Author: Prashanth Pagilla

రాష్ట్ర రాజకీయాల్లో చాణక్య నీతి తెలిసినవాడు కేసీఆర్ అని అంటారు. ఇందులో ఆయనకంటే రెండాకులు రేవంత్ రెడ్డి ఎక్కువే చదివినట్లున్నాడు. అందుకే ఎప్పుడు, ఎలా రాజకీయం చేయాలో చేసేస్తున్నారు  రేవంత్. కేసీఆర్ ను గద్దె దించాలంటే రేవంత్ తోనే సాధ్యం అవుతుందని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. కేసీఆర్ కు తగ్గ నాయకుడిగా రేవంత్ పేరును చెప్పుకొస్తున్నారు. ఇకపోతే.. రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. బుధవారంతో మూడో రోజుకు చేరింది. ములుగు నియోజకవర్గంలో సాగుతున్న ఈ పాదయాత్రకు జనం నుంచి భారీ ఆదరణే వస్తోంది. కాని అంతకుమించి కోరుకున్నట్టు ఉన్నారు రేవంత్. అందుకేనేమో ప్రగతి భవన్ ను పేల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దొరల గడీలను నక్సలైట్లు పేల్చేసేవారని..ఇప్పుడు ప్రగతి భవన్ ను పేల్చి వేసినా ఎవరికీ అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు గానీ, హైదరాబాద్ లో మాత్రం 2 వేల కోట్లు ఖర్చు పెట్టి…

Read More

ఏ కోణంలో చూసినా బండి సంజయ్ కంటే బాబు మోహన్ అన్నివిధాలా గొప్పవాడు. బాబు మోహన్ ప్రభుత్వ ఉద్యోగం చేసిన బాధ్యత గల గెజిటెడ్ ఆఫీసర్. 25 ఏళ్లపాటు దాదాపు 900 సినిమాలు నటించిన గొప్ప నటుడు. తెలుగుతో పాటు దేశంలోని పలు భాషలలో నటించిన అపరానుభవం ఉన్నవాడు. ఓ నిర్మాత కూడా. బండి సంజయ్ నెక్కర్లు వేసుకునే రోజుల్లో బాబు మోహన్ తెలుగుదేశంలో పరిపాలనలో పరిశ్రమల మంత్రిగా సంచలనం రేపినవాడు . బి ఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ తో సరిసమానంగా రాజకీయం నడిపినవాడు. దాదాపు 50 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు ఇలా బూతులు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి మొదటిసారి కడుపు రగిలి ఎందుకు శివమెత్తాడు? దీనికి కారకులు ఎవరు? కచ్చితంగా బి జె పి కారణం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటినుంచి బి జె పికి దక్షిణ భారత దేశంలో సరైన నాయకుడు…

Read More

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు. ఆయన గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు పరీక్షలలో తేలిందని వెల్లడించారు. యాంజియో పరీక్ష పూర్తయిందని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. మరికాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. Also Read : మేకపాటి చంద్రశేఖర్ 18ఏళ్ళు కాపురం చేశాడు- శివచరణ్ రెడ్డి తల్లి https://youtu.be/aTBHNt-PUPQ

Read More

ఈసారి ఎన్నికల్లో నెగ్గడం ఈజీ కాదని భావిస్తోన్న కేసీఆర్ కొత్త పథకంతో మ్యాజిక్ చేయాలనుకుంటున్నారా..? ఒకే ఒక్క పథకం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ గెలుపు ప్రణాళిక ఏంటి..? ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్షాలు దూకుడు పెంచగా.. బీఆర్ఎస్ అధినేత మాత్రం నిశ్చితంగా ఉండటానికి కారణమేంటి..? హ్యాట్రిక్ నమోదు చేస్తామంటున్న కేసీఆర్ అసలు ధీమా ఏంటి..? సునాయసనంగా కేసీఆర్ కు అధికారం కట్టబెట్టే ఆ మంత్రం ఏంటి..? గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ను రైతు బంధు గట్టెక్కించింది. ఈసారి దళిత బంధు విజయాన్ని చేకూరుస్తుందనుకున్నా..ఆ పథకంపై బీఆర్ఎస్ ఆశలను వదిలేసుకుంది. దీంతో కేసీఆర్ మళ్ళీ రైతులను ఆకట్టుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తునట్టుగా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రైతులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేశారని..పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడమో లేదంటే, ఎన్నికలకు వెళ్ళే ముందు అమలు చేయడమో చేస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ…

Read More

సినిమా వాళ్ళకే కాదు. రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయి. మనకే కాదు చివరికి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా తన జేబులో మన ఆంజనేయుడి కాయిన్ పెట్టుకుని రెండు సార్లు గెలిచాడు. కెసిఆర్ తన కుడి చేతికి పెద్దమ్మ తల్లి రిబ్బన్ కట్టుకుని రెండుసార్లు గెలిచాడు. అలాగే వై ఎస్ రాజశేఖ రెడ్డి కూడా ప్రతి పనిని, ప్రతి పథకాన్ని చేవెళ్ల లో మొదలు పెట్టాడు. చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచే సబితా ఇంద్ర రెడ్డి చేతుల మీదుగా మొదలు పెట్టేవాడు. అన్ని మంచి శకునాలు జరిగాయి. ఇప్పుడు అదే తోవలో పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి కూడా సీతక్క సెంటిమెంట్ ఉన్నది. అతను ఏ పని చేసినా ములుగు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదికూడా సీతక్క చేతుల మీదుగా. ఆ సెంటిమెంట్ ఫలిస్తోంది అనడానికి మొన్న అతను చేపట్టిన పాదయాత్ర…

Read More

బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచే ఎంఐఎం ఇప్పుడు మిత్ర పక్షానికే సవాల్ విసురుతోంది. మాది ఏడు సీట్ల పార్టీ కాదు…వచ్చే ఎన్నికల్లో మేమెంటో చూపిస్తామని మంత్రి కేటీఆర్ కు అసెంబ్లీలో అక్బర్ సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎప్పుడు జ‌రిగినా అక్బ‌రుద్దీన్ వ‌ర్సెస్ కేటీఆర్ సీన్ ఉంటూనే ఉంటుంది. ఆ త‌ర్వాత అంతా భాయ్- భాయి అన్నట్లుగా మింగిల్ అవుతారు. శనివారం నాడు అసెంబ్లీలో కేటీఆర్ కు మాట‌కు మాట జ‌వాబు చెప్పిన అక్బ‌ర్ సైతం మేం బీఆర్ఎస్ తోనే కలిసి సాగుతామని ప్రకటించారు. ఇందంతా బాగానే ఉన్నా క‌నీసం 15మంది ఎమ్మెల్యేల‌తో మ‌జ్లిస్ అసెంబ్లీలోకి అడుగుపెడుతుంద‌న్న అక్బర్ వ్యాఖ్య‌లే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దారుసలేంలో ఎంఐఎం పార్టీ విస్తరణ కోసం ఎప్పటి నుంచో స్కెచ్ గీస్తున్నారు. ఈ క్రమంలోనే అక్బర్ చేసిన వ్యాఖ్యలు ఆవేశంతో కాదు. అన్ని తెలిసే అన్నట్టు తెలుస్తోంది. మజ్లిస్ కు పట్టున్న…

Read More

”నేను మూడుసార్లు పెళ్లిల్లు చేసుకున్నాను – మీరు కూడా మూడేసి పెళ్లిల్లు చేసుకోండి” అని జనసేన నేత పవన్ కళ్యాణ్ తరచూ ప్రతిపక్షాలను తిట్టే మాట ఇది. ఒకసారి పొరపాటున మాట్లాడితే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతి సారి ఇదే కారుకుతలు కూస్తున్నారు. ఓ హీరోలా ఇలా మాట్లాడవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. కానీ ఓ రాజకీయ వేత్తగా, జనసేన అధినేతగా ఇలా మాట్లాడం ఎవ్వరూ జీర్ణించుకోలేరు. ఇది యువతను తప్పు దోవ పట్టించేలా ఉంది. ఇది ఎలా ఉంది అంటే నేను తాగుబోతుని, మీరు కూడా తాగండి అని ఓ తండ్రి తన పిల్లలకు చెప్పడం లాంటిది. పవన్ కళ్యాణ్ ఇంకా తాను హీరో అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా హీరోగా నటిస్తున్నారు కాబట్టి. కానీ రాజకీయ నాయకుడిలా ఇంకా భావించడం లేదు. ఎందుకంటే ఇలాంటి నోటి దురద వగుదువల్లే మహిళా ఓటర్ల దృష్టిలో దిగజారి పోయారు కాబట్టి. ఆ నాలుకకు జాలింలోషన్…

Read More

బీజేపీ సీనియర్ నేత బాబు మోహన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ బీజేపీ కార్యకర్తతో ఫోన్ మాట్లాడుతూ..ఏకంగా రాష్ట్ర అద్యక్షుడినే ఎవడ్రా బండి సంజయ్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఆడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. 2018లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ ను కాదని క్రాంతి కిరణ్ కు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అసంతృప్తికి లోనైనా బాబు మోహన్ బీజేపీలో చేరి ఆ పార్టీ తరుఫున పోటీ చేశారు కాని, తీవ్ర ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ కార్యక్రమాల్లో అడపాదడప పాల్గొనే వారు. ఏమైందో ఏమో కాని కొన్నాళ్ళుగా ఆయన పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కడం లేదు. కారణం…బాబు మోహన్ ను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడమే. బాబు మోహన్ పై ఆందోల్ లో వ్యతిరేకత ఉండటంతో ప్రత్యామ్నాయ నేతను ప్రోత్సహించాలని బండి సంజయ్ యోచిస్తున్నారని , ఇది తెలిసే రాష్ట్ర నాయకత్వంపై…

Read More

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. వారం రోజులు నుంచి తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ తాజాగా అస్వస్థతకు గురైయ్యారని అంటున్నారు. గతేడాది నుంచి వరుస షూటింగ్ లతో ప్రభాస్ బిజీ అయిపోయారు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్, రాజా డీలాక్స్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమా షూటింగ్ లు మెల్లగా అయిన చేసుకోవచ్చు కాని, నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక.. కృతి సనన్- ప్రభాస్ ల పెళ్లి ఖరారు అయిందని ఫిలిం క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. వారం రోజుల్లో వారిద్దరి నిశ్చితార్ధం జరగనుందని పేర్కొన్నాడు. ఈ వార్త నిజమా..? లేదా..?…

Read More

ప్రధాన మీడియా సంస్థలన్నీ బీజేపీ గుప్పిట్లోకి వెళ్ళాయి. దాంతో జనం గోస ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఎన్డీటీవీని కూడా అదాని కొనుగోలు చేసి మోడీకి గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇక.. తమ బాధలను వ్యక్తపరిచేందుకు జనాలు సోషల్ మీడియా దిక్కుమొక్కైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న దారుణాలు సోషల్ మీడియా ద్వారా మాత్రమే బయటకు వస్తున్నాయనేది ఓపెన్ సీక్రెట్. దాంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఏది ఫేక్ అని తెలిస్తే ఆ వార్తను ప్రచారం చేయకూడదని రూల్స్ తీసుకొచ్చింది. ఇందుకుగాను సమాచారహక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొద్ది రోజుల కిందట ముసాయిదా ప్రతిని రెడీ చేసింది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ ఏదైనా వార్తను ఫేక్ గా నిర్దారిస్తే ..సామాజిక మాధ్యమాలు, వార్తా వెబ్‌సైట్స్‌ ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు.…

Read More