యాంకర్ అనసూయ గర్భం దాల్చింది. అదేంటి ఈ వయస్సులో ఆమె తల్లి కావడమేంటని ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు . ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ , అనసూయ నటిస్తున్నారు. బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. రంగమార్తాండ వర్కింగ్ స్టిల్ ఒకటి అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో పెళ్లి కూతురిగా శివాత్మిక కనిపించగా…ఆమె పక్కనే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు పెళ్లి పందిరిలో కనిపిస్తున్నారు. అదే ఫ్రేంలో అనసూయ కూడా ఉంటుంది. అనసూయ లుక్ చేస్తే ఆసక్తికర విషయం తెలుసుకోవచ్చు.
రంగమార్తాండ చిత్రంలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమన్ గా నటిస్తున్నారని ఈ ఫోటోను బట్టి అర్థం అవుతుంది. అనసూయ షేర్ చేసిన వర్కింగ్ స్టైల్ లో ఆమె గర్భంతో కనిపించారు. నిజానికి అనసూయ రంగమార్తాండ మూవీలో దేవదాసి రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటో దేవదాసి అనే వాదనను ఖండించేదిగా ఉంది.ఈ లెక్కన రంగమార్తాండ మూవీలో అనసూయ తల్లి అయ్యారన్న మాట.థాంక్యూ బ్రదర్ అనే మూవీలోనూ అనసూయ ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రంగమార్తాండ సినిమాలోనూ మరోసారి ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో కనిపిస్తున్నారు.