Author: Prashanth Pagilla

‘మాంగల్యం తంతునా నేన మమజీవన హేతునా’ దీని అర్థం తెలిసే చాలామంది చదువకున్న వాళ్లు భార్య మేడలో తాళి కడతారు. చదువు రాకపోయినా దీని అర్థం తెలిసిన సాములు అనే భర్త తన భార్య ‘గురు’ శవాన్ని భుజనా వేసుకుని నడక రోడ్డు మీద 130 కిలో మీటర్ల మొదలు పెట్టాడు. కటిక పేదరికం. అంబులెన్సుకు డబ్బులు లేవు. బతికున్న వాడికే లిఫ్ట్ ఇవ్వని స్వార్థపరులున్న రోజుల్లో శవానికి లిఫ్ట్ ఇచ్చే నాథులు ఎవడు? ‘పట్టువీడని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడక మొదలు పెట్టాడు’ అని చిన్నప్పుడు మనం చదువుకున్న చండమామ కథ గుర్తుకు వచ్చింది. పూర్వపరాల్లోకి వెళ్ళితే – సాములు అనే నిరుపేద ఒరిస్సా లోని కోరాపుట్ అనే జిల్లా వాసి. అతని భార్య గురు అనారోగ్యానికి గురయ్యింది. సడోరా గ్రామంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె బతకడం కష్టమని, జిల్లా హెడ్ క్వార్టర్ కి తీసుకెళ్ళమని గెంటేశారు.…

Read More

కొత్త గవర్నర్ ల నియామకంలో ప్రధాని కార్యాలయంలో రెండు రోజులుగా పెద్దగా చర్చలు జరగలేదు. కానీ తెలంగాణ కొత్త గవర్నర్ విషయంలో వాడి వేడి చర్చలు జరిగాయి. గంటల తరబడి తర్జనాలు బర్జనలు జరిగినట్లు తెలిసింది. సుప్రీం కోర్ట్ మాజీ జస్టిక్ ఎస్. అబ్దుల్ నజీర్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించాలని మోడీ దాదాపు ఖరారు చేశాడు. మొదటి నుంచి ఇతను బీజేపీ కి అనుకూలంగా ఉన్నారు. రామజన్మ భూమి వివాదం సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు వేసిన కమిటిలో ఇతను కీలక పాత్ర పోషించారు. తీర్పు బీజేపీకీ అనుకూలంగా రావడంలో ఇతని పాత్ర అమోఘం. ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఎన్నో వివాదస్పద కేసులను చాలా చాకచక్యంతో తీర్పులు చెప్పిన పేరుంది. ఇతను కెసిఆర్ ముక్కుకు తాడు వేస్తారు అనుకున్నారు. దానికి తోడూ తెలంగాణలో ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువ. అందుకే బీజేపీ ముస్లిం ఓటర్లను ఆకర్షించవచ్చు అనుకున్నారు.…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ సంస్థల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకరెనుక ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అసలు వ్యక్తులను టచ్ చేయడం లేదనే అనుమానాలు కల్గుతున్నాయి. ప్లాన్ ప్రకారమే అసలు వ్యక్తుల అరెస్ట్ ను వాయిదా వేసినట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. సౌత్ గ్రూప్ లో దాదాపు అందర్నీ అరెస్ట్ చేశారు. మిగిలింది అరుణ్ రామచంద్ర పిళ్ళై , కల్వకుంట్ల కవిత మాత్రమే. పిళ్ళై ను బినామీగా ఉంచి కవిత లిక్కర్ బిజినెస్ నడిపించారని చార్జీషీట్ లో , రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాయి దర్యాప్తు సంస్థలు. సౌత్ లాబీలో ప్రేమయమున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిగిలింది పిళ్ళై , కవిత మాత్రమే. ఈ లెక్కన దర్యాప్తు సంస్థల నెక్స్ట్ టార్గెట్ వీరే కావొచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అరుణ్ రామచంద్ర…

Read More

అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు మారింది కేంద్ర క్యాన్సర్ ఆరోగ్య నిధి (ర్యాన్) పథకం. కాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ‘వన్ టైం సెటిల్మెంట్’ కింద రూ. 15 లక్షలు ఇవ్వడం ఈ పథకం గొప్పతనం. గత నాలుగేళ్ళుగా ఈ పథకాని కేంద్రం అమలుచేస్తోంది. దాదాపు 23 రాష్ట్రాల కాన్సర్ పీడితులు దీని ద్వాఆ లబ్ది పొందుతున్నారు. కానీ ఈ ఏడాది కేంద్రం విడుదలచేసిన లబ్దిదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క క్యాన్సర్ రోగి కూడా దరఖాస్తు చేయకపోవడం దురదృష్టకరం. దేశంలో 5 కోట్లమది, తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది కాన్సర్ తో బాధపడుతున్నట్లు ఆ మధ్య ఓ సర్వేలో తెలిసింది. ఇందులో నిరు పేదలే ఎక్కువ. ఉచితంగా చీరలు ఇస్తున్నారని ప్రకటిస్తే తొక్కిసలాటలో ప్రాణాలు వదిలే పేదలున్నారు. మరి ఇంత పెద్ద మొత్తానికి ఒక్కరు కూడా ఆశ పడకపోవడం ఏమిటి? ఒక్కరు కూడా దరఖాస్తు చేయకపోవడం…

Read More

గుండెపోటుతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదుటపడనేలేదు. రెండు వారాల నుంచి ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో తారకరత్న కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తం అవుతుండగానే..నందమూరి ఫ్యామిలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి కారులో రామకృష్ణ వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ, కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. దీంతో ఆయన మరో వాహనంలో అక్కడి నుండి ఇంటికి వెళ్లారు. నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైందని తెలుసుకొని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తరువాత ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాద సమయంలో…

Read More

అవును. అసెంబ్లీలోకి ఆలీ, బ్రహ్మానందం, రఘు బాబు, సునీల్, కోవై సరళ లాంటి 26 మంది తెలుగు కమెడియన్లు ఒక్కసారిగా జొరబడ్డారు. వాళ్లకు అసెంబ్లీలో ఎం పని? ఏదైనా షూటింగ్ జరిగిందా అని మీరు అడగొచ్చు. కానీ అలాంటిది ఏమీ లేదు. 26 మంది కమెడియన్లను రీమిక్స్ చేసినట్లు మంత్రి మల్లారెడ్డి ఒక్కడే పూనకంతో నటించాడు. కామెడీ ఎలా పండించాలో మల్లారెడ్డి దగ్గర వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి. అసెంబ్లీ దద్దరిల్లెలా నవ్వించాడు. కొందరు ఆ జోకులను అర్థం చేసుకుని నవ్వారు. మరి కొందరు ఆ జోకులు అర్థం చేసుకోలేక నవ్వారు. కెసిఆర్ ని తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాలేక నవ్వారు. తనను తాను మెచ్చుకుంటున్నడో, కించ పరుచుకుంటున్నడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ టివిలో వచ్చే ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని లైవ్ లో చూపాడు. జబర్దస్త్ ఆర్టిస్టులను మించి కామెడి పండించాడు. ఆయన ప్రసంగం విన్న వారంతా ఆసక్తిగా వినడం దేవుడేరుగు.. నవ్వాపుకాలేకపోయారు…

Read More

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్టీ పెట్టేశారు. అభ్యుదయ పార్టీ అద్యక్షుడు అయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభలు ఏర్పాటు చేసి దుమ్ము రేపుతున్నారు. తెలంగాణలో చార్మినార్, ఏపీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద సభలు ఏర్పాటు చేశారు. ప్రజలను అభ్యుదయ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతుతున్నారు. రామ్ చరణ్ పార్టీ పెట్టడం ఏంటి..? సభలు నిర్వహించడం ఏంటి..? బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ జనసేన ఉండగా…. రామ్ చరణ్ పోటీగా అభ్యుదయ పార్టీ స్థాపించడం జరిగిందా..? అనుకుంటున్నారా. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. రామ్ చరణ్ పార్టీ పెట్టడం నిజం కాదు. ఇదంతా ఆయన తాజా సినిమా కోసం రెడీ చేసుకున్న స్క్రిప్ట్. దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ తన 15వ చిత్రం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆలస్యం అవుతుండటంతో…

Read More

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ పై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈసారి భారత్ ను సొంత గడ్డపై ఓడించి తీరుతామని బీరాలు పలికిన ఆసీస్ జట్టు అన్ని రంగాల్లోనూ ఓటమిని చవిచూసింది. భారత స్పిన్నర్లకు ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పూర్తిగా చేత్తులేత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ తరహ ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఆడుతున్నది ఆసీస్ జట్టేనా అని అనుమానం కల్గిలా ఆ జట్టు ప్రదర్శన కనిపించింది. మొత్తంగా మూడు రోజుల్లో మొదటి టెస్టు ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఆల్ రౌండర్ జడేజా సత్తా చాటితే.. సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా రెండు వికెట్లతో రాణించాడు.…

Read More

ఏడిస్తే కానీ అమ్మ పాలు ఇవ్వదు – తిడితే కానీ ప్రభుత్వం పరిపాలించేలా లేదు. ఫిబ్రవరి 14 ను ‘ఆవును కౌగిలించుకునే దినంగా’ పాటించాలని కేంద్ర సర్కార్ ప్రజలను ఆదేశించింది. ఇది మతపరమైన చర్య అని అటు ప్రజలు – ఇటు మీడియా తిట్టే సరికి బిజెపి తోక ముడిచింది. ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు మరో జివో విడుదల చేసింది. ఇది చూస్తుంటే బిజెపి తోక ముడిచింది అనడం కంటే, కుక్క తోక వంకర పోదు అంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి బిజెపి ఎదో ప్రయోగాలు చేయాలనీ, ఏదో అధికారం చలయించాలని చూస్తుంది. కానీ ప్రజలు, మీడియా తిట్టే సరికి భయపడి వెనుకడుగు వేస్తోంది. బురదలో కాలు వేయడం ఎలా? దానిని సర్ఫ్ పెట్టి కడుక్కోవడం ఏల? ఓ జివోని విడుదల చేసే ముందు, లేదా ఓ చట్టం తెచ్చే ముందు దానికి సంబందించిన వారితో చర్చించాలనే అలవాటు బిజెపికి…

Read More

కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఓ పండగలా చేయాలనుకున్నారు. సచివాలయం ప్రారంభం రోజున గ్రామ, గ్రామాన సంబురాలు జరగాలని ఆదేశించారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి పలువురు నేతలను ఆహ్వానించారు. కట్ చేస్తే సచివాలయం ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు కారణం. ఎమ్మెల్సీ ఎన్నికలని ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల కోడ్ కు , సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధం ఏంటో చెప్పలేదు. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అభివృద్ధి కార్యక్రమం కానే కాదు. పూర్తిగా సర్కార్ కు సంబంధించినదే. సచివాలయం ఓపెనింగ్ కు ఈసీ అభ్యంతరం చెప్పదు. పైగా ఈసీని అనుమతులు కూడా అడక్కుండానే సెక్రటేరియట్ ఓపెనింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా కావడంతో అదే రోజున నిర్వహించాలనుకున్న సభ కూడా వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు. అయితే సచివాలయం ప్రారంభోత్సవ వాయిదాకు అసలు కారణం. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదమేనని అనుమానాలు బలపడుతున్నాయి.…

Read More