Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
నిజామాబాద్ కాంగ్రెస్ అర్బన్ టికెట్ కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం అనుచరులతో కలిసి గాంధీ భవన్ కు వచ్చిన రామర్తి గోపి తన దరఖాస్తును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తెలంగాణలో దగాపడిన యువత గొంతును చట్టసభల్లో వినిపించేందుకు తనకు అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 52శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23సీట్లు మాత్రమే ఇచ్చిందని.. కాంగ్రెస్ మాత్రం బీసీలకు గణనీయమైన సీట్లు కేటాయిస్తుందని నమ్మకం తనకు ఉందన్నారు గోపి. యువకులకు రాజకీయాల్లో అధిక అవకాశాలు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆదేశాలను టీపీసీసీ పాటిస్తుందన్నారు. బీఆర్ఎస్ యువత పట్ల అవలంభించిన విధానాలను యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించిన తనకు పార్టీ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ లోనే కష్టపడి పని చేసే నేతలకు న్యాయం జరుగుతుందన్నారు.…
బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు. అసంతృప్త నేతలు కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఒకటి, రెండు చోట్ల అభ్యర్థులను మార్చుతామని కేసీఆర్ ప్రకటనతో తమకు అవకాశం దక్కకపోదా..? అని మరికొంతమంది నేతలు వెయిట్ అండ్ సీ అనే ధోరణితో ఉన్నారు. కేసీఆర్ సన్నిహితులుగా ముద్రపడిన నేతలు, టికెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నటువంటి నేతలు కొంతమంది కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టికెట్ ఇస్తామని హామీ ఇస్తే గోడ దూకుందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కీలక నేతలతో ఈ సంప్రదింపుల పర్వం కొనసాగుతోంది. ప్రధానంగా తుమ్మల , జలగం వెంకట్రావు, వేముల వీరేశం, ఎడ్ల సుధాకర్ రెడ్డి, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, నీలం మధులు కాంగ్రెస్ నేతలతో…
జబర్దస్త్ కమెడియన్ నవసందీప్ అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మధురానగర్ పోలీసులు నవసందీప్ ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నవసందీప్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఆమెతో వాట్సప్ చాటింగ్ కూడా చేశాడు. ఆమెను ఊరు విడిచి హైదరాబాద్ కు రావాలని కోరాడు. అందుకు అంగీకరించిన యువతి హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి హైదరాబాద్ కు వచ్చాక శారీరకంగా ఆ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆ యువతి నవసందీప్ ను కోరగా గుండెలు పగిలే న్యూస్ చెప్పాడు. తాను నిన్ను పెళ్లి చేసుకోలేను. తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. నమ్మకా ద్రోహానికి గురై మోసపోయినట్లు గ్రహించిన యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నవసందీప్ -…
ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలనేది విపక్షాల ఆలోచన. కేసీఆర్ ను ఓడిస్తే బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీసినట్లు అవుతుందని అనుకుంటున్నారు. అందుకే కేసీఆర్ పై విపక్షాల తరుఫున ఒకే అభ్యర్థిని బరిలో దించాలని చర్చలు సాగుతున్నాయి. ఏదో ఓ పార్టీకి చెందిన నేతను కేసీఆర్ పై పోటీకి దింపితే ఒక్కొక్క పార్టీ ఒక్కో వాదనను వినిపిస్తాయి. అందుకే న్యూట్రల్ గా ఉండే నేతను కేసీఆర్ పై పోటీకి నిలపాలని అనుకుంటున్నారు. అందుకు కోదండరాం సరిగ్గా సెట్ అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ సాధనలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా కొనసాగిన కోదండరాం రాష్ట్రం ఏర్పాటయ్యాక పార్టీ పెట్టారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. కోదండరాంకు కేసీఆర్ పదవుల ఆశ చూపినా బీఆర్ఎస్ లో చేరలేదని ఆయనపై మంచి ఒపినియన్ ఉంది. ప్రజల్లో ఓ రకమైన సానుభూతి…
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ పరిణామాలపై గత కొంతకాలంగా హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారని దాంతో ఆయన కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్ళారని బుధవారం నుంచి ప్రచారం సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత తన వర్గం ఎమ్మెల్యేలతో హరీష్ కాంగ్రెస్ గూటికి చేరుతారనేది ఆ ప్రచార సారాంశం. హరీష్ రావుపై ఈ రకమైన ప్రచారం ఎవరు చేయిస్తున్నారు..? ఇది ప్రచారమేనా..? వాస్తవం ఏమైనా ఉందా..? అనే చర్చలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ తోపాటు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు రేపెందుకు ఈ రకమైన ప్రచారం చేయిస్తున్నారా..? లేక వ్యూహాత్మకంగా హరీష్ రావును పార్టీలోకి లాగేసుకోవాలని ప్రత్యర్ధి పార్టీ ఈ రకమైన ప్రచారం చేయిస్తోందా..? అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే, పార్టీలో ఉన్న కొంతమంది నేతలే ఈ తరహ ప్రచారం వెనకుండి నడిపిస్తున్నారా..? అనే అనుమానాలను…
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై అనర్హత వేటు విషయం మరవకముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు వేసింది హైకోర్టు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు తేలడంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తరువాత స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి స్థానంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. అయితే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ సెక్రటరీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యేకు సంబంధించిన అంశంలో అసెంబ్లీ సెక్రటరీ ఎలా వ్యవహరిస్తారు..? అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 27మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఎన్నికలకు మరో…
తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఎవరిని డిసాపాయింట్ చేయవద్దని భావిస్తోన్న సర్కార్ పెద్దలు.. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎంతోకాలంగా వెయిట్ చేస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. దీనిని డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని ప్రకటించారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతోపాటు గైడ్ లైన్స్ ను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్ పీఎస్సీ ద్వారా వేలాది పోస్టులను భర్తీ చేసిన సర్కార్ తాజాగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలనీ భావిస్తోంది. కీలకమైన విద్యాశాఖలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు.…
కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు.? కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక ఆయనకున్న లెక్కలు ఏంటి..? నిజంగానే గంప గోవర్ధన్ రిక్వెస్ట్ తోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారా..? లేక మరేదైనా కారణం ఉందా..? ఇప్పుడివే అంశాలపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనక రాజకీయ ప్రయోజనం ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. రానున్న ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ నిర్ణయం వెనక కూడా ఏదో వ్యూహం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని ఆరాటపడుతోన్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం లాంచానమే. ఈ ఎన్నికల నాటికీ కేటీఆర్ కు సీఎంగా అవకాశం ఇచ్చి.. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రీజైన్ చేయనున్నారు. కేసీఆర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ ఎన్నికను లోక్ సభ ఎన్నికలతోపాటే…
కేసీఆర్ రాజకీయాన్ని అంచనా వేయలేని కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు నిట్టూరుస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కొనసాగుతుందని మునుగోడు బైపోల్ టైంలో ప్రకటించిన కేసీఆర్ తాజాగా ఏకపక్షంగా ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చారు. దీనిని కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర అవమానంగా భావిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక కోసమే తమను కేసీఆర్ వాడుకొని వదిలేశారని… ఇప్పుడు తమను కనీసం పిలిచి కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ చేసిన మిత్ర మోసానికి వామపక్ష పార్టీలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ కు తామంటే ఏమిటో చూపించాలని కసి, కసిగా ఉన్నారు కమ్యూనిస్టులు. ఈమేరకు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికల వ్యూహంపై , బీఆర్ఎస్ ఇవ్వాల్సిన మాస్టర్ స్ట్రోక్ పై చర్చించాయి. కేసీఆర్ ను ఓడించి తీరాలనే టార్గెట్ గా తదుపరి రాజకీయ వ్యూహాలు ఉండాలని తలంపుతో ఉన్నాయి సీపీఐ అండ్ సీపీఎం. మునుగోడులో గట్టెక్కాలనే ఏకైక ఎజెండాతో కేసీఆర్ నాడు…
తెలంగాణలో వద్దు…ఏపీలో ఫుల్ పవర్స్ ఇస్తాం.. అక్కడ రాజకీయం చేయమని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. ఆమె మాత్రం ససేమీరా అంగీకరించలేదని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలు పెద్దగా చేపట్టని షర్మిల మళ్ళీ పార్టీ తరుఫున ఆందోళనలు చేపడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ విధించిన షరతులకు నిరాకరించే ఆమె మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారన్న వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ ఇస్తాం అక్కడ పని చేసుకోమని షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆమె మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తాను…ఏపీకి వెళ్ళనంటే వెళ్లనని పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకో ఏపీలో సోదరుడు జగన్ తో తలపడేందుకు ఆమె సాహసించడం లేదు. ఏమాత్రం పునాది లేని తెలంగాణలోనే తన రాజకీయ నిర్మాణం చేయాలనుకుంటున్నారు షర్మిల. ఆమె అంతలా పట్టు పట్టేందుకు కారణం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో చేరి పార్టీని చీల్చడం షర్మిల టాస్క్ అనే విశ్లేషణలు కూడా…