Author: Prashanth Pagilla

బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య‌లో నంద‌మూరి తార‌క‌ర‌త్న‌కు వెంటిలేట‌ర్ పై చికిత్స కొన‌సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మంగళవారం మాత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రాకపోవడం కుటుంబ సభ్యులను వేదనకు గురి చేస్తోంది. ఆయనకు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతోనే.. మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదని తెలుస్తోంది. మిగిలిన వైద్య పరీక్షలు పూర్తి చేశాక బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి వరకు కూడా తారకరత్న వైద్య పరీక్షల రిపోర్ట్ లు రాకపోతే హెల్త్ బులిటెన్ గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పైనే తారకరత్నకు చికిత్స కొన‌సాగుతోంది. ఎక్మో ద్వార చికిత్స అందిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను కుటుంబ స‌భ్యులు కొట్టిపారేశారు. మెద‌డుకు సంబంధించి సిటీ స్కాన్ ప‌రీక్ష‌ల రిపోర్టు రావాల్సి ఉంద‌ని, బుధ‌వారం మ‌రికొన్ని…

Read More

అతికి మారుపేరు టీవీ9. ఏ న్యూస్ అయిన తామే ముందుగా ప్రసారం చేయాలనే తాపత్రయంతో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ అలవాటు ఎంతవరకు వెళ్లిందంటే.. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వచ్చిందని ప్రసారం చేసే వరకు వెళ్ళింది. ఇంతకీ విషయమేంటంటే…అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణే జరగలేదు. కాని తీర్పు వచ్చేసిందని.. విశాఖపట్నం రాజధానికి అడ్డంకులు తొలగిపోయాయని బ్రేకింగ్ ప్రసారం చేసింది. బుధవారం ఉదయం పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న సమయంలో టీవీ9 బ్రేకింగ్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని..దాంతో విశాఖపట్నం రాజధాని చేయాలన్న సర్కార్ నిర్ణయానికి ఇక లైన్ క్లియర్ అయినట్లేనని ఆ బ్రేకింగ్ సారాంశం. పేరుమోసిన చానెల్ కావడంతో అందరూ నిజమేననుకొని క్రాస్ చెక్ చేసుకున్నారు. తీరా ఈ అంశంపై ఏడో తేదీన విచారణ జరగనుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో కనిపించింది. దాంతో టీవీ9 వాలకంపై విమర్శల…

Read More

వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. యాపిల్‌ ఐఫోన్‌ 6, మొదటి జనరేషన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ లేదా పాత ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడే వారి మొబైల్ లో నేటి నుంచి వాట్సాప్‌ పని చేయదని హెచ్‌టీ టెక్‌ వెల్లడించింది. ఇకపై ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వెర్షన్‌ 4.0.3 లేదా కొత్త వెర్షన్‌ ఉంటేనే వాట్సాప్‌ పనిచేస్తుంది. అలాగే ఐఓఎస్‌ వెర్షన్‌ 12 ఆపై స్థాయివే వాట్సాప్‌ సేవలకు అనుకూలం. దీని కన్నా పాత వెర్షన్‌ ఫోన్లలో వాట్సాప్‌ పని చేయదు. వాట్సాప్‌ పనిచేయని ఫోన్లు ఇవే.. యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ(మొదటి జనరేషన్‌) శామ్‌సంగ్‌ గెలాక్సీ కోర్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏస్‌ 2 శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌3 మినీ శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్రెండ్‌ ఐఐ శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ కవర్‌ 2 విన్కో డార్క్‌నైట్‌ అర్చొస్‌ 53 ప్లాటినమ్‌…

Read More

నారా లోకేష్ చేపట్టిన “యువగళం” పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి ప్రస్తుతం బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటిస్తున్నారు. నిష్ణాతులైన వైద్య బృందం తారకరత్నకు వైద్య సేవలందిస్తోంది. ఆయన కోలుకుంటారని త్వరలోనే మామూలు మనిషిగా తిరిగి వస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్న తారకరత్న తాజాగా పాదయాత్రలో పాల్గొని సొమ్మసిల్లి పడిపోవడంతో ఒక్కసారిగా ఆయన గురించిన చర్చ ప్రారంభమైంది. చాలామంది తారకరత్న వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తారకరత్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి అల్లుడు అవుతాడు. విజయసాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహంతోనే ఆయన కుటుంబానికి దూరమయ్యాడు. అలేఖ్య రెడ్డి ఇండస్ట్రీలో కాస్ట్యూమ్…

Read More

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ విహాహం ఎప్పుడెప్పుడని ఆమె అభిమానులు ఆతృతతో ఉన్నారు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లి వార్తలు వైరలవుతున్నాయి. అయితే ప్రేమలో ఉన్న తన చిన్న నాటి ఫ్రెండ్ తో పెండ్లన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇలా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండగా ఒక్కసారిగా కీర్తి తల్లి మేనక తన కూతురి పెళ్ళి విషయంపై స్పందించారు. కీర్తి తన చిన్న నాటి స్నేహితుని పెండ్లడబోతుందన్ని వస్తున్న వార్తలు పుకార్లేనన్ని మేనక చెప్పుకొచ్చింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని కుండబద్దలు కొట్టారు. కీర్తి పెండ్లి ఇంకా ఎవ్వరితో ఫిక్స్ కాలేదన్నారు. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే స్వయంగా నేనే చెప్తానని చెప్పారు కీర్తి సురేష్ తల్లి మేనక. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు మంచిది కాదని కీర్తి ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉందన్నారు.దీంతో ఆమె పెళ్లి వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది.

Read More

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు అనిపించింది. ఈ బడ్జెట్ లో గొప్పగా కేటాయింపులు ఏమి లేవు కాని ఆదాయపు పన్ను పరిమితిని పెంచి కాస్త రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. ఆదాయపు పన్ను పరిమితిని ఎప్పుడు పెంచుతారా అని ఏడేళ్ళుగా ఎదురుచూసిన వారు ఈ సారి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అలా అంచనాలు పెట్టుకోకపోవడం వలన తాజాగా ఇచ్చిన మినహాయింపులు ఊరటనిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ. రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అయితే ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికే. ఏడు లక్షల లోపు ఆదాయం ఉంటే ఇతర మినహాయింపులేమీ పెట్టుకోకుండా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక పాత శ్లాబ్ విధానంలోనూ కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇప్పటి వరకూ రూ. రెండున్నర లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.3 లక్షల…

Read More

దేశవ్యాప్తంగా నేరారోపణలు, నేర చరిత్ర కల్గిన ప్రజా ప్రతినిధుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులలో 59శాతం మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు వారున్నారని పేర్కొంది. తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 17మంది మంత్రులు ఉన్నారు. అందులో పదిమందిపై కేసులు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రులున్న రాష్ట్రం జాబితాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర క్యాబినెట్ లో మొత్తం 20మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 13మంది అంటే 65శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఆ తరువాత స్థానంలో ఝార్ఖండ్ రాష్ట్రం ఉంది. 11మంది మంత్రులుండగా..ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. తమిళనాడులో33 మంది మంత్రులకు గాను 28మంది (85 శాతం), హిమాచల్ ప్రదేశ్ లో 9 మందికి ఏడుగురు (78 శాతం), మహారాష్ట్రలో 15 మంది మంత్రులు (75…

Read More

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా.. అందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ధరలు తగ్గేవి… టీవీలు, మొబైల్ ఫోన్లు కెమెరాలు ఎలక్ట్రిక్ వాహనాలు కిచెన్ చిమ్నీలు లెన్సులు లిథియం అయాన్ బ్యాటరీలు ధరలు పెరిగేవి… బంగారం, వెండి వజ్రాలు టైర్లు బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

Read More

రాజకీయాల్లో మాటలు తక్కువ..చేతలు ఎక్కువ కనిపించాలి. అధికారం ఉందన్న అహంకారం పనికిరాదు. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎన్నికలలో పరిణామాలు వేరేలా ఉంటాయి. పైగా చూసేవారికే రోత పడుతుంది. అసహ్యం పెరుగుతుంది. ఎందుకురా ఇలాంటి ప్రభుత్వాని ఎన్నుకున్నామన్న భావన ప్రజల్లో కలుగుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయి..అప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రవర్తన కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటే మంచి రాజకీయ అనుభవమున్న వ్యక్తిగా పేరుంది. ఆయన రాజకీయాల్ని తెలివిగా వాడేస్తుంటాడు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్‌ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా రాజకీయంలో మరెవ్వరికి తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్‌ తమిళీ సై విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు పూర్తిగా తనదే తప్పని ఆయనే ఒప్పుకోవాల్సిన పరిస్థితికి చేరాయి. ఇన్నాళ్ళు కేసీఆర్ అవమానాలను భరించుకుంటూ వచ్చిన గవర్నర్ తమిళీ సై.. ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద…

Read More

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆయా శాఖలకు కేటాయింపులు, ఆర్ధిక వృద్దిపై ప్రసంగించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ కు రూపకల్పన చేశామన్నారు. తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపయిందని, ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. బడ్జెట్ లోని ఆయా రంగాలకు కేటాయింపులు –  ముఖ్యాంశాలు ఇవీ వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల…

Read More