• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
    • Voter Registration Help
Polytricks.in
Home » కోడికత్తి కేసులో జగన్ కు ఝలక్
AndhraPradesh

కోడికత్తి కేసులో జగన్ కు ఝలక్

Prashanth PagillaBy Prashanth Pagillaఏప్రిల్ 13, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

కోడికత్తి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. ఈ కేసులో లోతైన విచారణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈఘటన వెనక ఎలాంటి కుట్ర లేదు కాబట్టి పిటిషనర్ కోరుతున్నట్లు ఇంకా విచారణ అవసరం లేదని ఎన్ఐఏ వాదించింది. ఈమేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో నిందితుడిగానున్న శీను టీడీపీ సానుభూతిపరుడు కాదని అలాగే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ పోర్ట్ లోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్ కు ఈ ఘటనతో సంబంధం లేదని తెలిపారు.

కోడికత్తి కేసు విషయంలో గత వాయిదాలో జగన్ తరుఫు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కాకుండా జగన్ కు మినహాయింపు ఇవ్వడంతోపాటు లోతైన విచారణ అవసరమని ఈ విషయంలో ఎన్ఐఏ ఘోరంగా విఫలమైందని కనుక పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరారు. కానీ ఈ కోడికత్తి ఘటనలో అసలు కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చింది. తాము పూర్తిస్థాయిలో విచారణ జరిపామని… ఈ కేసులో ఇంకా విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఎన్ఐఏ వాదనకు భిన్నంగా టీడీపీ వాదిస్తోంది. కోడికత్తి ఘటన వెనక కుట్ర ఉందని అంటోంది. జగన్ పై దాడిగా క్రియేట్ చేసుకొని ప్రజల్లో సానుభూతిని రగిల్చి ఎన్నికల్లో లబ్ది పొందారని కాబట్టి ఈ కేసులో కుట్ర కోణం ఉందని టీడీపీ బలంగా చెబుతోంది. ఈ కోణంలో విచారణ జరిగితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. కానీ కోడికత్తి కేసును విచారణ చేస్తోన్న ఎన్ఐఏ అసలు కుట్ర లేదని అంటోంది. జగన్ ను చంపాలనే కుట్ర లేకపోయినా ఈ ఘటనను మాత్రం ఎన్నికల్లో వైసీపీ ప్రచారాస్త్రంగా వాడుకుంది.

కోడికత్తి ఘటనపై చార్జీషీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. ఈ సమయంలోనే జగన్ పై కుట్ర కోణం వెలికి తీయడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందని.. ఈమేరకు మరింత లోతైన విచారణ జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని జగన్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశం అయింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేయడంతో జగన్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

పేదవాడికి కలెక్టరేట్‌ అంటే నమ్మకం రావాలి… ఉద్యోగులే ప్రభుత్వ ముఖచిత్రం: సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30, 2026

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 20260

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ Graduate MLC నియోజకవర్గంలో తాజా పబ్లిక్ రిపోర్టెడ్ Form-18 దరఖాస్తులు 94,059. 2021లో 5.17 లక్షల electorateతో పోలిక, కాంగ్రెస్ 43 observers–7 లక్షల target, BRS mobilisationతో PolyTricks విశ్లేషణ.

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

94 వేల దాటిన గ్రాడ్యుయేట్ దరఖాస్తులు… రిజిస్ట్రేషన్ రేసులో కాంగ్రెస్ ముందస్తు మొబిలైజేషన్

అక్టోబర్ 15, 2026

చెరువుకు రక్షణ… యువతకు భవిష్యత్తు… తినే తిండికి భరోసా!

అక్టోబర్ 1, 2026

భూమి హక్కుల నుంచి బతుకు భద్రత దాకా… రేవంత్ ప్రభుత్వ కొత్త చట్టాల ముచ్చట!

అక్టోబర్ 1, 2026

స్కిల్స్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా… రేవంత్ పాలన ముచ్చట!

సెప్టెంబర్ 30, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version