Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయ వర్గాల్లో ఈ అంశం చుట్టే చర్చంతా జరుగుతోంది. ముందస్తుకు వెళ్ళే ముచ్చటే లేదని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పేశారు కాని జరుగుతోన్న పరిణామాలు మాత్రం ముందస్తు ఎన్నికలకు సర్కార్ సిద్దమైందనే అనుమానాలు కల్గిస్తున్నాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీలు ముందస్తు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఎన్నికలు ఎఎప్పుడొచ్చినా అధికారం మాదంటే మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపోటములు ఎలా ఉన్నా.. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ కొంగ్రెస్ సీనియర్ నేత , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల చివరాఖరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే.. కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ ముందస్తుకు ఎన్నికలకు కేంద్రం సహకరించే అవకాశం లేదని ఆయన ఉద్దేశ్యం. అందుకే..తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారని సంచలన వ్యాఖ్యలు…
ఎట్టకేలకు రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. పాదయాత్ర చేసి తీరాలనుకున్న ఆయన కళ నెరవేరబోతోంది. సోమవారం నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేసేందుకు పార్టీలో రేవంత్ గత కొన్నాళ్ళుగా ఓ యుద్దమే చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవడానికి పార్టీ సీనియర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రను సమర్ధించారు. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన యాత్ర వేరని… రేవంత్ చేయనున్న యాత్ర వేరని రేవంత్ పాదయాత్రను ఆపేందుకు సీనియర్లు శతవిధాల ప్రయత్నాలు చేశారు. కాని థాకరే మాత్రం విషయం ఏదైనా.. పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నేతలు నిత్యం జనాల్లో ఉండటం ముఖ్యమని తేల్చి చెప్పారు. రేవంత్ మాత్రమే కాదు.. మీరు కూడా మీకు చేతనైతే ఆసక్తి…
బండ్ల గణేష్ నోటిదూలతో కామెంట్స్ చేసి వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పంచాయితీ పెట్టుకున్నారు. నన్ను కెలకొద్దు.. విశ్వరూపం చూపిస్తానని వార్నింగ్ లు ఇచ్చారు. అసలు విషయమేంటంటే…పవన్ కల్యాణ్ కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ బండ్ల గణేష్ పూర్తిగా ఇవ్వలేదన్న అర్థంలో అన్ స్టాపబుల్ షోలో పవన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. బండ్ల గణేష్ పవన్ కు పారితోషకం ఇవ్వకుండా మోసం చేశారని టీజ్ చేశారు. ఇంకేముంది బండ్ల గణేష్ కు కోపమొచ్చింది. నోరు తెరిస్తే గుండె ఆగిపోయి చస్తావ్ నన్ను కెలకొద్దు అంటూ రెచ్చిపోయారు. పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ పైఆయన స్పందించక పోయుంటే బాగుండేది. కాని ఆయన ఈ విషయంలో తలదూర్చి విషయాన్ని మరింత పెద్దదిగా చేసుకున్నారు. సాధారణంగా బండ్ల గణేష్ తో సినీ ఇండస్ట్రీకి చెందిన వారెవరు పెద్దగ ర్యాపో మెయింటేన్ చేయరు. ఆయనతో సినిమా చేసిన వాళ్ళు మళ్ళీ సినిమాలు చేయరు. సోషల్…
వాలంటైన్స్ డే రోజున కండోమ్ లు పంపిణీ – ప్రభుత్వం కీలక నిర్ణయంవాలంటైన్స్ డే సమీపిస్తోంది. ఫిబ్రవరి 14ను ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోజు నుంచి కొంతమంది ప్రేమికులు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారు. మరికొంతమందేమో ఫిజికల్ అటాచ్ మెంట్ పెట్టుకుంటారు. దీని వలన అవాంచిత గర్భం వచ్చే అవకాశం ఉందని వీటిని నియత్రించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. థాయ్ లాండ్ గురించి చెప్పేదేముంది.? అక్కడ విచ్చలవిడి శృంగార స్వేఛ్చ ఉంటుంది. ఫలితంగా టీనేజ్ లో అమ్మాయిలు గర్భం దాలుస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వాలెంటైన్ డే సందర్భంగా ప్రేమికులు శారీరకంగా కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ప్రేమికుల రోజున ఒక్కొక్కరికి పది కండోం లు అందించాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్ ద్వారా పేరు నమోదు చేసుకొని కండోమ్ లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లు వాడని వారు ఆ దేశపు…
మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరిగి పెద్దదవద్దని అంటుంటారు. అలాగే హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో ఆయనును కాదని మరో లీడర్ ఎదగలేరని టాక్. అంతెందుకు కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉండిన మాజీ ఐఎఎస్ అధికారి,. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సి వెంకట్రామి రెడ్డి సిద్ధిపేటలో పర్యటిస్తే అప్పట్లో హరీష్ రావు అనుచరులు అడ్డుకున్నారు. వెంకట్రామి రెడ్డి సిద్ధిపేట టికెట్ ఆశిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ఆయనను అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అలా.. సిద్ధిపేటలో తనకు ప్రత్యామ్నాయంగా ఎవరొచ్చిన అడ్డుపడటం హరీష్ రావు మొదటి నుంచి చేస్తుంటారని అంటుంటారు. ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి సిద్ధిపేటలో పొలిటికల్ యక్టివీటిస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. గతేడాది వంద మంది రైతులకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల చెక్కును చక్రధర్ గౌడ్ అందించాడు. పది ఎకరాలున్న తనకు…
బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ చేసిన కేసీఆర్ కీలక నేతలను పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికబద్దంగా సాగుతున్నారు. ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే పార్టీ నేతల ద్వారా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ లో నిర్వహించనున్న సభలో భారీగా నేతలను చేర్చుకునేలా ఇప్పటికే ఆ పార్టీ నేతలు అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. చిన్న , చితక లీడర్లతో సహా బడా నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏవేవో ఆఫర్లు ఇచ్చి నేతలను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపై కూడా బీఆర్ఎస్ దృష్టి సారించింది. నాందేడ్ సభ తరువాత విజయవాడలో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈలోపే మరికొంతమంది నేతలను పార్టీలో చేరేలా ఒప్పించాలని ఆ పార్టీ నేతలు ట్రై చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ కు గంటాకు మధ్య వివేకానంద మధ్యవర్తిత్వం వహిస్తున్నారని జోరుగా ప్రచారం…
‘రాజుగారు! మీమీసం ఎవరో కొరిగారు’ అనిచెబితే -నాకున్న వేలాది వెంట్రుకల్లోంచి మీసం పోతేముందిలే ` పోయింది బొచ్చేకదా’ అన్నాడంటా. అలా ఉంది మన దేశప్రదాని మోడి మాటతీరు. ఆయన చెప్పలేక ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ చేత డబ్బింగ్ చెప్పించాడు. ఆరులోంచి ఆరు తీస్తే మిగిలేవి పదహారు అని లెక్కలు చెప్పే ఆమె, ఇప్పటికి మనకు చేకూరిన నష్టం దేశ ఆర్థికవ్యవస్థలో కేవలం ఒకే ఒక్కశాతమని చావు కబురు చల్లగా చెపుతున్నారు. అదాని సంస్థ వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం దాదాపు ఎనిమిది లక్షల కోట్లరూపాయలని కేంద్రప్రభుత్వమేస్వయంగా ఒప్పుకుంది. అంటే అది దాదాపు ఎనిమిది రాష్ట్రాల వార్షిక బడ్జెట్తో సమానం. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్లు లేదు. పైగా దానిని సమర్థించుకుంటు అదాని గ్రూప్ ను వెనకేసుకొస్తోంది. కారణంఆ సంస్థ బిజెపికి అఫ్లియేటెడ్ సంస్థ కాబట్టి. ఇంకా పచ్చిగాచెప్పాలంటే నిండు సభలో వస్త్రాపహరణం జరిగాకా ద్రౌపది వెక్కి వెక్కిఏడ్చింది. దుర్యోధనుడి మీద…
దేశంలో తొలిసారి వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాన్స్ జెండర్ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇందుకు సంబంధించి ఆ జంట ప్రకటన చేసింది. సాధారణంగా ట్రాన్స్ జెండర్స్ కు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కాని ఓ ట్రాన్స్ జెండర్ జంట మాత్రం తాము తల్లిదండ్రులం కాబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేశారు. దేశంలోనే మొదటిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇది నమ్మశక్యంగా లేకున్నా కేరళలోని కోజికోడ్ లో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ జంట ఈ విషయాన్ని వెల్లడించింది. వచ్చే నెలలో లోకానికి తమ బిడ్డను పరిచయం చేస్తామని మహిళగా పుట్టి పురుషుడిగా మారిన జహాత్ , పురుషుడిగా పుట్టి మహిళగా మారిన జియా పావల్ ప్రకటించారు. వీరిద్దరూ గత మూడేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.…
ఈటల రాజేందర్ సొంత గూటికి వెళ్ళే అవకాశం ఉందా..? బీజేపీలో ఇమడలేకపోతున్న ఆయన బీఆర్ఎస్ ఆహ్వానం అందితే తిరిగి వెళ్తారా..? అంటే.. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ , ఈటల మధ్య సంబాషణ చూసిన వారంతా అవుననే అంటున్నారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్చీఫ్ లు మార్చేసినంత ఈజీగా పార్టీలను మార్చేస్తున్నారు నేతలు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ పక్క చూపులు చూస్తున్నారు. కీలక నేతలకు ప్రధాన పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జాతీయ స్థాయి పార్టీగా మారిన నేపథ్యంలో పాత మిత్రులను మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, పల్లె రవి వంటి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కాబట్టి కీలక నేతలను లాగేసుకోవాలని అధికార బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్…
‘ఆలిండియా అడుక్కుతినే వాళ్ల మహాసభలు’ అనగానే తాపీ ధర్మారావు రాసిన పుస్తకం గుర్తుకొస్తోంది కదూ! 50 ఏళ్లకిందట ఆమహానుభావుడు ఊహించి రాసిందే నేడు జరిగింది. అవును! మొన్న ముంబాయ్ లోని ఓమురికివాడలో దేశంలోని బిచ్చగాళ్లందరూ ఓమీటింగ్ పెట్టుకుని తమ డిమాండ్ల గురించి చర్చించారు. లవర్స్ డే, ఇండిపెండెన్స్ డేలాగా ‘బెగ్గర్స్ డే’ని నిర్ణయించినా ఆశ్చర్యంలేదు. నేడు అడుక్కుతినే వాడే అదిక సంపన్నుడు అంటే అతిశయోక్తిలేదు. అలా ఉంది వాళ్ల సంపాదన. యాచించడం కూడా ఓ ఉద్యోగంలా మారింది. కేవలం హైదరాబాద్ లోనే దాదాపు పదహారువేల మంది బిచ్చగాళ్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇది పచ్చి నిజమని ఆమధ్య ఓసర్వేలో తేలింది. ఇందులో 90 శాతం వరకు పేద రైతులు. ఉళ్లలో సరిగ్గా పనులు దొరకకా, దొరికినా కుటుంబాన్ని సాకలేక నగరానికి అడుక్కోడానికి వస్తున్నారు. సగటుబిచ్చగాడి సంపాదన రోజుకు దాదాపు నాలుగు వందల నుంచి వెయ్యిరూపాయల వరకు ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర, గుళ్లముందు,…