అన్ని వర్గాలను కడుపులో పెట్టుకునే నైజం కాంగ్రెస్ పార్టీది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత. ప్రాంతీయ పార్టీల మాదిరిగా నియంతృత్వ, కుటుంబ పోకడలకు దూరం. అందుకే కాంగ్రెస్ ప్రజల పార్టీ అయింది. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఇదే ఆనవాయితీన ముందు నుంచి కొనసాగిస్తూ వస్తున్నది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడమే ప్రజా సర్కారు ఉద్దేశం. అందుకే ఎక్కడా లేని విధంగా తెలంగాణ కేబినెట్ సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. కేబినెట్లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ఉన్నారు.

తాజాగా అజారుద్దీన్‌కు కేబినెట్లో చోటు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దేశానికి ప్రపంచకప్ తీసుకువచ్చిన టీమ్‌ను నడిపించిన సమర్ధవంతమైన లీడర్, హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అజారుద్దీన్ ఈ పదవికి అర్హుడని అంటున్నారు. ఈ పదవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎన్నికలకు మూడు నెలల ముందు మంత్రివర్గ విస్తరణ చేసిన సంగతి మరిచారా? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం రాజకీయాలు చేయదు..ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో సమర్ధులకు అవకాశాలు వస్తాయి. ఇది తెలియకుండా మాట్లాడడం సరికాదంటున్నారు విశ్లేషకులు.
 
									 
					