Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ ఏ పార్టీని ఎప్పుడు, ఎలా దెబ్బకొట్టాలో స్కెచ్ గీసే ఉంటారు. ఎన్నికల వేళ ప్రత్యర్ధి పార్టీల నుంచి కొంతమంది నేతలను కారేక్కించుకొని ఆత్మస్థైర్యం దేబ్బతీయలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంటుంది. ఈసారి కూడా అలాంటి వ్యూహం అమలు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇన్నాళ్ళు బీజేపీని ప్రధాన శత్రువుగా ట్రీట్ చేసిన కేసీఆర్ తన అసలు ప్రత్యర్ధి ఎవరో తేల్చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్ ను దెబ్బతీయాలని.. ఇందుకోసం త్వరలోనే కాంగ్రెస్ లోని ఓ ఇద్దరు సీనియర్ నేతలను కారేక్కించాలని చూస్తున్నారు. చర్చలు కూడా పూర్తయ్యాయని ఆ ఇద్దరు సదరు నేతలు కూడా మంచీ టైం చూసుకొని హస్తం పార్టీని వీడుతారనే ప్రచారం కొన్నాళ్ళుగా గుప్పుమంటుంది. అయితే ఆ ఇద్దరి నేతల వలన పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఎన్నికల వేళ ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్…
ఎన్నికల ముంగిట పథకాలతో ప్రజలను మచ్చిక చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నాలుగున్నరేళ్లుగా ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ఏదో ఒక పథకం ప్రజలకు అందించి మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే పదవి ఊడిపోతుందని ఆందోళనతో ఉన్నారు. అందుకే ఓటర్లకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని చూస్తు న్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మీలలో ఏదో ఒక పథకాన్ని ప్రజలకు అందించాలని పట్టుదలతో ఉన్నారు. ఒకే కుటుంబానికి మూడు పథకాలను వర్తింపజేస్తే ఈ పథకాలకు నోచుకోకుండా ఉండిపోయిన వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని లెక్కలు కడుతున్నారు. అందుకే అందరికీ ఏదో ఒక పథకం అందించి ఓట్లు పొందాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తమను కలుస్తున్న వారికి ఏదో ఓ పథకం ఇస్తాంలే..ఆందోళన చెందకండని ప్రజలకు ఎమ్మెల్యేలు నచ్చజెప్పి పంపుతున్నారు. ఎన్నికల వేళ కొంతమందికి పథకం అందించి మరికొంతమందికి సాయం చేయకపోతే అది మొదటికే మోసం…
రానున్న ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ సీరియస్ గా తీసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా గురి పెట్టాయి. ఈమేరకు అభ్యర్థుల ఎంపికపై మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో దూకుడు పెంచాయి. సెప్టెంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బీజేపీలు మొదటి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును కంప్లీట్ చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ మొదటి జాబితా బయటకు లీక్ కాగా, తాజాగా బీఆర్ఎస్ ,బీజేపీల మొదటి జాబితా కూడా బయటకొచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్ ఎల్బీ నగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంత రావు చేవెళ్ల – కాలె యాదయ్య రాజేంద్రనగర్ – ప్రకాష్ గౌడ్ పరిగి – మహేష్ రెడ్డి వికారాబాద్ -…
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం ముస్తాబు అవుతుండగా ఒకే రోజు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీకి చెందిన ఓ యువకుడిని ప్రేమించిన పాక్ మహిళ సీమా హైదర్ భారత జాతీయ జెండాను ఎగరేసి.. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేసింది. అలాగే, ఓ ఉగ్రవాది సోదరుడు కూడా జాతీయ జెండాను ఎగరేయడం గమనార్హం. తాజాగా ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జాతీయ జెండా ఎగరేసిన పాక్ మహిళ పూర్తి వివరాల్లోకి వెళ్తే…పాక్ కు చెందిన సీమా హైదర్ అనే మహిళకు యూపీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పబ్జీ గేమ్ తో ఈ పరిచయం కుదిరి ప్రేమకు దారికి తీసింది. దాంతో ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చేసింది. ఇటీవల కేంద్రం ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ లో పాల్గొన్న ఆమె.. తాజాగా తమ ఇంటిపై…
అక్టోబర్ చివరి వారం లేదా, నవంబర్ మొదటి వారంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భావిస్తోన్న కేసీఆర్.. పార్టీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయ్యారు. మంచి ముహూర్తం చూసుకొని అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు ఈమేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 17నుంచి శ్రావణం మాసం ప్రారంభం అవుతుంది. 18న శ్రావణ శుక్రవారం కావడంతో అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్ లను బలంగా విశ్వసించే కేసీఆర్… శ్రావణ మాసంలో అభ్యర్థుల జాబితాను వెల్లడించాలని మొదటే భావించారు. కానీ ఏ తేదీన ప్రకటించాలనే విషయంలోనే ఆలోచిస్తున్నారు. మొదటి జాబితాలో 80మంది పేర్లను ప్రకటిస్తారని అనుకున్నా…105పేర్లను ఫస్ట్ లిస్టులో ఉంచేలా జాబితాను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ 105పేర్లను ప్రకటించకుంటే కేసీఆర్…
గ్రూప్ -2 పరీక్షల నిర్వహణలో ముందు వెనక చూసుకోకుండా పరీక్షల తేదీలను టీఎస్ పీస్సీ ప్రకటించడం సర్కార్ కు తలనొప్పిగా మారింది. రెండోసారి కమిషన్ ఏర్పాటు అయిన నాటి నుంచి ఏదో ఓ వివాదం అటు కమిషన్ ను, ఇటు సర్కార్ ను చుట్టుముడుతున్నది. టీఎస్ పీస్సీపై చర్యలు తీసుకుంటే అసమర్ధతను అంగీకరించినట్లు అవుతుందన్న భావన ఒకటైతే… వ్యవస్థను గాడిన పెట్టకపోతే ఇంకెన్ని నిర్వాకాలు జరుగుతాయోనని సర్కార్ ఆందోళన చెందుతోంది. ఇలా వరుస వివాదాల్లో టీఎస్ పీస్సీ నానుతోంది. గ్రూప్ 2 పరీక్షలపై వివాదం ఈ నెలలోనే గురుకుల పరీక్షలు, గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23వరకు గురుకుల పరీక్షలు ఉండగా..29,30తేదీలలో వరుసగా గ్రూప్ 2పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ పీస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇలా వరుస తేదీలలో పరీక్షలకు షెడ్యూల్ ఇవ్వడంపై గ్రూప్ 2అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు.…
తెలంగాణ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్ళురుతుంటే, ఇక తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ తో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటోంది. బీజేపీ కూడా తామేమి తక్కువ కాదని పోటీనిచ్చే స్థాయిలో రాజకీయం చేస్తోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయమే ఉండగా ఆయా సంస్థలు, మీడియా యాజమాన్యాలు తెలంగాణలో గెలుపు ఎవరనే అంశంపై సర్వేలు చేపడుతున్నాయి. తాజాగా సిగ్నిచర్ స్టూడియో చానెల్ సర్వే చేసింది. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి.. సిగ్నిచర్ స్టూడియో చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు వస్తాయని తేలింది. 58సీట్లతో మొదటి స్థానంలో నిలిచి, అధికారంలోకి వచ్చేందుకు మరో రెండు సీట్ల దూరంలో నిలుస్తుందని తేల్చింది. తెలంగాణలో ఏదైనా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 60. అంటే రెండు సీట్ల దూరంలో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వేలో వెల్లడి అయింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి…
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ భోళా శంకర్’ సినిమా తాజాగా విడుదలైంది. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తోపాటు భావోద్వేగాలను మేళవించి తీసిన ఈ సినిమాలో చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటించారు. మెగాస్టార్ కు జోడిగా తమన్నా కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. స్టొరీ : మహాలక్ష్మి (కీర్తి సురేష్) పెయిటింగ్ కళాకారిణి. పెయిటింగ్ పై మక్కువతో కలకత్తాలో మంచి ఆర్ట్స్ కాలేజ్ ఉందని తెలియడంతో ఆమెను అందులో జాయిన్ చేయడానికి అన్నయ్య శంకర్ కలకతా షిఫ్ట్ అవుతాడు. అక్కడే చెల్లి బాగోగులు కోసం క్యాబ్ డ్రైవర్ గా చేరుతాడు. అయితే , కలకత్తాలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుల ఫోటోలను డ్రైవర్లకు ఇవ్వడంతో… శంకర్ సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ బారి నుంచి కాపాడుతారు. ఈ సమాచారం పోలీసులకు…
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళను ప్రస్తావన తీసుకొస్తూ జనసేనాని రాజకీయ ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను పవన్ కు మద్దతుగా లేనని చాలామంది విశ్లేషిస్తున్నారని ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను మొదటి నుంచి ఇప్పటివరకు కూడా పవన్ కు సపోర్ట్ గా ఉన్నానని చెప్పారు. సమాజం కోసం మంచి చేయాలని పరితపించే నేత పవన్ కళ్యాణ్ అని…ఆయనది అరుదైన వ్యక్తిత్వమని కొనియాడారు. ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని..పేదలకు మంచి చేయాలని పరితపించే వ్యక్తి అంటూ స్పష్టం చేశారు. ఈమేరకు ఇన్స్టాలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడని..దయచేసి పవన్ కు ఒక్క అవకాశం ఇవ్వండని రేణు దేశాయ్ ప్రజలకు…
తెలంగాణలో అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ రెడీ అయింది. ఎలాంటి వివాదం లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను రెడీ అయిందని..ఏఐసీసీ పెద్దల ఆమోదం అనంతరం ఈ జాబితాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ నెల చివరాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో 60మంది అభ్యర్థుల జాబితాను బయటపెట్టనున్నారని సమాచారం. టీపీసీసీ- ఏఐసీసీ సర్వే బృందాలు చేపట్టిన సర్వే ఫలితాల తరువాత అధికారికంగా ఈ జాబితాను రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇప్పటికే టికెట్ ఖరారు చేసిన నేతలకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి.. నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కొడంగల్ – రేవంత్ రెడ్డి అచ్చంపేట – వంశీకృష్ణ వనపర్తి – చిన్నారెడ్డి కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు షాద్ నగర్ – వీర్లపల్లి శంకర్ గద్వాల్ – సరిత యాదవ్ అలంపూర్ – సంపత్ కుమార్ కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల…