Author: Prashanth Pagilla

ఉపాసన – రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూలై 20వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఓ రకమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదా అని చర్చించుకుంటున్నారు. చిరంజీవికి ఇద్దరు కూతుళ్ళు సుస్మిత, శ్రీజలు. వీరికి కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా పాపే పుట్టింది. ఎవరు పుట్టినా ఆనందించాల్సిన విషయమే. కానీ మనవడిని ఎత్తుకోవాలనుకున్న చిరంజీవికి అదొక కలగానే మిగిలిపోతుందా..? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి పెద్దకూతురు సుస్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా ఒకే. కానీ అబ్బాయి పుడితే ఇంకా ఆనందిస్తాం. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ అమ్మాయిలే ఉన్నారు అబ్బాయి ఒకడు లేదు. అందుకే మొదట అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నామని చెప్పింది. ఇప్పుడు రామ్ చరణ్ కి…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఓ వైపు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేలా వ్యూహం అనుసరిస్తూనే మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా శరవేగంగా పావులు కదుపుతోంది. కాసేపటి క్రితమే వైఎస్ షర్మిల భర్తకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ తో సోనియా, రాహుల్ పర్యటన గురించి తెలిపినట్లు తెలుస్తోంది. మంగళవారం లేదా బుధవారం సోనియా గాంధీ వైఎస్ షర్మిల, విజయమ్మతో మాట్లాడుతారని కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే జూలై ఎనిమిదిన వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలు ఇడుపులపాయకు వచ్చి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నట్లు తెలుస్తోంది. జగన్ టార్గెట్ గా వ్యూహాలను కాంగ్రెస్ హైకమాండ్ సిద్దం చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది. రాహుల్ గాంధీని…

Read More

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అసలు కథకు, సినిమా స్టొరీకి ఏమాత్రం సంబంధం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ గెటప్ కూడా అంతంతమాత్రమే ఉందని పెదవి విరుపులు వచ్చాయి. ఈ సినిమా వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా కాల్పనిక దృష్టితో తీసినట్లు ఉందని ఆగ్రహావేషాలు వ్యక్తం అవుతున్నాయి. రామాయణాన్ని వ్యాపార ధోరణితో చూస్తారా..? అనే ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత స్పందించింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో మాధవిలత ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. పలు అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. పవన్ పై మాత్రమే స్పందించే మాధవిలత ఈసారి మాత్రం ప్రభాస్ ను టార్గెట్ చేసింది. ఆదిపురుష్ తో జనాలను మెప్పించకపోవడంలో ప్రభాస్…

Read More

కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇతర పార్టీలోకి వెళ్లే నేతలే ఉండేవారు కానీ కాంగ్రెస్ లోకి కొత్తగా ఎవరూ చేరేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తామని కబురు పంపుతున్నారు. మరికొంతమంది నేతలు టికెట్ పై హామీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ కు మునుపటి వైభవం వస్తున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డితోపాటు కూచకుళ్ళ దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి కూడా కాంగ్రెస్ లో చేరడం లాంచనమే. బీజేపీ నుంచి మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొస్తానని ఇటీవల ప్రియాంక…

Read More

వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమా..? కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటుందా..? అనే అంశంపై జరుగుతోన్న చర్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. డీకే శివ కుమార్ , కేవీపీల సూచన మేరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకే షర్మిల మొగ్గు చూపినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ద్వారా షర్మిల రాజకీయం చేసేందుకు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినా… వైఎస్సార్ వారసురాలు పార్టీలోకి వస్తానంటే వద్దనడం సరైంది కాదని…ఆమెకు పాలేరు సీటు ఇస్తే సరిపోతుందని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఉదృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. గతంలో తన తండ్రి మరణానికి సోనియా కుట్ర…

Read More

ట్రాన్స్ యాక్టర్ అండ్ LGBTQIA కార్యకర్త సుశాంత్ దివ్ గికర్ ట్రాన్స్ పర్సన్ గా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ట్రాన్స్ జెండర్ గా ఉండటమంటే సెక్స్ వర్క్ చేయాల్సి వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. పలు హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ లలో పని చేసినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఎంతోమంది వస్తూ, పోతు సూటిపోటి మాటలతో తన హృదయానికి గాయం చేసే వారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు ఇలాంటి నీచమైన సమాజంలో ఉన్నామా..? అని బాధ కల్గేదని వివరించాడు. తను బాధలో ఉన్నప్పుడు తన తండ్రి తనకు అండగా నిలిచాడని చెప్పాడు. ఓ రోజు నేను బాధ పడుతున్నపుడు మా నాన్న నా చేయి పట్టుకొని.. జనాలు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటు ఉంటారు. అవన్నీ విను. వాళ్ళు ఏదీ కావాలంటే అది మాట్లాడుకోనివ్వు. కానీ దానిని మనస్సులో…

Read More

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని వివేకా కూతురు సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డితోపాటు సీబీఐకి నోటిసులు జారీ చేసింది. గత విచారణ సమయంలో నోటిసులు జారీ చేసేందుకు కూడా నిరాకరించిన న్యాయస్థానం ఇప్పుడు నోటిసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ ఏం జరగబోతుందన్న ఉత్కంటను పెంచేసింది. సోమవారం నాటి విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి, సీబీఐకి నోటిసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికీ వేసవి సెలవులు పూర్తవుతాయి. ఈ కారణంగా వెకేషన్ బెంచ్ స్థానంలో ఈ పిటిషన్ పై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడంపై గతంలోనూ ఓసారి తెలంగాణ హైకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు… జూలై 3న జరిగే విచారణ సందర్భంగా…

Read More

అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్సేనని ఓ వైపు కారు పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా…బీఆర్ఎస్ పనైపోయింది, అధికారంలోకి మేమే వస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ లపై జనాలకు నమ్మకం సన్నగిల్లిందని అధికారం తమదేనని బీజేపీ స్వరం వినిపిస్తోంది. ఇలా అధికారం మాదంటే మాదేనని మూడు పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా రేవంత్ విడుదల చేసిన సర్వే రిపోర్ట్ కలకలం రేపుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి 80సీట్లు వస్తాయని పదేపదే చెప్తూ వచ్చిన రేవంత్.. సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు 45సీట్లు వస్తాయని అలాగే బీఆర్ఎస్ కూడా 45సీట్లకే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి మాత్రం ఏడు సీట్లు వస్తాయని పేర్కొన్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఒకే సీట్ గెల్చిన బీజేపీకి కాస్త హైప్ పెరగడంతో ఆరు సీట్లు పెరుగుతాయని చెప్పడం ఈ సర్వేకు విశ్వసనీయత ఏర్పడేలా చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని చెప్పలేదు…

Read More

ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలపై విశ్లేషణ చేశారు. కేసీఆర్ రాజకీయ విశ్వసనీయత పట్ల ప్రజల్లో హేయభావం కల్గేలా రాసుకొచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్.. అక్కడ అవకాశమొస్తే సీఎం పదవి చేపడుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడితే దళితుడే సీఎం అవుతాడని ప్రకటించిన కేసీఆర్ ఆ సామజిక వర్గానికి సీఎం పదవి ఎందుకివ్వరని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రమేర్పడిన తరువాత దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కారణం..నూతన రాష్ట్రమైన తెలంగాణను కాపాడుకోవడం కోసమేనని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. కనుక, సీఎం పదవి ఇప్పటికైనా దళితులకు ఎందుకు ఇవ్వరని లాజిక్ తో కూడిన ప్రశ్నను లేవనెత్తారు. తన తరువాత సీఎం చైర్ లో కేటీఆర్ ను కూర్చోబెట్టేందుకు కేసీఆర్ వ్యవహారాలన్నింటిని చక్కబెడుతున్నారని ఆర్కేకు స్పష్టత ఉంది. అందుకే కేటీఆర్ కు సీఎం చైర్ అందకుండా దళిత సీఎం హామీని…

Read More

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందుగానే ప్రిపేర్ అయ్యారు. అభ్యర్థుల వడపోత కూడా పూర్తైంది. ఆషాడమాసం ముగిసిన తరువాత జూలై రెండో వారంలోనే బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఆశావాహులు ఎన్నికల ముంగిట పార్టీని వీడితే అది బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎన్నికల ముంగిట కొని తెచ్చుకోవద్దని…నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. టికెట్ ఆశావాహులు అధికంగా ఉన్న చోట , ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను రెండో విడతలో ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మొదటి విడతలోనైతే 80మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో…

Read More