టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గడిచిన కొద్దినెలల్లోనే కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ వంటి వారు కాలం చేశారు. తాజాగా మహానటి మూడు దశాబ్దాలపాటు అగ్రహీరోయిన్ గా అలరించిన జమున కన్నుమూశారు. ఆమె మరణం పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
సినీనటిగానే కాదు.. రాజకీయ రంగంలోనూ విశేషంగా రాణించింది జమున. దాంతో ఆమె మరణం పాటల చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా రాజకీయ నేతలు కూడా సంతాపం తెలిపారు. కాని జమున పార్ధివ దేహాన్ని చూసేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు కాలేదు. దీనిపై కమెడియన్ అలీ స్పందించారు.
కొంతకాలం నుంచి జమున క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆ మహాతల్లి అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె రాజకీయాల్లోనూ ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. ఆమె సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా “మూగమనసులు”.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ – పవన్ కళ్యాణ్ పై అలీ పోటీ
ఆమె హీరోయిన్ గానే కాదు..నిర్మాతగా కూడా చేసింది. సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది. అలాంటి మహానటి చనిపోతే ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే ఒక్కరు కూడా ఇక్కడ రాలేదు. ఇది బాధాకరమన్నారు అలీ. బహుశ వాళ్ళకు సమాచారం చేరినట్టు లేదు.. అందుకే రాలేకపోయారేమోనని అన్నారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ అలీ పరోక్షంగా ఈ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు.