Author: ADMIN

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నైతికంగా, మానసికంగా, విషయ పరంగా బలమైన పునాదులు పడాలి. అది కేవలం విద్యార్థి దశలోనే సాధ్యపడుతుంది. అందుకే పెద్దలు పనికి, పిల్లలు బడికి అని అంటారు. కానీ నిరుపేద కుటుంబాల్లో పిల్లలకు చదువు అనేది అందనంత దూరంలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వారిది. అటువంటి దయనీయ స్థితిలో పిల్లలను బడికి పంపి చదివించడం అంటే వారికి తలకు మించిన భారంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను బడి బాట పట్టించకుండా పనికి పంపిస్తుంటారు. పిల్లలు, పెద్దలు ఇద్దరూ పనికే వెళ్తారు.  ఒకవేళ బడికి పంపినా కూడా వారికి సరైన యూనిఫాంలు, స్టేషనరీ కూడా అందించలేరు. దీంతో పేద కుటుంబానికి చెందిన పిల్లలు చదువులో వెనుకబడి పోతారు. ఇతర విద్యార్థుల్లానే చదువులో రాణించలేరు. అటువంటి పిల్లల పరిస్థితి సానా సతీష్ బాబు…

Read More

ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాదు.. ఏపీ మంత్రి కూడా. కానీ ఎంత పెద్ద పదవి ఉండి ఏం లాభం? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంటాయి ఆయన పనులు. అసలు ఆయన గారు చేసే ఘన కార్యాలు చెప్పుకుంటే తుపుక్కున ఉమ్మేస్తారు తెలిసినవారు ఎవరైనా. పైన పటారం లోన లొటారం అన్నట్లు పైకి మంత్రిగా వెలగబెడుతూ లోలోన మాత్రం దందాలు చేస్తూ పైసలు సంపాదిస్తారు. మరే అలాంటి ఇలాంటి దందాలు కాదు ఏకంగా మత్తు మందులు అమ్మే దందాలే. అంటే డ్రగ్స్, గంజాయి లాంటివి అన్నమాట. ఏంటి ఓ రాష్ట్ర మంత్రి మత్తు పదార్థాల వ్యాపారంలో ఉన్నాడా అనే అనుమానాలున్నాయా. అంటే ఆయన నేరుగా చేయకపోవచ్చు గాని చేసేవారంతా ఆయన మనుషులేనని తుని నియోజకవర్గమంతా కోడై కూస్తోంది. మీరు అనుకున్నది కరెక్టే ఆయన మరెవరో కాదు దాడిశెట్టి రామలింగేశ్వర రావు ఊరఫ్ దాడిశెట్టి రాజా ఊరఫ్ గంజాయి రాజా.   …

Read More

కోటి తిప్పలు కూటి కోసమేనని సామెత. అవును ఆ సామెత అక్షరాల నిజం. ఏ మనిషైనా కష్టపడేది ఓ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లాలని, తన కుటుంబ ఆకలి తీర్చాలని. అందుకే పని చిన్నదైనా, పెద్దదైనా అది గౌరవప్రదమైనదే. కొందరు కూలీ పనులకు వెళ్తారు, కొందరు చిరుద్యోగాలు చేస్తారు, కొందరు చదువుకు తగిన ఉద్యోగాలు చేస్తే, మరికొందరు నైపుణ్యం ఆధారంగా ఆదాయాన్ని పొందుతారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పని. ఉద్యోగాలు చేసేవారికి ప్రతి నెలా కొంత మొత్తం అని నిర్ణీతంగా వస్తుంది. దానితో వారి జీవన అవసరాలు తీరుతాయి. కొందరికి సంపాదన అవసరానికి మించి ఉంటుంది. వారు విలాసాలకు కూడా వెచ్చిస్తారు. కానీ విలాసాలు పొందలేకపోయినా కుటుంబ కనీస అవసరాలను తీర్చడానికి కొందరు స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. వారిలో నిరుపేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీధుల్లో చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబ పోషణ చేస్తారు. చాలిచాలని…

Read More

క్రీడాభిమానం – క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాస్ఫూర్తి అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అంటే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోగలిగే మానసిక సామర్థ్యం అన్నమాట. అంతేకాదు మరోసారి గెలిచేందుకు ప్రయత్నం చేయాలనే తపన కూడా. అలాంటి క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మన సానా సతీష్ బాబు గారు. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కున్నా విజయాలను సాధించేందుకు ముందుకు సాగారు. అనుకున్న లక్ష్యాలను సాధించారు.  సతీష్ బాబు గారికి చిన్ననాటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ ఆట అంటే ఎనలేని అభిమానం.  కానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన క్రీడలకంటే కూడా చదువుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. చదువుకునే సమయంలో తూర్పు గోదావరి జిల్లా స్థాయి అండర్ – 15 టీంలో క్రికెట్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. అనంతరం కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఉన్నత విద్యపై శ్రద్ధ పెట్టారు. అలా క్రీడలకు దూరమయ్యారు. ఉన్నత విద్యాభ్యాసం…

Read More

ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులకు గుడులు. పాఠశాలలో ఉపాధ్యాయులే దైవం. వారు చేసే బోధనలే జీవితంలో ఎదిగేందుకు సోపానం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర: అన్నారు పెద్దలు. అంతటి గురువు ఉండే ప్రదేశం కాబట్టే పాఠశాలలను విద్యాలయాలుగా కూడా పిలుస్తారు. అంతేకాదు పిల్లలను కూడా దేవుడి స్వరూపాలుగా భావిస్తారు. అలాంటి వారు ఉంటే పాఠశాలల నిర్వహణ ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కల్పించాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఓ అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని నిర్ణయించుకుంది.  తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుగా కాకినాడలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను గుర్తించింది. కేవలం గుర్తించడమే కాకుండా వాటిల్లో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకుంది. వాటిని పరిష్కరించాలని సంకల్పించింది. అనుకున్నదే…

Read More

కఠిన పరిస్థితులను అధిగమించి విద్యాభ్యాసం, దశాబ్ద కాలం పాటు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలు, కార్పొరేట్ స్థాయి శక్తి, ఆనందకరమైన కుటుంబ జీవితం చాలా మంది ఇవి ఉంటే చాలు అనుకుంటారు. కానీ సానా సతీష్ బాబు ఫాండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు గారికి ఇవేవి కూడా సంతృప్తిని ఇవ్వలేదు. తన జీవితం ఇంతే కాదు, ఇంకా ఏదో సాధించాలనే ఆలోచన ఆయనను వెంటాడుతూ ఉండేది. ఇక్కడితో తన గమ్యం పూర్తి కాలేదనే స్పష్టత ఆయనలో కనిపించేది. తప మనస్సాక్షి తనకేదో చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. అదేంటని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో నిద్ర దరిచేరని రోజులు ఎన్నో గడిచాయి. ఒక రోజు అనుకోకుండా మానవ సేవనే మాధవ సేవ అనే ఆలోచన తన మనసు అంతరంలో నుంచి వచ్చింది. అప్పుడు సతీష్ బాబు గారికి లోలోపల ఏదో తెలియని ఆత్మ సంతృప్తి కలిగింది. అంతే తన అసలైన లక్ష్యం ఏమిటో తెలిసింది.…

Read More

కాకినాడ ఓడరేవును అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేస్తున్నారు అధికార వైసీపీ నేతలు. అందులో ముఖ్య భూమికను పోషిస్తున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అక్రమ రవాణాకు ద్వారంగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు తలలో నాలుకల మెదలుతున్నారు. అందుకే అవినీతిపరులందరూ ఆయనకు అనుయాయులుగా, అభిమానులుగా మారిపోతున్నారనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసే ప్రధాన దందాల్లో బియ్యం అక్రమ రవాణా ఒకటనే ఆరోపణలున్నాయి. అందులోనూ పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని సైతం ఆయన అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే అనుమానాలు లేకపోలేదు. పైకి బాయిల్డ్ రైస్, బ్రోకెన్ రైస్ ఎగుమతి చేస్తున్నట్లుగా చెబుతున్నా, లోపల మాత్రం రేషన్ బియ్యమే అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ఇక్కడి పేదలకు అందాల్సిన బియ్యం స్మగ్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నట్లు పలువురు అంటున్నారు. అంటే పేదల నోటి దగ్గర కూడును కూడా లాగేస్తున్నాడన్న…

Read More

మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. అక్షరాల దాన్ని ఆచరణలో చూపిస్తున్న మహోన్నత వ్యక్తి సానా సతీష్ బాబు గారు. పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయనకు ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో పొందే మనం, సమాజానికి వీలైనంత తిరిగి ఇవ్వడం పౌరులుగా మన బాధ్యతని సతీష్ బాబు గారు అంటారు. కేవలం మాటలకే పరిమితం అవ్వగుండా చేతల్లో చేసి చూపిస్తారు. అందుకే ఎంతో మంది దాతలకు ఆయన ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవా మార్గంలో వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు.  తన సొంత జిల్లా కాకినాడలో ఉన్న పేదలు, దీనులను ఆదుకోవడానికి సానా సతీష్ బాబు సంకల్పించారు. అందుకోసం ఎటువంటి సహాయానికైనా ఎల్లప్పుడూ ఆయన ముందు ఉంటారు. స్వపర భేదం లేకుండా ఆర్తులు ఎవరు వచ్చినా తగిన సాయం చేస్తారు. దాన…

Read More

ఆయన పేరు వింటే అవినీతి ఆనందంతో గంతులేస్తుంది. అవినీతిపరుల గుండెల్లో సంతోషం పెల్లుబిక్కుతుంది. ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ అవినీతి హద్దులు లేకుండా జరిగిపోతుంది. అందులో వాటాలు కూడా ఆయనకు సజావుగా అందుతాయి. ఒకవేళ అలా జరగలేదంటే ఇక ఎవరికో సమయం దగ్గరపడిందా అనేంత ఆందోళనలు మొదలవుతాయి. మరి ఆయనెవరో అనుకుంటున్నారా? ఇంకెవరు మన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని జనం కోడై కూస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్. నడుస్తూ తిరుగుతున్న లంచాలాసురుడికి ప్రతిరూపమని అంటున్నారు. అందుకే కాకినాడ సిటీ నియోజకవర్గంలోని అవినీతిపరులకు ఆయన దైవంతో సమానం. నీతిపరులకు ఆయనంటే కోపం, ఎనలేని భయం. ఎందుకంటే ప్రశ్నిస్తే అణచివేస్తారు, అధికార బలంతో జీవితాలను నాశనం చేస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అందుకే ద్వారంపూడి పేరు వింటే ఎంత పెద్ద అధికారికైనా హడలే. అక్కడ ఇక్కడా, అది ఇది అని ఏదీ లేదు ఎక్కడ అమ్యామ్యాలు అందుతాయనుకుంటే…

Read More

కాకినాడ రాజకీయాలు త్వరలోనే ఓ సంచలనానికి కేంద్ర బిందువు కానున్నాయి. అందుకు కారణం ప్రముఖ సామాజికవేత్త, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు రాజకీయ అరంగేట్రమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఆయన కాకినాడ లోక్ సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. సామాజికవేత్తగా ఆయన సేవలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఆయన సేవా కార్యక్రమాలు సానా సతీష్ బాబు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలపరుస్తున్నాయి. కాకినాడవాసుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయన పట్ల ప్రజల్లో ఆదరణను మరింత పెంచుతున్నాయి. కాకినాడలో సకారాత్మక మార్పును తీసుకురావాలనే పట్టుదల, కాకినాడను అభివృద్ధి చేయాలనే అకుంఠిత దీక్ష సానా సతీష్ బాబును రాజకీయాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. అందులోనూ జిల్లాలో ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధిపరంగా కీలకమైన కాకినాడలో సానా సతీష్ బాబు రాజకీయ రంగ…

Read More