Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ ఉద్యమానికి ఇక దారులు మూసుకుపోయినట్లే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. దాంతో 33% మహిళా రిజర్వేషన్ కోసం తెలంగాణ భవన్ ఎదుట ధర్నా చేయగలవా కవిత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కవిత గతంలో ధర్నా చేపట్టింది. ఉద్యమకారులకు, మేధావులకు లేఖలు రాసింది. ఇప్పుడు కవిత డిమాండ్ ను ఆమె తండ్రి కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేసినట్లుగా అయింది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ పిలిచిందనే మహిళా రిజర్వేషన్ రాగం అందుకుందని కవితపై విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఆమె మహిళా రిజర్వేషన్ పై తన పోరాటం కొనసాగుతున్నందుకే ఈ విధమైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కొంతకాలంగా ఆ కేసులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో…
బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఓ ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడం పట్ల ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నెత్తిన శనిని మోపేందుకు కేసీఆర్ ఆ ఎమ్మెల్సీకి కీలక పదవిని ఆఫర్ చేశారా..? అని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరవర్గం అనుమానిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనకు ప్రాధాన్యత కల్గిన పదవిని ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వానికి మరో మూడు నెలల గడువు మాత్రమే ఉంది. ఆ తరువాత బీఆర్ఎస్ గెలిచినా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఉండేది అనుమానమే. ఈ క్రమంలోనే ఈ మూడు నెలల కోసం పదవి చేపట్టడం ఎందుకని పట్నం వర్గీయులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. “నేను చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది.. చూస్తుండండి.. మంత్రి పదవి అండతో నేనేం చేస్తానో అంటూ”…
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణంతో ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీపై సందిగ్ధంలో పడ్డారు. భర్త మరణంతో ఆ విషాదం నుంచి ఆమె ఇంకా బయటపడలేకపొతున్నారు. ఈసారి తామిద్దరం పోటీలో ఉంటామని దయాకర్ రెడ్డి గతంలో స్పష్టం చేశారు. కానీ దయాకర్ రెడ్డి అనారోగ్య సమస్యతో మరణించడంతో సీతా దయాకర్ రెడ్డి పోటీలో ఉంటారా..? లేదా..? అనే విషయంపై మక్తల్, దేవరకద్ర పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన దయాకర్ రెడ్డి దంపతులు స్వతంత్రంగానే కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా..? పొలిటికల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తారా..? అనేది బిగ్ డిబేట్ గా మారింది. దయాకర్ రెడ్డి మరణం తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు కొన్ని రోజులుగా సీతా దయాకర్ రెడ్డిని వరుసగా కలుస్తూ ఆమెను పోటీ…
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద బీఆర్ఎస్ లో చేరబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఇందుకోసం బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు కేసీఆర్. మహారాష్ట్రలో ఇతర పార్టీ నేతలెవరూ బీఆర్ఎస్ లో చేరడం లేదు. దాంతో గుర్తింపు కల్గిన వారెవరైనా ఉంటే మహారాష్ట్ర నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా జయప్రదతో బీఆర్ఎస్ సంప్రదింపులు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద ఆ తరువాత సమాజ్ పార్టీలో చేరింది. చాలా ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగింది. అమర్ సింగ్ ఆమెకు రాజకీయ గురువుగా ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా కూడా గెలిచింది. ఆయన మరణం తరువాత జయప్రద భవిష్యత్ ఎటు కాకుండా అయిపొయింది. దాంతో ఆమె కూడా రాజకీయంపై ఇంట్రెస్ట్ తగ్గించేశారు.…
నీతివంతమైన రాజకీయాలకు కేరాఫ్ గా , ప్రస్తుత రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా సొంతింటిని కూడా నిర్మించుకోలేదు. అసెంబ్లీకి కూడా ఆయన ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళేవారు. ప్రజా సేవలోనే తరించారు తప్పితే వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోలేదు. అలాంటి నేపథ్యమున్న గుమ్మడి నర్సయ్య కూతురు ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొ. గుమ్మడి అనురాధ తన తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉండటంతో బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధను ఇల్లందు నుంచి పోటీ చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఇల్లందు నుంచి గెలిచిన హరిప్రియ అధికార బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఎవరికిస్తారనే దానిపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తానని నాగం ఖరాఖండిగా చెబుతుంటే మరోవైపు దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి తెరవెనక టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన కుమారుడుతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటానని వ్యాఖ్యానించిన దామోదర్ రెడ్డి చివరి నిమిషంలో వెనుకంజ వేశారు. నాగర్ కర్నూల్ టికెట్ పై కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టత లేకపోవడంతోనే దామోదర్ రెడ్డి పార్టీ మార్పుపై ఆగిపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగం జనార్ధన్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి, సర్కార్ పెద్దల దోపిడీతోపాటు టికెట్ అంశంపై కూడా స్పందించారు. తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావాన్ని నాగం వ్యక్తం చేశారు. టికెట్ కోసం అందరూ దరఖాస్తు చేసుకుంటే తాను…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చుననే ధోరణితో అధికార బీఆర్ఎస్ కనిపిస్తోంది. సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అక్టోబర్ లో పోలింగ్ ఉంటుందని పార్టీ కీలక నేతలకు సమాచారం అందించారు కేటీఆర్. ఆయనకు పక్కా సమాచారం ఉందో లేక పార్టీ నేతలను అలర్ట్ చేసేందుకు ఇలాంటి ప్రకటన చేశారో క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్ హడావిడి చూస్తుంటే ఎన్నికల షెడ్యూల్ పై అధికార పార్టీకి స్పష్టమైన సమాచారం ఉందనే అనుమానం కలగక మానదు. హడావిడిగా పథకాలలో కదలిక తీసుకొచ్చిన బీఆర్ఎస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పథకాల అమలుకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అవన్నీ పాత పథకాలేనని చెప్పి వాటిని ఎన్నికల సమయంలోనూ అందించి ఓటర్ల మెప్పు పొందేలా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను రెడీ చేసిందని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫాలసీని…
తొలివెలుగు ఛానెల్ నుంచి రఘు నిష్క్రమించే సమయంలోనే తొలివెలుగు అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. ఆ తరువాత కొద్దిరోజులు ఛానెల్ కథనాల్లో పెద్ద మార్పేమీ కనిపించకపోవడంతో రఘు చెప్పింది వాస్తవం కాదనుకున్నారు. రేవంత్ సన్నిహిత జర్నలిస్ట్ నరసింహ రెడ్డి స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఇది టీఆర్ఎస్ కు అమ్ముడు పోలేదు అనుకున్నారు, కానీ ఇటీవల తొలివెలుగు నుంచి నరసింహ రెడ్డి తో పాటు 20మంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాల అనంతరం ఛానెల్ పింక్ కలర్ పుసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా తొలివెలుగులో ప్రసారం అవుతోన్న కథనాలన్నీ రవి ప్రకాష్ సారధ్యంలో నడుస్తున్న ఆర్టీవీవే. ఇందులో ప్రభుత్వ అనుకూల వార్తలే అధికంగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వార్తలకు మాత్రమే స్పెస్ ఇచ్చే తొలివెలుగు ఆల్ ఆఫ్ సడెన్ గా కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించే వార్తలకు ప్రాధాన్యత ఇస్తోంది. పొంగులేటికి షాక్ అంటూ, రేవంత్ రెడ్డికి షాక్, కాంగ్రెస్…
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీని కంప్లీట్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై విపక్షాల నుంచి మాటల దాడి కొనసాగుతుండటంతో తొందరగా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చేసి విపక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ బుధవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. వారం రోజుల్లో తొలి విడత ఇళ్ళ పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరీ వెరిఫికేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని తొందరలోనే ఇళ్ళ పంపిణీ చేపడుతామని స్పష్టం చేశారు. 70వేల ఇల్లు పంపిణీకి రెడీగా ఉన్నట్లు అధికారులు చెప్పారన్న కేటీఆర్…ఈ ఇళ్ళను దశల వారీగా అర్హులైన వారికి అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే వారంలో మొదటి…
ఒక్కటిగా కలిసి ఉన్నారనుకున్న భూమా కుటుంబ సభ్యులు రాజకీయాలు మాత్రం ఎవరికీ వారుగా చేస్తున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల టికెట్ పై ఎవరికీ వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఎవరికీ వచ్చినా సహకరించుకుందామని ఫిక్స్ అయి విడివిడిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కానీ క్యాడర్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతోంది. భూమా దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి రెండు సీట్ల కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉండగా…నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ ఇద్దరికీ టికెట్లు కన్ఫాం అని ప్రచారం జరుగుతోన్న వేళ భూమా మౌనిక రెడ్డి తన భర్త మంచు మనోజ్ తో కలిసి చంద్రబాబును కలవడం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయాలపై మౌనికకు ఆసక్తి ఉంది. అనర్గళంగా మాట్లాడగలదు. నంద్యాల…