Author: Prashanth Pagilla

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ( Ys Jagan ) నుంచి ఆమె తల్లి విజయమ్మ ( Ys Vijayamma), చెల్లి వైఎస్ షర్మిల( Ys Sharmila )కు ప్రాణహాని పొంచి ఉందా..?ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో సానుభూతి కోసం వైఎస్ కుటుంబీకులను హతమార్చే కుట్రలు ఏమైనా జరిగే అవకాశం ఉందా..? వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా కొనసాగుతోన్న ప్రశాంత్ కిషోర్( Prashanth Kishore ) సలహాలతో వివేకా ఘటన తరహాలో మరో ఘాతుకం జరగనుందా.? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేత డీఎల్ రవీంద్ర రెడ్డి ( Dl Raveendra Reddy). ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న క్రమంలో జగన్ నుంచి ఆయన సొంత కుటుంబ సభ్యులు అలర్ట్ గా ఉండాలన్నారు డీఎల్ రవీంద్రరెడ్డి. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ, షర్మిలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్ ఏమైనా చేసే అవకాశం ఉందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కోడికత్తి (…

Read More

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (Jd LaxmiNarayana ) బీఆర్ఎస్ ( BRS ) లో చేరనున్నారా..? ఇందుకు ముహూర్తం ఖరారు అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. లక్ష్మినారాయణ(Jd LaxmiNarayana ) చూపు బీఆర్ఎస్( BRS) వైపు మల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఆయన చేస్తోన్న ట్వీట్లు బీఆర్ఎస్ గురించే ఎక్కువగా ఉంటున్నాయి. స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant ) లో బీఆర్ఎస్( BRS) క్రెడిట్ కొట్టేయడానికి ప్రధాన కారణం జేడీ లక్ష్మినారాయణే. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ ను ఆయనే డిమాండ్ చేశారు. ఆ తరువాత బీఆర్ఎస్( BRS) బిడ్ వేస్తామని చెప్పగానే ఆ పార్టీని అభినందించారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పగానే ఆ క్రెడిట్ ను బీఆర్ఎస్( BRS) కు ఇచ్చింది కూడా ఆయనే. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయమనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇటీవలే…

Read More

కరోనా ( Corona ) మహమ్మారి మళ్ళీ బుసలు కొడుతోంది. మానవాళిని కబళించేందుకు చాపకిందనీరులా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ ( Covid ) కేసులు ఇటీవల పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి ( Posani KrishnaMurali ) కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. కరోనా బారిన పడిన పోసాని ( Posani ) ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం పూణే ( Pune) వెళ్ళిన పోసాని( Posani )కి అక్కడే కోవిడ్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. పూణే( Pune) నుంచి తిరిగి రాగానే పోసానిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని సర్వే సంస్థలు తేల్చేస్తుండటంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు కూడా ఉండటం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్ వశం అవుతుందని గ్రహించే బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి నేతలతో మాట్లాడుతున్నా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మునిగోపోయే నావలో ఉండటం మంచిది కాదనుకొని అగ్రనేతల సూచనలను, ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీతోపాటు 14మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మొత్తంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు 23మంది ఉండగా.. జేడీఎస్ నుంచి 19మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు.…

Read More

దళితులను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అనే ముద్రను చేరిపెసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దళిత జనోద్దరకుడు కేసీఆర్ అనే ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ ఈ విగ్రహవిష్కరణ కార్యక్రమంతో ఈ ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లనుంది. నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ ప్రకటించింది. వాస్తవానికి ఎప్పుడో పూర్తికావాల్సిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చాలా ఆలస్యం అయింది. 2016లోనే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన కేసీఆర్ ఏడేళ్ళ తరువాత విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఈ మధ్యలోనే ఆయన ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. సచివాలయం ఆగమేఘాల మీద కట్టించుకున్నారు. ఫామ్ హౌజ్ లు కొత్త హంగులతో నిర్మించుకున్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసుకున్నారు కానీ…

Read More

ఏప్రిల్ 14. ప్రపంచ జ్ఞానశిఖరం అంబేడ్కర్ జయంతి. దేశానికి తన మేధోసంపత్తి ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అంబేడ్కర్. రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులపాటు రాజ్యాంగ రచన కోసం శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ జయంతి నేడు. ప్రపంచమంతా భారతీయులకు రాజ్యాంగం రాసుకునే సత్తా లేదని హేళన చేసినప్పుడు రాజ్యాంగ రచన బాధ్యతను తాను తీసుకున్నాడు. అహోరాత్రులు శ్రమించి అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి తనను ఛీకొట్టిన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించాడు. ఎంతోమందికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. భారతదేశ అస్తిత్వం ఉన్నంతకాలం అంబేడ్కర్ చరిత సజీవంగా ఉంటుంది. రాజ్యాంగం లేని దేశాన్ని ఊహించుకోవడం ఎంత ఆందోళనకరమో అంబేడ్కర్ లేని భారతాన్ని ఊహించుకోవడం అంతే ఆందోళనకరం. కనిపించని శక్తులేవో నడిపిస్తే నడిచిన మనుషులం మనం అంటాడు శ్రీశ్రీ. ఈవాళ భారతదేశం అనుభవిస్తోన్న ఈ స్వేఛ్చ, స్వాతంత్ర్యాల వెనక అంబేడ్కర్ త్యాగమున్నది. పోరాటమున్నది. ఆయన జీవితం…

Read More

కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. ఈ కేసులో లోతైన విచారణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈఘటన వెనక ఎలాంటి కుట్ర లేదు కాబట్టి పిటిషనర్ కోరుతున్నట్లు ఇంకా విచారణ అవసరం లేదని ఎన్ఐఏ వాదించింది. ఈమేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో నిందితుడిగానున్న శీను టీడీపీ సానుభూతిపరుడు కాదని అలాగే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ పోర్ట్ లోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు ఈ ఘటనతో సంబంధం లేదని తెలిపారు. కోడికత్తి కేసు విషయంలో గత వాయిదాలో జగన్ తరుఫు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కాకుండా జగన్ కు మినహాయింపు ఇవ్వడంతోపాటు లోతైన విచారణ అవసరమని ఈ విషయంలో ఎన్ఐఏ ఘోరంగా విఫలమైందని కనుక పూర్తిస్థాయిలో విచారణ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల తన కాలికి గాయమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ నుంచి పిలుపు రాబోతుందనే విషయం గ్రహించే కవిత తన కాలుకు గాయమైనట్లు పెర్కొన్నారా..? అని సందేహాలను వ్యక్తం చేశారు.అయితే, ఆమె తన కాలు ఫ్రాక్చర్ అయిందని పోస్ట్ చేసి 24గంటలు గడవకముందే ఆప్ నేతల వ్యవహారాలను గతంలో చక్కదిద్దిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ కవితపై బిగ్ బాంబ్ పేల్చాడు. ఆమెతో చేసిన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ లను బయటపెట్టాడు. దాంతో కవిత కాలి గాయంపై విపక్ష నేతల సందేహాలు నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కవితతో సుఖేష్ చంద్రశేఖర్ కోడ్ లాంగ్వేజ్ తో చాట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆప్ నేతలతో కవితకు ఎలాంటి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.?…

Read More

కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన వెనక గుట్టును రేవంత్ రెడ్డి వరుసగా బయటపెడుతున్నారు. కేసీఆర్ , కేటీఆర్ మరో ఏడుగురు ఐఏఎస్ లు ఓ ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లో భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అక్రమాలకు పాల్పడటమే కాకుండా ఇతరులు నిర్మాణాల అనుమతుల కోసం సంప్రదిస్తే 20శాతం భూమిని లంచంగా ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా ప్రతి దాంట్లో దోపిడీకి పాల్పడుతుండటంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్థాయికి చేరుకున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వరుసగా పెడుతోన్న ప్రెస్ మీట్లు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. వరుసగా మూడు రోజులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి భూబాగోతాలను బయటపెట్టిన రేవంత్ పక్కా ఆధారాలతో మీడియాకు ముందుకు వస్తున్నారు. ఎదో గాలి మాటలు అసలే మాట్లాడటం లేదు. రేవంత్ చేస్తున్నవి రాజకీయ ఆరోపణలు అనుకోవడానికి వీలు లేకుండా సర్కార్ ఇచ్చిన డాక్యుమెంట్లు, అందులో జరిగిన…

Read More

ఏపీకి చెందిన మరో క్రికెటర్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించాడు. ఇదివరకు రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రాగా తాజాగా అంబటి రాయుడు పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నారు. అంబటి నిర్ణయానికి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులంతా మద్దతు ప్రకటించడంతో రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు.మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఉద్దేశాలను వెల్లడించాడు. చదువుకున్న యువత, సమాజం పట్ల అవగాహనా కల్గిన యువత రాజకీయాల్లో రావాలని ఇదే తనను రాజకీయాల వైపు వెళ్ళాలనే ఆలోచనకు దోహదం చేసిందని అంబటి రాయుడు తెలిపారు. అయితే , రాజకీయాల్లోకి వచ్చాక తాను క్రికెట్ కు దూరం మాత్రం కానని స్పష్టం చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం…

Read More