Author: Prashanth Pagilla

కడుపులో చల్ల కదలకుండా..ఇస్త్రీ బట్టలు నలగకుండా ప్రభుత్వం ఉద్యోగం చేసే టీచర్లను చాలామందినే చూసుంటారు. కాని విద్యార్ధులకు పాఠాలు బోదించకపోతే నా కంచంలోని అన్నం ముద్ద సహించదని ప్రకటించే టీచర్లను మీరెప్పుడైనా చూశారా..? అంతటి కమిట్మెంట్ ఉన్న టీచర్లను చూసుండరు కదా. ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాసీం. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా వేతనం అందుకుంటే తనకు అన్నం ముద్ద సహించదని అంటున్నారు. భవిష్యత్ నిర్మాణం కోసం కోటి ఆశలతో వర్సిటీకి వచ్చే విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే..మా పిల్లలకు చదువు చెప్పేందుకు అధ్యాపకులని నియమించండయ్యా అంటూ ఆయనే దీక్షకు దిగారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండంటూ సోమవారం ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రొఫెసర్ కాసీం దీక్ష చేపట్టారు. తాను దీక్షకు దిగితే పేద విద్యార్థులు తరగతులు నష్టపోతారని.. దీక్షా శిబిరాన్నే చదువుల క్షేత్రంగా మార్చాడు ఆ మాష్టారూ. నాకు వర్శిటీలో ఉద్యోగముంది. పిల్లలు వస్తేనే పాఠాలు చెప్తా. ఎవరూ రాకుంటే…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. సిట్ తోనే విచారణ చేయించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సర్కార్ వాదనలు వినిపించగా ఆ వాదనను కొట్టిపారేసింది. సిట్ విచారణ రాజకీయ కోణంలో జరుగుతోందని ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగనుంది. మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ను కూడా విచారించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, నలుగురు ఎమ్మెల్యేలు తప్పించుకోవడం అసాధ్యమే. బీజేపీ అగ్రనేతలను ఈ కేసులో ఇరికించాలని చూసిన కేసీఆర్.. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుండటంతో ఇరకాటంలో పడనున్నారు. ఈ కేసు సిట్ పరిధిలోనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కినా ఫాయిదా ఉండే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే కేసీఆర్ కు…

Read More

తెలంగాణలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు పెట్రోల్ ధరలా పెరుగుతున్నారు. వాళ్ళను తెలంగాణ ఉద్యమంలో చాలా తెలివిగా కేసీఆర్ వాడుకున్నాడు అనడానికి నిరుద్యోగ భృతి అనే దొంగ పథకం ఓ చక్కటి ఉదాహరణ. రోడ్డున పడ్డ నిరుద్యోగులను అందరికంటే ముందుగా ‘నిరుద్యోగ భృతి’ తో ఎమర్జెన్సీ కేసులా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. నిరుద్యోగులకు లేని ఆశలు కల్పించాడు. ఆకలి వేసేవాడికి కనీసం పాన్ ఇస్తానని నోరు ఊరించాడు. గులాబీ కార్ లో వస్తే ఆలస్యం అవుతుందని అంబులెన్సులో సైరన్ చేస్తూ దూసుకొచ్చాడు. ట్రాఫిస్ రూల్స్ పాటించకుండా తెలంగాణ మొత్తం తిరిగాడు. నెలకు 3016 రూపాయలు ఇస్తామని లక్షల సార్లు ప్రమాణం చేశాడు. చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్న పట్టభద్రులను అంబులెన్సు లో ఎక్కించి గ్లూకోజ్ నీళ్లు ఎక్కిస్తాని భుజానికి పెద్దమ్మ తల్లి గుడిలో కొన్న కంకణం కట్టుకున్నాడు. డాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తలకు కంకణం కట్టుకున్నాడు. మన హీరో అన్న…

Read More

నాలుగు పదుల వయస్సు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ పాన్ ఇండియా హీరో పెళ్లి ఎప్పుడని టాలీవుడ్ మీడియానే కాదు బాలీవుడ్ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తోంది. ఆయన అనుష్కతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకాల ప్రచారం ప్రభాస్ పెళ్లి గురించి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించిన అప్డేట్ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సందు సంచలన ట్వీట్ చేశాడు. బ్రేకింగ్. వచ్చేవారం ప్రభాస్ – కృతి సనన్ ల ఎంగేజ్మెంట్. మాల్దీవ్స్ లో జరగనుంది అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్ పెళ్లి గురించి ట్వీట్ కావడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఇటీవల ప్రభాస్ – కృతి సనన్ ల మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయానికి సంబంధించి ఉమర్ సంధుకు స్పష్టమైన సమాచారం…

Read More

కొంతమంది ఖమ్మం బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కారణం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తిరుగుతున్నారని. తమ అనుచరులపై వేటు వేసిన విషయం తెలిసిన పొంగులేటి చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమా డైలాగ్ తరహలో బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ చేశారు. వాళ్ళను, వీళ్ళను కాదు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయండంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరారు. సమస్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాని ఆయన్ను వదిలేసి ఆయన చుట్టున్న నేతలను సస్పెండ్ చేయడం నవ్వు తెప్పిస్తోంది. పోనీ.. పొంగులేటిని కన్విన్స్ చేసి పార్టీలోనే కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారా..?అంటే అది లేదు. ఆయనపై వేటు వేయడం మానేసి అనుచరులను టార్గెట్ చేస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ కాదు. ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కూడా కాదు. ఎలాంటి పదవి లేకుండానే ఉన్నారు. కాని పొంగులేటిపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం భయపడుతోంది. దీంతో సర్కార్ కొత్త…

Read More

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అట్టడుగు వర్గాలను ఆకర్షించేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంపై విమర్శలు వస్తుండటం.. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లంటే జాగా కూడా లేదని భావించిన ప్రభుత్వం సొంత జాగా ఉన్నోల్లకు మూడు లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో 7,890కోట్లు కేటాయించారు. ఈ పథకంతో ఎన్నికల్లో లబ్ది పొందవచ్చునని సర్కార్ ఎత్తుగడగా తెలుస్తోంది. కారు పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో సొంతిల్లు లేనివారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ ను ఎంపిక చేశారు. ఆ తరువాత రాష్ట్రమంతా డబుల్ బెడ్ రూమ్ ఇల్లంటూ చెప్పింది. కాని బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం పెద్దగా కేటాయింపులు చేసింది లేదు. మరోవైపు.. ఇళ్ళ…

Read More

-ఆసరా పింఛన్లు 12,000 కోట్లు -దళిత బంధు 17, 700 కోట్లు -బీసీ సంక్షేమం 6,229 కోట్లు -గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు -కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు -బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, -నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, -విద్యుత్ రంగం 12, 727 కోట్లు -ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు. -ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు.. -దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు -ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు.. -గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు.. -బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు.. -వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు.. -కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.. -షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు -పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు.. -వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..…

Read More

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. శాఖల వారీగా కేటాయింపులు -షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు -పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు -నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు, -వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు -విద్యా రంగానికి రూ.19,093 కోట్లు -దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు -గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233 -విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు -ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు -వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు -పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు -హోంశాఖకు రూ.9,599 కోట్లు -రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు -బీసీ సంక్షేమం రూ.…

Read More

ఇందిరాగాంధీ ఎమర్జెన్సి విధించాకా పార్లమెంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆమెపై కఠన చర్యలు తీసుకోవాలని సభ దద్దరిల్లింది. ఆమెను కాదు, రాజారామ్మోహన్ రాయ్ ను ఉరితీయాలని ఓ ఎంపీ వాదించాడు. ఎప్పుడో చనిపోయిన ఆయనకు, ఈ కేసుకు సంబంధం ఏమిటని అందరు అడిగారు. విధవరాళ్లు ఇంట్లో కూర్చోకుండా రాజకియాల్లోకి రావచ్చని ఆయన సంస్కరణలు చేశాడు కాబట్టే ఇందిరమ్మ రాజకీయాల్లోకి వచ్చారని వాదించాడు. అలా వుంది మన మంత్రి హరీష్ రావు తీరు. సిద్దిపేటలో రైతులను ఆదుకుంటూ, వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తూ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నవాడు చక్రధర్ గౌడ్. సిద్దిపేటను మోనార్క్ లా ఏలుతున్నహరీష్ రావుకు అది నచ్చలేదు. నచ్చదు కూడా. ఎందుకంటే మొక్క వృక్షంలా ఎదగకముందే కలుపుమొక్కలా పీకేయడం హరీష్ రావుకు మొదటి నుంచి అలవాటు. అందుకే దేశంలోనే అత్యదిక ఓట్ల మెజారితో గెలుస్తాడు. చక్రధర్ గౌడ్ ను అచ్చోసిన ఆంభోతులా ఎలా చూపాలని కాచుకున్నాడు. సరిగ్గా అప్పుడే బెల్లం…

Read More

హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ 2022డిసెంబర్ 26న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు విచారణలో సిట్ విఫలమైందని..ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని..దాంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలు సీఎం వద్దకు ఎలా చేరాయని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ బయటపెట్టకూడదని పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. దాంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అనేక సమాలోచనల తరువాత ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది ప్రభుత్వం. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్…

Read More