Author: ADMIN

కిషన్ ఇట్యాలతహసీల్ధార్ , జన్నారం మండలం , మంచిర్యాల్ జిల్లా 9908198484 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నందున మరియు వచ్చే 2022 – 23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నందున అర్హులైన బీసీ అభ్యర్ధులు రాష్ట్ర స్థాయిలో నాన్ – క్రిమిలేయర్ సర్టిఫికేట్ ని మరియు సెంట్రల్ లెవెల్ జాబ్స్ మరియు విద్యా సంస్థలలో ప్రవేశం కోసం OBC సర్టిఫికెట్ ని సులభంగా పొందడం కోసం మరియు వారికి గానీ జారీ చేసే అధికార యంత్రాంగానికి గానీ ఉండే పలు అనుమానాల నివృత్తి కోసం. వెనుకబడిన తరగతులకు (OBC ) మన రాష్ట్రస్థాయిలో (పూర్వపు AP) రిజర్వేషన్ సౌకర్యమును (25%) 1970వ సం॥లో జీ.ఓ.యం.యస్ . నెం . 1793 ద్వారా , కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు (27%) 1993 వ సం…

Read More

హైదరాబాద్‌ నలువైపులూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని సీఎం కేసీఆర్‌ తెగ హడావుడి చేస్తున్నారు. కేసీఆర్‌ ఈ హామీ ఇచ్చి కూడా దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇంత కాలానికి ఆ హామీ శంకుస్థాపన దశ పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఆస్పత్రుల నిర్మాణమే పూర్తి చేయొచ్చు.. కానీ కేసీఆర్‌ మాత్రం చాలా కష్టపడి ఇన్నాళ్లకు శంకుస్థాపనలు మాత్రం చేశారు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన ఆస్పత్రుల నిర్మాణమైనా సమీప భవిష్యత్‌లో పూర్తి అవుతుందా అనేది భేతాళ ప్రశ్నే. సారు గతంలోనూ వరంగల్‌లో 24 అంతస్తులతో, అత్యాధునికమైన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తానని మహా గొప్ప హామీ ఇచ్చారు. గతేడాది మే నెలలో ఉన్నపళంగా వరంగల్‌ జైలు కూల్చివేసి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి నిర్మాణం అధ్యయనం కోసం కెనడాకు ఒక బృందాన్ని వారంలోనే పంపుతానని గొప్పగా చెప్పారు. వరంగల్‌ జైలు కూల్చి వేసి కూడా ఏడాది కావొస్తోంది. కానీ ఇప్పటి వరకు…

Read More

రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే వారివన్నీ ఉట్టి ప్రగల్భాలే అని.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందని రైతు రుణమాఫీ పథకం అమలు తీరుని చూస్తూనే అర్థం అవుతుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన తెల్లారే రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు హామీలు ఇచ్చారు. రైతులను నమ్మించి, మోసం చేసి గద్దెనెక్కారు. ఆ వెంటనే మాట మార్చి.. దఫాలుగా మాఫీ చేస్తమన్నారు. రుణమాఫీ అయితది, కొత్త రుణాలు తీసుకుని పంటలు పండించుకోవచ్చు అని ఆశగా ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టికొట్టారు. కనీసం.. రెండో మాట ప్రకారమైనా, దఫ దఫాలుగా మాఫీ చేశారా అంటే.. అదీ లేదు. రెండోసారి అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ సగానికిపైగా రైతుల తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రశ్నించిన…

Read More

కొల్లాపూర్ లో తగ్గిన ప్రాధాన్యం కార్యక్రమాలకూ పిలవకుండా అవమానంప్రాధాన్యం ఉన్నచోటికే వెళ్లాలని నిర్ణయం జూన్ లో హస్తం గూటికి ?ఆపరేషన్ ఆకర్ష్ తో ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తోన్న కారు.. నెమ్మదిగా ఖాళీ అవుతోందా ? గులాబీ దళంలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారా ? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, వాపుని చూసి బలుపుగా భావిస్తోన్న టీఆర్ఎస్ కి త్వరలో షాక్ ల మీద షాక్ లు తగలనున్నాయా ? రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో.. కొంతమంది సీనియర్లు గుర్తింపు ఉన్నచోటికే వెళ్లేందుకే సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు… త్వరలోనే ఆ పార్టీని వీడి, తిరిగి కాంగ్రెస్ లో…

Read More

తెలంగాణ తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..హైదరాబాద్‌:-తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు ఉన్నాయి. వీటిని ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే రెండో తేదీ నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Read More

ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు తిరస్కరించిన అధిష్టానం..KCR ను పీకే కలవడాన్నీ సీరియస్ గా తీసుకున్న అధిష్టానం… కేసీఆర్ ను పీకే కలవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని ఢీల్లి పెద్దలతో చెప్పిన రేవంత్…శత్రువుతో కలిసే వాళ్ళను ఎలా నమ్మాలి అని మాణిక్యం ఠాగూర్ ట్వీట్… కేసీఆర్ తో పొత్తు ప్రతిపాదన పీకే తీసుకరవడం తో పూర్తిగా పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ప్రశాంత్ కిశోర్ డిమాండ్స్ కు నో చెప్పిన సోనియాగాంధీ.. ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచనను ముందే పసిగట్టిన కాంగ్రెస్ సీనియర్లు.. తెలంగాణ సీ.ఎం కె.సీ.ఆర్ కు మద్దతుగా ఐ ఫ్యాక్ సర్వే రిపోర్టులతో సీ.ఏం.కె.సీ.ఆర్ తో సమావేశంతో ప్రశాంత్ కిశోర్ ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. టి.పీ.సీ.సీ అధ్యక్షుడు రేవంత్ రేడ్డి ఫిర్యాదుతో వేగంగా నిర్ణయాన్ని తీసుకున్న సోనియా గాంధీ..కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుందని వరంగల్ సభలో ప్రకటించనున్న రాహూల్ గాంధీ.

Read More

వారికి పెళ్లయి నెల రోజులే అయింది.ఆ విధంగా చూసుకుంటే ఇంకా కొత్త జంటే. ఒకరి కోసం మరొకరు పరితపిస్తూ.. గడిపే ప్రతి క్షణాన్ని మధురానుభూతులతో నింపుకోవాల్సిన సమయం. కానీ ఏమైందో తెలియదు. ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. వారి మధ్య తలెత్తిన వివాదాలు.. నెల రోజుల్లోనే తారాస్థాయికి చేరాయి. అంతే విచక్షణ లోపించి భర్తపైనే దాడి చేసే స్థితికి చేరింది ఆ భార్య. బ్లేడుతో భర్త గొంతు కోసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం చోటుచేసుకుంది.పసరగొండకు చెందిన రాజ, అర్చన దంపతులు. వారికి నెల క్రితమే బంధుమిత్రులు, కుటుంబీకుల సమక్షంలో వివాహం జరిగింది. అన్యోన్య దంపతుల్లా ఉంటారనుకునే వీరి మధ్య నెల రోజుల్లోనే మనస్పర్థలు తలెత్తాయి. ఉదయం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. రాజుపై అర్చన దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న బ్లేడుతో అమానుషంగా గొంతు కోసి చంపేందుకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే రాజును వరంగల్…

Read More

ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎనిమిదో వార్డు లోని బొల్లారం డౌటన్ బజార్ లోని రాజాజీ ఇన్స్టిట్యూట్ లో వెయ్యి పడకల టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్న ప్రదేశాన్ని సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శంబీపూర్ రాజు గారు. మరియు ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంతరావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే కంటోన్మెంట్ ముద్దుబిడ్డ శ్రీ సాయన్న గారితో మరియు మల్కాజిగిరి టిఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి 26 తారీకు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే భూమి పూజ కార్యక్రమ స్థలాన్ని సందర్శించడం జరిగింది . 26 వ తేదీ నాడు తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిచే భూమి పూజ కార్యక్రమం ఉంటుందని…

Read More

మీ ఇద్దరిలో.. ఎవరు మొదట పార్టీ ని విలీనం చేస్తే… వాళ్ళకే ఆప్ తెలంగాణ కన్వీనర్ పదవి… పార్టీ ని ముందుండి నడిపే అవకాశం…!! -> ఆప్ తెలంగాణా కన్వీనర్ ఏ నియోజకవర్గం నుండి నిలబడితే.. ఆ నియోజకవర్గానికి కేజ్రివాల్ స్వయంగా వచ్చి ప్రచారం చేస్తాడు…!! అంటే… యం.యల్.ఏ గా గెలుపు తథ్యమనమాట…!! -> ఆప్ పొత్తులకు వ్యతిరేకం…!! ఆప్ కి పొత్తులు ఏ రాష్ట్రం లో కూడా వర్కౌట్ కాలేదు…!!

Read More

మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానం లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ విజయవంతం కోసం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన వివరాలు ఈ నెల 25 వ తారీఖు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు ఇతర మఖ్యనాయకుల కరీంనగర్ జిల్లా లో పర్యటిస్తారు ఈ నెల 26 తారీఖున టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా లో పర్యటిస్తారు. ఈ నెల 27న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ లో పర్యటిస్తారు

Read More