Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
650కోట్లతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు. ఈ నెల 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా సెక్రటేరియట్ ను ఓపెన్ చేయనున్నారు. అయితే.. నూతన సెక్రటేరియట్ లోకి సందర్శకులను అంటే ప్రజలని అంత ఈజీగా లోపలికి అనుమతించారని అధికారులు చెప్తున్నారు. మరీ…ముఖ్యంగా ఆరో అంతస్తులో ఉండే సీఎంవోలోకి జనాలను అసలే అనుమతించారట. ప్రజా సమస్యలను వినేందుకు గతంలో సచివాలయాన్ని ఓ వేదికగా చేసుకున్నారు ముఖ్యమంత్రులు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు ప్రజలను కలిసి.. వారిచ్చే వినతి పత్రాలను తీసుకొని సమస్యలను పరిష్కరించేవారు.ఇలా చేయడం ద్వారా వైఎస్సార్ ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకొని మహానేత అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిగా సచివాలయానికి వెళ్ళని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలోకెక్కాడు. ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం తన పంథా మార్చుకోలేదు. సచివాలయంలో కేసీఆర్ లేకున్నా, ఫామ్ హౌజ్ లోనున్నా, ప్రగతి భవన్…
గవర్నర్ తో పంచాయితీ పెట్టుకోవద్దని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. గవర్నర్ తో పోరు ఎటొచ్చి తమకే ఇబ్బందికరంగా మారుతుందని ఇక కాస్త ఆచితూచి వ్యవహరించాలని ఫిక్స్ అయింది. గవర్నర్ చెప్పినట్టు నడుచుకోవాలని..లేదంటే ప్రజల ముందు పరువు పోయేలా ఉందని ఓ అంచనాకు వచ్చినట్టుంది ప్రభుత్వం. అందుకే గవర్నర్ చెప్పినదానికల్లా ఒకే చెప్తుంది. చివరికి ప్రభుత్వం తరుఫున గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన స్పీచ్ ను మార్చమంటే మార్చేస్తాం మేడం అంటూ హామీ ఇస్తున్నారు. ఆమె చెప్పినట్టుగా తలాడిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని భావించి.. గత సమావేశాలకు కొనసాగింపుగానే సభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. తరువాత మారిన పరిణామాలతో గవర్నర్ తో నోటిఫికేషన్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి… గవర్నర్ స్పీచ్ ను ఆమెకు ముందుగానే పంపారు. ఆ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు. వాస్తవాలను ప్రతిబింబించేలా స్పీచ్ ఉండాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్…
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కేటీఆర్ క్లిష్టమైన నియోజకవర్గాలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా ఈటలను ఓడించాలనుకుంటున్న ఆ పార్టీ పెద్దలు.. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ అభ్యర్థి ఎవరో అప్పుడే ప్రకటించేశారు. హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్ అనౌన్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కౌశిక్ రెడ్డికి సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలపై ఓయూ విద్యార్ధి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయగా.. తాజాగా ఆయన సమక్షంలోనే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని.. కౌశిక్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరనీ కేటీఆర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. అయితే.. అదంతా ఈటల పార్టీలో ఉన్నప్పుడు. ఆయన…
బీజేపీ, బీఆర్ఎస్ లకు గట్టి షాక్ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతున్నారు టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీలోకి చేరికలను ముమ్మరం చేసేందుకు ఆయన అంతర్గతంగా నేతలతో చర్చిస్తునారు. ఈ విషయం బయటకు రాకుండా అత్యంత సీక్రెట్ గా బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొంతమంది నేతలకు తొందరపడొద్దని చెప్తున్నా రేవంత్.. మరికొంతమంది నేతలను మాత్రం ఉన్నపళంగా కాంగ్రెస్ లో చేరాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటల రాజేందర్ తోపాటు బీఆర్ఎస్ అసమ్మత్తి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు కోరం కనకయ్యతోపటు మరికొంతమంది నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు తెరవెనక రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కోరం కనకయ్యలు కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు ఒకే చెప్పగా.. ఈటల మాత్రం కాస్త డైలమాలో పడినట్లు సమాచారం. ఇప్పటికప్పుడు బీజేపీని వీడితే ఎలాంటి పరిస్థితులు…
సిద్దిపేట కలెక్టర్ గా కొనసాగుతూ..రాత్రికి రాత్రి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామరెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు చేపట్టింది. అధికారిగా కొనసాగుతూనే…రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆయన బిజినెస్ చేసేవారు. ఆ కంపెనీ పేరు రాజ్ పుష్ప. ఇపుడు అదే కంపెనీపై పెద్ద ఎత్తున దాడులు జరుతున్నాయి. ఆ కంపెనీతో సంబంధమున్న ఇతర సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. రాజ్ పుష్పతోపాటు వసుధ ఫార్మా, పలు కంపెనీలపై దాడులు జరుగుతున్నాయి. ఫార్మా పేరుతో రాని ఆదాయం చూపించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.మొత్తంగా యాభై ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ట్యా క్స్ ఎగవేత కాదు ..బ్లాక్ మనీ కూడా బయటకు వస్తుందని అంటున్నారు. కలెక్టర్ గా ఉంటూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గతంలోనే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విలువైన భూములను కలెక్టర్ కు ప్రభుత్వం కట్టబెట్టినదని ఆరోపించారు. ఆయన ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలకు బినామీ అని…
ట్రాన్స్ జెండర్ లను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు అధికం అవుతున్నాయి. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ ను ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కూడా పెట్టాడు. కాని కుటంబ సభ్యుల నుంచి ఆ జంట తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటుంది. పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి రవి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకి దారి తీసింది. ఇద్దరు కలిసి జీవించాలనుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాము ఒక్కటిగా కలిసి జీవించేందుకు రవి అనే యువకుడు ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. తన పేరును మీన్ రియగా మార్చుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఓ పాపను కూడా దత్తత తీసుకొని ఆనందంగా గడుపుతున్నారు. అర్జున్ – మీన్ రియాలను విడదీసేందుకు రియా కుటుంబం వారి మధ్యలోకి ప్రవేశించింది. పెళ్లి కోసం అమ్మాయిగా మరి పరువు తీశాడని రియాను వేధించడం…
నందమూరి తారకరత్న తొందరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధనలు చేస్తున్నారు. తాతయ్య ఆశీస్సులతో తారకరత్న మామూలు మనిషిగా మన ముంగిటకు వస్తాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తారకరత్న కోలుకుంటున్నాడని నందమూరి రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందనే ప్రకటనే అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తింది. అంతలోనే మళ్ళీ షాక్. నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. తారక రత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్ తో పాటుఇతర లైఫ్ సప్పోర్ట్ సిస్టమ్స్ అమర్చడం జరిగింది. ఎక్మో చికిత్స జరగలేదు. తారకరత్న హెల్త్ పై కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. వైద్యులమైన మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండని హెల్త్ బులెటిన్ లో పొందుపరిచారు. తారకరత్న కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన కొద్ది గంటల్లోనే వైద్యులు ఈ ప్రకటన చేయడం అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది. నేడు లేదా రేపు తారకరత్న హెల్త్…
యాంకర్ అనసూయ గర్భం దాల్చింది. అదేంటి ఈ వయస్సులో ఆమె తల్లి కావడమేంటని ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు . ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ , అనసూయ నటిస్తున్నారు. బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. రంగమార్తాండ వర్కింగ్ స్టిల్ ఒకటి అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో పెళ్లి కూతురిగా శివాత్మిక కనిపించగా…ఆమె పక్కనే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు పెళ్లి పందిరిలో కనిపిస్తున్నారు. అదే ఫ్రేంలో అనసూయ కూడా ఉంటుంది. అనసూయ లుక్ చేస్తే ఆసక్తికర విషయం తెలుసుకోవచ్చు. రంగమార్తాండ చిత్రంలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమన్ గా నటిస్తున్నారని ఈ ఫోటోను బట్టి అర్థం అవుతుంది.…
నిరుద్యోగులకు తపాలశాఖ అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. పదో తరగతి పూర్తైన వారందరూ పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాళీగానున్న 40వేల ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల ఎంపికకు ప్రత్యేకంగా రాత పరీక్ష ఏమి ఉండదు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడుతారు. ఎంపికైనవారు ఆయ బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఖాళీలు, వేతన వివరాలు నలభై వేల ఉద్యోగాలకుగాను ఏపీలో 2480, తెలంగాణలో 1266, అసోం- 407, బిహార్- 1461, ఛత్తీస్‌గఢ్-1593, దిల్లీ – 46, గుజరాత్- 2017, హరియాణా- 354, హిమాచల్‌ప్రదేశ్- 603, జమ్ము కశ్మీర్- 300, ఝార్ఖండ్- 1590, కర్ణాటక- 3036, కేరళ- 2462, మధ్యప్రదేశ్- 1841, మహారాష్ట్ర- 2508, నార్త్ ఈస్టర్న్- 923, ఒడిశా-…
బీజేపీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయనను చిక్కులో పడేశాయి. సొంత పార్టీ నేతలే ఈటలపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో కొనసాగుతూ ఈవ్యాఖ్యలు చేయడం వలన జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈటల వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈటలను ఎలాగైనా పార్టీలో బలహీనపరచాలని ఆయనకు వ్యతిరేకంగా కొంతమందిని ఎగదోస్తున్నారని చెబుతున్నారు. తాజాగా విజయశాంతి స్పందించారు. ఈటల పేరును ప్రస్తావించకుండా మాట్లాడారు. పార్టీలో కోవర్టులు ఉంటె వారెవరో.. పేర్లతో సహా బయట పెట్టాలి. అంతేకాని ఊరికే కోవర్టులున్నారని మాట్లాడితే ఎలా అంటూ ఈటలనుద్దేశించి ప్రశ్నించారు. ఇన్నాళ్ళు ఈటలకు మద్దతురాలిగా కొనసాగిన ఆమె తాజాగా రివర్స్ కావడం పార్టీలో అనేక సందేహాలను లేవనెత్తుతోంది. ఇదే విషయమై బండి సంజయ్ కూడా స్పందించారు. బీజేపీ సిద్ధాంతం కల్గిన పార్టీ అని, తమ పార్టీలో ఎవరూ కోవర్టులు ఉండరని…