించిన అలనాటి నటి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదు దశాబ్దాలు అవుతుంది. మూప్పై ఏళ్ళపాటు నటిగా కొనసాగుతున్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.
ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు వరలక్ష్మి. హీరోలకు చెల్లెలు పాత్రలో ఆమె అయితేనే సెట్ అవుతుందన్న స్టార్ డం సంపాదించుకున్నారు. అయితే.. అప్పట్లో ప్రతి సినిమాలో రేప్ సీన్స్ ఉండేవి. హీరో చెల్లిలిని విలన్లు అత్యాచారం చేసే సన్నివేశాలు ఉండేవి. అలా చెల్లిలి పాత్రలో నటించిన బేబి వరలక్ష్మి చాలా సినిమాలో రేప్ సీన్స్ లో అత్యాచారానికి గురయ్యే అమ్మాయి పాత్రల్లో నటించారు. తాను చేసిన చెల్లెలి పాత్రల కంటే ఎక్కువగా రేప్ కి గురైన పాత్రలనే జనం ఎక్కువగా గుర్తుంచుకున్నారని అన్నారు.
రియల్ లైఫ్ లో ఓ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే తన మీద సానుభూతి చూపిస్తారు. కాని రీల్ లైఫ్ లో అత్యాచారానికి గురైన పాత్రలో నటిస్తే ఎందుకు అవమానించేవారో అర్దమైయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రేప్ సీన్స్ లో నటించినప్పుడు కూడా తాను ఇంత బాధపడలేదని.. కానీ తనను రేప్ వరలక్ష్మి, రేపుల వరలక్ష్మి అంటుంటే మాత్రం చాలా బాధపడేదాన్నని వెల్లడించారు.
చాలా మంది తోటి సహనటులు తనను రేపుల వరలక్ష్మి అంటూ పిలిచేవారని గుర్తు చేశారు. ఒకసారి ఓ సినిమా 100 రోజుల ఫంక్షన్ లో.. ‘రేపుల వరలక్ష్మి’ అంటూ మైక్ లో అరుస్తూ పిలిచారని ఆరోజు చాలా బాధపడ్డానని అన్నారు.