Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు బెంగళూరు హృదయాలయ వైద్యులు. ఈమేరకు ఆసుపత్రి వైద్యులు తారకరత్నకు సంబంధించిన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యాన్ని కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్‌లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తారకరత్నకు చికిత్స కొనసాగుతుందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. శుక్రవారం నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. Also Read : తారకరత్న పరిస్థితి విషమం- బెంగళూర్ కు తరలింపు..? నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల…
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు వెళ్ళే ముందు అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని షర్మిల నివాసానికి వెళ్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఏయే అంశాలపై మాట్లాడారో స్పష్టత లేదు కాని.. విజయమ్మను కలవడానికి వెళ్ళారని జగన్ అనుకూల మీడియా సాక్షి చెబుతోంది. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ కుటుంబీకుల మధ్య విబేధాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని అందుకే ఆయనను కుటుంబ సభ్యులు దూరం చేసుకుంటున్నారని చెబుతున్నారు. షర్మిల కూడా ఇదే విషయమై జగన్ తో విబేధించారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి షర్మిల నివాసానికి వెళ్లి విజయమ్మతో సమావేశమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా..అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు సీబీఐ అధికారులకు షరతులు పెడుతూ లేఖలు పంపారు. తనపై ఓ వర్గం…
ఇటీవలి వరుస పరిణామాలు టీడీపీని కుంగదీస్తున్నాయి. పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపడుతున్న దశలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేపట్టగా ఆ యాత్ర మొదలైన కాసేపటికే నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేస్తుందని భారీ అంచనాల నడుమ మొదలైన పాదయత్ర ప్రారంభం రోజే ఈ అపశ్రుతి చోటుచేసుకోవడం పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు. ఇటీవలి చంద్రబాబు వరుస సభలో 11మంది మరణించగా.. తాజాగా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న అస్వస్థతకు గురి కావడం పార్టీ వర్గాలను బాధిస్తోంది. అదే సమయంలో పాదయాత్రపై కంటే మీడియా ఫోకస్ తారకరత్న హెల్త్ అప్డేట్ పైనే పడింది. జనాలు కూడా తారక్ రత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు. అయితే..ఈ వరుస సంఘటనలు వైసీపీకి అస్త్రంగా మారాయి.…
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గడిచిన కొద్దినెలల్లోనే కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ వంటి వారు కాలం చేశారు. తాజాగా మహానటి మూడు దశాబ్దాలపాటు అగ్రహీరోయిన్ గా అలరించిన జమున కన్నుమూశారు. ఆమె మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీనటిగానే కాదు.. రాజకీయ రంగంలోనూ విశేషంగా రాణించింది జమున. దాంతో ఆమె మరణం పాటల చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా రాజకీయ నేతలు కూడా సంతాపం తెలిపారు. కాని జమున పార్ధివ దేహాన్ని చూసేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు కాలేదు. దీనిపై కమెడియన్ అలీ స్పందించారు. కొంతకాలం నుంచి జమున క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ మహాతల్లి అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె రాజకీయాల్లోనూ ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. ఆమె సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా “మూగమనసులు”. Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ – పవన్ కళ్యాణ్…
తెలంగాణ గవర్నర్ తమిళి సై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ సర్కార్ పై వెనక్కి తగ్గేదేలే అని గవర్నర్ అనుకుంటున్నారు. అందుకే ఆమె టీవీ డిబేట్లకు కూడా వెళ్తున్నారు. సర్కార్ ను కడిగేస్తున్నారు. నేరుగా విమర్శలు చేస్తున్నారు. మహిళా గవర్నర్ పై వివక్ష ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ప్రతి విమర్శలు చేసేలా చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎఎస్ నేతలు సందేహిస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెడుతున్నారని ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె రాజకీయ విమర్శలు చేయడం ప్రభుత్వ పెద్దలకు అస్సలు రుచించడం లేదు. ఆమె ఇలా రాజకీయ విమర్శలు చేసే స్థాయికి చేరుకున్నారంటే.. ప్రభుత్వం ఆమెను ఎంతగా ఇబ్బంది పెడుతుందోననే అభిప్రాయం సహజంగానే జనాల్లో ఏర్పడుతోంది. తన విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్…
గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. ప్రజా ధనాన్ని రుణాలుగా తీసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించింది. అదానీ కంపెనీ షేర్లన్నీ నీటిబుడగలేనని… ఎప్పుడైనా పేలిపోవచ్చునని అంటున్నారు. మార్కెట్ పై అవగాహనా ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. కాని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అదానీకి సపోర్ట్ గా ఉండటంతో ఆయనకొచ్చిన ముప్పేమీ లేదనుకున్నారు. కానీ హిండెన్‌బర్గ్ బయటపెట్టిన నివేదికతో పరిస్థితి తలకిందులు అవుతోంది. హిండెన్‌బర్గ్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ అబద్దమని చెప్పే ధైర్యం అదానీ గ్రూప్ చేయడం లేదు. ఎందుకంటే.. ఆ సంస్థపై ఎదురుదాడి చేస్తే మరిన్ని వివరాలను బయటపెడుతుందని భయం. అందుకే ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది తప్ప.. నిజాలెంటో చెప్పడం లేదు. తాము చెప్పింది అవాస్తమని అనుకుంటే లీగల్ గా ఎదుర్కొండని హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించాక కూడా అదానీ గ్రూప్ న్యాయపోరాటానికి కూడా సిద్దపడటం లేదు. అదానీ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. గతంలోనూ…
భారతదేశంలో కులమున్నది నిజం. అది అందరి నరనరాల్లోకి వ్యాప్తి చెందింది. దాన్ని ప్రారద్రోలడం అంత సులువేం కాదు. దీన్ని సెలైన్ లా ఎక్కించారు. ఇందుకు సినిమాలు మినహాయింపేమీ కాదు. కులం సినీ ఇండస్ట్రీలోనూ ఉంటుందని ఆర్ఆర్ఆర్ సినిమా “నాటు నాటు పాట” ఆస్కార్ అవార్డు రేసులో నిలిచిన సందర్భంగా మరోసారి నిరూపితమైనది. కులానికి టాలెంట్ తో పనిలేదు.పైకులమైతే ప్రతిభతో అసలే పనిలేదు. కింది స్థాయి కులాలకు చెందిన వారికీ ఎంత ప్రతిభ ఉన్న వ్యర్ధమేనని… ఈ పాట ఆస్కార్ రేసులో నిలిచిన సందర్భంగా దక్కుతోన్న అభినందనల బట్టి అర్థం అవుతుంది. కులం ఎప్పుడు ఎదో ఒక రూపంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, తన ఉనికికి చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవార్డుల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. ఆ ఆశకి, ఆరాటానికి ఓ ఆదర్శనీయమైన విషయం ఉండాల్సిన పనిలేదు. ఆ అవార్డులకు , అర్హతకు కులమే ప్రధాన అర్హత. ఆ కులం అవార్డుల కోసం…
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ – కశ్మీర్ లో తాత్కాలికంగా నిలిచిపోయింది. భద్రత లోపాల వలన జన సమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం విఫలం కావడమే ఇందుకు కారణం. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయం చెప్పారు. తన భద్రత సిబ్బంది సూచనల మేరకు నేటి పాదయాత్రను విరమించుకున్నానని వెల్లడించారు. కశ్మీర్ లోయకు ప్రవేశద్వారమైన ఖజీగుండ్ సమీపంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బనిహాల్ టన్నెల్ దాటి ఖజీగుండ్ కు చేరుకున్న రాహుల్ గాంధీ.. షెడ్యూల్ మేరకు సౌత్ కశ్మీర్ లోని వెస్సు వైపు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాని అంతలోనే బాహ్య భద్రత వలయాన్ని నిర్వహించాల్సిన పోలీసులు ఎస్కేప్ అయ్యారు. దీంతో భారీ జన సమూహాలను నియత్రించే వారు లేకపోవడంతో రాహుల్ భద్రత సిబ్బంది యాత్రను విరమించుకోవాలని సూచించారు. చేసేదేం లేక రాహుల్ తాత్కాలికంగా యాత్రను విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. శుక్రవారం 11కి. మీ మేర…
గౌతమ్ అదానీ కంపెనీలన్నీ పేక మేడలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అదానీ సంస్థలు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అబద్దాలనునివేదించిందని చెప్పారు. కానీ నిజాలు ఏంటో అదానీ గ్రూప్ కూడా చెప్పలేదు. తాము ప్రకటించిన వివరాలు తప్పైతే .. తమపై లీగల్ గా ప్రొసీడ్ కావాలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సవాల్ చేసింది. అయినప్పటికీ అదానీ గ్రూప్ ఎలాంటి రియాక్షన్ లేకపోయింది. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుండి అదే పనిగా అమ్మకాలు కొనసాగాయి. అదానీ కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం సన్నగిల్లడంతో కంపెనీలన్నీ భారీ నష్టాలు చవిచూశాయి. ఒకటో.. రెండో కాకుండా ఏకంగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు షేర్ల ధరలు పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ వాల్యూ ఇరవై శాతంకు పడిపోయింది. రెండు రోజుల్లోనే పదకొండు లక్షల కోట్ల రూపాయలను ఇన్వెస్టర్లు…
తెలంగాణ ప్రజలను కేసీఆర్ నమ్మించి గొంతు కొసిండని విమర్శించారు నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని తూర్పారబట్టారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్న వంశీకృష్ణ.. కేసీఆర్ ను పూర్తిస్థాయిలో ఫామ్ హౌజ్ కు పరిమితం చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అచ్చంపేట నియోజకవర్గం చారకొండ మండలం రామచంద్ర పురంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను లాంఛనంగా ప్రారంభించారు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు డా.మల్లు రవితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఇంటికో ఉద్యోగం, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లంటూ పేదలను కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడం చేతకాక.. సొంత జాగ ఉనోళ్ళకు…