Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ ను వెనకేసుకోచ్చే ప్రయత్నంలో మాజీమంత్రి కొడాలి నాని కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివేకా వైఎస్ జగన్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనకు ఏం జరిగినా తప్పు లేదనే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉండటం వైఎస్ కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. వివేకా చచ్చినా.. బతికినా కడప ఎంపీ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే.. నాడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ పోటీ చేసినప్పుడు వివేకా కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారని కొడాలి నాని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా నిలవకుండా ప్రత్యర్ధులకు వివేకా సపోర్ట్ చేశారని తెలిపారు. అదే సమయంలో.. అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర రెడ్డి మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తోనే ఉన్నారని..అందుకే వివేకా బతికున్నా జగన్…
కెసిఆర్ ని జీవితా రాజశేఖర్ మాములుగా తగులుకోలేదు, అడ్డంగా తగులుకున్నారు. బూతులు ఒక్కటే తక్కువ. ఆయన ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్ మీద ద్వజమెత్తారు. ఆ పథకం అక్రమార్కులకు కల్పతరువుగా మారిందని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు బిజెపిలో నిశబ్దంగా ఓ మూలకు పడున్న ఆమె ఒక్కసారిగా విజయశాంతి స్థానాన్ని ఆక్రమించారు. కెసిఆర్ ని మగాళ్ళతో కాకుండా ఆడవాళ్ళలో తిట్టించాలని బిజెపి వేసిన పథకం బాగానే ఫలిస్తోంది. మొన్నటివరకు డికే అరుణ, విజయశాంతిలు మాత్రమే తగులుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పోర్ట్ పోలియోలోకి జీవితా రాజశేఖర్ కూడా ఇచ్చారు. ఈ దెబ్బతో ఆమె బిజెపిలో ఉన్నారనే విషయం చాలా మందికి తెలిసింది. సిద్ధిపేటలోని బిజెపి నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి పోచమ్మ గుడిలో నిర్వహించిన ‘ప్రజగోస’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోచమ్మ అవహించినట్లు ఆమెలో పూనకం లోడింగ్ అయ్యింది. మోడీ పోచమ్మ లాగా కుడబెడుతుంటే కెసిఆర్ మైసమ్మలా మాయం చేస్తున్నాడని సిగమూగింది. ఈసారి కెసిఆర్…
పాదయాత్రలు ఎవరు చేస్తారు..? ఎక్కువగా రాజకీయ నాయకులే చేస్తుంటారు. కొందరు స్వామీజీలు కూడా. పాదయాత్రగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్తుండటం తెలుసు. కానీ పెళ్లికాని యువకులు కూడా పాదయాత్ర చేశారు. ఎందుకో తెలుసా..? పెళ్లి చేసుకునేందుకు ఓ అమ్మాయిని చూసి పెట్టు దేవుడా అంటూ పాదయాత్ర చేశారు. ఆశ్చర్యంగా ఉందా..? అవును. నిజమే. పెళ్లి కోసం రెండు వందల మంది యువకులు కాలినడకన పాదయాత్ర ప్రారంభించారు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన దాదాపు 200 మంది యువకులు తమకు పెళ్లి కాకపోవడంతో ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవనబెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలో ఉన్న ఆలయానికి ఈ నెల 23న పాదయాత్రగా బయలుదేరి వెళ్ళారు. ఈ రెండు వందల మంది యువకులు మండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి పరిసర గ్రామాలకు చెందిన వారే. వీరిదందరిది వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబమే. ఒక్కొక్కరికి పదెకరాల వ్యవసాయ…
సుప్రీంకోర్టు జడ్జి అబ్దుల్ నజీర్. ఆయన రిటైర్ కాగానే గవర్నర్ పదవి కట్టబెట్టింది కేంద్రం. గతంలోనూ సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇదే విధంగా పదవులు కట్టబెట్టడంతో వారిచ్చిన తీర్పులపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పక్షపాత ధోరణితో వారు కేంద్రానికి అనుకూలంగా తీర్పులను ఇచ్చారా..? అనే సందేహాలను లేవనెత్తేలా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం (2014)ను కేరళ గవర్నర్ గా అపాయింట్ చేసింది కేంద్రం. అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చాయి. కానీ మోడీ సర్కార్ ఎవరి అభ్యంతరాలను పట్టించుకోలేదు. జస్టిస్ సదాశివం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన తాను ఈ గవర్నర్ పదవి చేపట్టడం ఎందుకని అనుకోలేదు. పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిలకు పదవులు ఇవ్వడం స్టార్ట్ చేసింది కేంద్రం. ఆ తరువాత సీజేఐ గా చేసిన రంజన్ గోగొయ్ ను రాజ్యసభకు పంపింది. అయోధ్య తీర్పులో ఆయన ఇచ్చిన తీర్పు వలనే ఈ…
బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దండిగానే అప్పులు చేసింది. అవన్నీ తడిసి మోపెడు అయ్యాయి. ఏంటి ఈ అప్పుల జాతర అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తే రాష్ట్రాన్ని బంగారు తునక చేయాలంటే అప్పులు కావా..? అంటూ ఎదురుదాడి చేస్తూ వస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికీ అప్పులు రూ. 75,577 కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు రూ. 4,33,817.6 కోట్లకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్ రుణాలు, కార్పోరేషన్ల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న రుణాలను అన్నింటిని కేంద్రం వివరించింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4,33,817.6 కోట్లు అప్పు చేసిందని పార్లమెంట్ లో వెల్లడించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఇటీవల ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే… అప్పుల విషయంలో రాద్దాంతం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. అప్పుల విషయాన్ని దాచేందుకు…
నేరస్తులను మార్చే మెకానిక్ షెడ్ లు జైళ్ళు! కానీ అ జైళ్ళు కూడా చివరికి నేరస్తులకు అడ్డాలుగా మారితే దానికి భాద్యులు ఎవరు? ఎవరి కాలర్ పట్టాలి? ఎవరిని అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలి? ఉత్తరప్రదేశ్ అవినీతి, అక్రమాలకు నాడు అడ్డాలాంటిది. చివరికి నేడు జైళ్ళు కూడా అడ్డాలుగా మారాయి. బీఎస్పీ నాయకుడు ముఖ్తార్ అన్సారి పెద్ద గ్యాంగ్ స్టర్. అతను చేసిన నేరాలకు శిక్ష వేయాలంటే 230 ఏళ్ళు కూడా సరిపోవు. ఇది ఓ కేసులో అరెస్ట్ చేసి చిప్ప కూడు తినిపిస్తోంది. ఈ తండ్రి ఏక్ నెంబరి అనుకుంటే ఇతని కొడుకు అబ్బాస్ అన్సారి దస్ నంబరి. అబ్బాస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇతను తండ్రిని మించిన గ్యాంగ్ స్టర్. ఇతను కూడా మరో జైలులో చిప్ప కూడు తింటున్నాడు. ఇతనికి కూడా బుద్ది రాలేదు. తండ్రి లాగే జైలులో ఉంటూ చక్రం తిప్పుతున్నాడు. అతను చేసే అన్నిరకాల…
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అందుకే ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడి కట్టు, బొట్టును విదేశీయులు సైతం అమితంగా ఇష్టపడుతుంటారు. పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోకి వచ్చింది కానీ, మరీ విదేశీ మహిళల తరహాలో భారతీయ స్త్రీలు అరకొర దుస్తులను ధరించి బయటకు రారు. కానీ ఇండియాలోని ఓ గ్రామంలో మాత్రం మహిళలు ఐదు రోజులపాటు దుస్తులు వేసుకోకుండానే తిరుగుతారు. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలోని పిని గ్రామం. అక్కడి గ్రామ మహిళలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదు రోజులపాటు దుస్తులు ధరించకుండా నగ్నంగానే ఉంటారు. పూర్తి నగ్నంగా కాకుండా పలుచటి వస్త్రాల్ని మాత్రమే ధరిస్తారు. ఈ ఐదు రోజులు భార్యాభర్తలు అస్సలు మాట్లాడుకోరు. దూరంగా ఉంటారు. మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా ఐదు రోజులు కఠిన నిబంధనలు ఉంటాయి. మద్యం తాగకూడదు. మాంసం తినకూడదు. ఈ నియమాలు పాటించకపోతే దేవుళ్ళకు కోపం వచ్చి కీడు…
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులోనూ హిట్ అయింది. ఈ క్రమంలోనే ఓటీటీ వర్షన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా హిట్ అయింది. కానీ గత ఏడాది సీజన్ మాత్రం తుస్సుమనిపించింది. తెలియని మొహాలను తీసుకొచ్చారు. పసలేని గేమ్స్ పెట్టి ఆడియన్స్ కు బోర్ కొట్టేలా చేశారు. ఏంట్రా మాకి ఖర్మా అనేలా ఒకటే ఫార్ములాతో బిగ్ బాస్ ను రన్ చేశారు. ప్రేక్షకులకు కోపం వచ్చింది. బిగ్ బాస్ ను కట్ చేసి పడదొబ్బారు. ఫన్ డే అంటూ వచ్చే నాగ్ హోస్టింగ్ కూడా యమా బోరు కొట్టించింది. పైగా.. నాగ్ కొంతమంది పట్ల పర్శియాలిటి చూపిస్తారు. ఇది న్యూట్రటల్ ఆడియన్స్ కు ఏమాత్రం నచ్చట్లెదు. నాగ్ మాత్రం తన తీరు మార్చుకోకుండా రొటీన్ కాన్సెప్ట్ తో షో ను నడిపించేస్తున్నాడు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి భిన్నంగా బిగ్ బాస్ షో ను ప్లాన్ చేయాలనుకుంటున్నారు. పెళ్ళైన జంటలతో…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో తెలిసిందే. అవసరానికి ఎవరితో ఎలా మెదలాలో ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలియదని అంటుంటారు. ఇన్నాళ్ళు ఈటల మొహం కూడా చూసేందుకు ఇష్టపడని కేసీఆర్…ఇప్పుడు ఆయనపై అమితమైన అభిమానం కురిపిస్తున్నారు. ఆదివారం నాటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ చాలా సార్లు ఈటల రాజేందర్, రాజేందరన్న అంటూ ఆప్యాయత కనబరచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈటల విషయంలో కేసీఆర్ ప్రతిసారి పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఆయన లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకో.. హరీష్ అంటూ ఆదేశించారు. ఈటల బీజేపీలోకి వెళ్ళాడు కాబట్టి..ఆయన చెప్పినవి చేయం. మాకు ఇష్టమైతేనే చేస్తామనే ధోరణి ఉండదు. అవసరమైతే కొన్ని అంశాల్లో ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి సలహాలు కూడా తీసుకుంటాం. డైట్ చార్జీలు పెంచాలని ఈటెల రాజేందర్ కోరిక మేరకు వెంటనే పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ మారినంత మాత్రానా తమ మధ్య శతృత్వం ఏర్పడదనే…
సిరిసిల్లలో మెజార్టీ ఓటు బ్యాంక్ ఉన్న పద్మశాలి సామజిక వర్గం బీఆర్ఎస్ పై గుర్రుగా ఉంది. పైగా..కేటీఆర్ అనుచరులు ఇసుక దందా, బెదిరింపులు, అత్యచారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చినప్పుడల్లా ముందస్తు అరెస్టులు చేయల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా… అదంతా ఎలా జరిగిందనేది పెద్దగా చెప్పనక్కర్లేదు. దాంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేటీఆర్ ను సిరిసిల్ల నుంచి మార్చి కూకట్ పల్లి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కేసీఆర్ కు అందిన నివేదికలో ఇది స్పష్టమైంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోని కొంతమంది సిట్టింగ్ లను మార్చాలని ప్రాథమిక నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. పోటీ చేసేందుకు చాలామందే…