Author: Prashanth Pagilla

ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదిక చుట్టే ఈ చర్చంతా సాగుతోంది. అదానీ గ్రూప్ అవకవతకలకు పాల్పడిందని 88ప్రశ్నలతో హిండెన్ బర్గ్ బయటపెట్టిన నివేదిక దెబ్బకు భారత షేర్ మార్కెట్లు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి.ఎన్నడు లేని విధంగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఏ న్యూస్ ఛానెల్ చూసినా, ఏ పేపర్ తిరిగేసినా, మార్కెట్లు నిపుణులు కలిసినా అంత ఒకటే చర్చ. హిండెన్ బర్గ్ నివేదిక గురించే. ఇంతకీ హిండెన్ బర్గ్ చరిత్ర ఏంటి..? దాని లక్ష్యమేంటి..? అది ఎవరి సారధ్యంలో నడుస్తుంది అనే అంశాలను ఈ కథనంలో చూద్దాం. నాథన్ అండర్సన్  2017లో నాథన్ అండర్సన్ అనే వ్యక్తి హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థను స్థాపించాడు. న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ పని చేస్తోంది. అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకున్నాడు అండర్సన్. ఆ తరువాత జెరూసలేంలో…

Read More

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సంతకం చేయకుండా హోల్డ్ లో పెట్టిన బడ్జెట్ ఫైల్ పై సంతకం చేశారు. గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేస్తామనే సర్కార్ ప్రకటనతో ఫిబ్రవరి మూడో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టె అవకాశం లేదు. రెండు రోజుల తరువాత ఫిబ్రవరి 6న బడ్జెట్ ను ప్రవేశపెట్టె చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సంబంధం లేకుండా సభ సమావేశాలను నిర్వహించేందుకు మూడో సెషన్లను ప్రోరోగ్ చేయలేదు. ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ గత సమావేశాలకు కొనసాగింపుగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణం చూపే గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. గత ఏడాది కూడా ఇదే వాదనను వెలిబుచ్చారు. ఇప్పుడు మాత్రం హైకోర్టుకు వెళ్లి ఇరకాటంలో పడిన ప్రభుత్వం… గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలిపింది. గవర్నర్ ప్రసంగం…

Read More

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా అలరించిన ఇలియానా అస్వస్థతకు గురైంది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఒకరోజులో చాలా మారవచ్చు. కొంతమంది లవ్లీ డాక్టర్లు , మూడు బ్యాగుల IV ఫ్లూయిడ్స్, అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా. ఇంతకీ ఇలియానాకు ఏమైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చేసిన ఇలియానా వెంటనే మరో పోస్ట్ కూడా చేసింది. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది మెసేజ్ లు చేస్తున్నారు. ఇలాంటి ప్రేమ అందరికీ సాధ్యం కాదు. ఈ ప్రేమను పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. సకాలంలో వైద్యం కంప్లీట్ అయింది. అని చెప్పుకొచ్చింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం…

Read More

యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సోమ్మిసోల్లిపడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని మొదట కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్యంపై వస్తోన్న రిపోర్టులు, కుటుంబ సభ్యుల ప్రజతనాలు , మీడియాలో వస్తోన్న కథనాలు గందరగోళంగా ఉన్నాయి. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని మొదటి నుంచి చెబుతున్నారు. నందమూరి రామకృష్ణ మాత్రం.. తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతోందని.. ఎక్మో పెట్టలేదని.. చికిత్స స్పందిస్తున్నారని చెప్పారు. రామకృష్ణ మాట్లాడిన కొద్దిసేపటికే నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇది రామకృష్ణ మాటలకు పూర్తి భిన్నంగా ఉంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయనకు…

Read More

పాకిస్థాన్ లో మహిళలపై జరుగుతోన్న దారుణాలు నానాటికీ అధికం అవుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ హిందూ మహిళపై కొంతమంది కామందులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మతం మారాలంటూ ఒత్తిడి చేస్తు ఈ దారుణానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింద్ ప్రావిన్స్ లో ఓ మహిళ పట్ల కొంతమంది వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలంటూ ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో కిడ్నాప్ చేసి ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు బంధించి మహిళాపై విడతల వారీగా అత్యాచారం చేశారు. చాకచక్యంగా ఆ కామందుల బారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో,…

Read More

మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను అనుమానించింది అతడి భార్య. దాంతో భర్త కదలికలపై నిఘా పెట్టింది. నిజంగానే అతడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రూడీ చేసుకుంది. విషయం బయటకు చెప్తే భర్తపై ఆరోపణలు చేసినట్టు అవుతుందని.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బుద్ది చెప్పాలనుకుంది. ఇందుకోసం ఆ మహిళా ఏం చేసిందో మీరూ తెలుసుకోండి. థాయ్‌లాండ్‌‌కు చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సందేహించింది. అప్పటికీ పూర్తిస్థాయిలో ఆమెకు కూడా సందేహమే. నిజంగానే తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నాడా..? తనే ఏమైనా అతిగా ఆలోచిస్తున్నానా..? అని పరిపరివిధలా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ రోజు తన భర్త పర్స్‌లో ఓ లేడీస్ క్లబ్(సెక్స్ షాప్) రసీదు దొరికింది. నిజంగానే తన భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని డిసైడ్ అయింది. తనకు దొరికిన క్లబ్…

Read More

బడ్జెట్ ఫైల్ ను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గింది. గవర్నర్ ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తామంటూ హైకోర్టుకు చెప్పి అత్యవసర పిటిషన్ ను ఉపసంహరించుకుంది. ఫిబ్రవరి మూడో తేదీన అసెంబ్లీని సమావేశపరిచి.. అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బడ్జెట్ ఫైల్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. కాని గవర్నర్ మాత్రం తన ప్రసంగం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రగతి భవన్ కు లేఖ రాశారు. దీంతో బడ్జెట్ ఫైల్ ను గవర్నర్ ఆమోదించరని సర్కార్ డిసైడ్ అయింది. దాంతో కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి.. ఇది హైకోర్టు విచారించే అంశం కాదు. రాజ్యాంగబద్దమైన పదవుల్లోనున్న వ్యక్తులను గవర్నర్ లను హైకోర్టులు ఆదేశించలేవు. అలాగే.. గవర్నర్ ప్రసంగం పెట్టాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించలేదు. అయినా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏ న్యాయసలహాదారు…

Read More

హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదికపై అదానీ గ్రూప్ ఆలస్యంగా రియాక్ట్ అయింది. తాము బయటపెట్టిన నివేదిక తప్పైతే న్యాయస్థానాల్లో దావా వేయాలని హిండెన్ బర్గ్ సవాల్ చేసిన.. మూడు రోజుల తరువాత ఆరు పేజీలతో వివరణ ఇచ్చి ఎదురుదాడి ప్రారంభించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదికను దేశంపై దాడిగా అభివర్ణించింది అదానీ గ్రూప్. దేశ వృద్దిని తట్టుకోలేక ఇలాంటి నివేదికను రూపొందించారని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో ఏం జరిగినా దేశం కోసం ధర్మం కోసమని బీజేపీ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునేది. ఇప్పుడు ఈ వ్యూహాన్ని అదానీ గ్రూప్ కూడా ట్రై చేస్తోంది. గతంలో అమెరికాలోని పలు కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడ్డాయి. వాటి వివరాలను హిండెన్ బర్గ్ బయట పెట్టింది. అప్పుడు అక్కడి సంస్థలేవి తమ దేశంపై హిండెన్ బర్గ్ దాడి చేస్తోందని అనలేదు. కాని ఇండియాలో మాత్రం జాతీయవాదాన్నికున్న పవర్ దృష్ట్యా, మోడీకి సన్నిహితుడు…

Read More

తెలంగాణ బీజేపీలోకి చేరికలు భారీ ఎత్తున ఉంటాయని..ఊహించని నేతలు పార్టీలో చేరుతారని డంఖా బజాయించుకొని చెప్పుకున్నారు. చేరికల సంగతి దేవుడెరుగు..ఉన్న నేతలే బీజేపీని వీడే పరిస్థితులు కనిపించడంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీని ఎవరూ వీడోద్దని.. బీజేపీని వీడిన నేతలు తిరిగి రావాలని సందేశం వినిపిస్తున్నారు బండి సంజయ్. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. తెలంగాణ బీజేపీలోని అంతర్గత కలహాలను రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో అసంతృప్త నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈటల, వివేక్ , జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల లక్ష్యం బీజేపీలో ఉంటె నెరవేరదని…వారికీ సరైన వేదిక కాంగ్రెస్ మాత్రమేనని సందేశం పంపుతున్నారు. వాస్తవానికి.. వీరంతా బీజేపీలో ప్రాధాన్యత లేకుండా కొనసాగుతున్నారు. దాంతో వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రాజకీయ వ్యూహాలతో బీజేపీలో ఆందోళన మొదలైంది. అందుకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా…

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆందోళన బాట పట్టింది. కరెంట్ కోతలను నిరసిస్తూ విద్యుత్ సబ్ స్టేషన్ లను ముట్టడించింది. అంతరాయం లేకుండా కరెంట్ ను సరఫరా చేయాలంటూ కంటిన్యూగా ఆందోళన చేస్తున్నారు రైతులు. అప్రకటిత కరెంట్ కోతలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దాంతో మొదట జనగామ రైతులు ఆందోళన బాట పట్టారు ఆ తరువాత వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామం, నల్లబెల్లి రైతులు కూడా మేము సైతం అంటూ ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు విదిస్తుండటంతో రైతులు ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఓ వైపు ప్రభుత్వం 24గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెబుతోంది. కాని రోజుకు ఐదు గంటలకు మించి కూడా కరెంట్ ఉండటం లేదని రైతులు విద్యుత్ అధికారులను నిలదీస్తున్నారు. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు పూర్తిగా పంటపొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.…

Read More