Author: Prashanth Pagilla

యాంకర్ అంటే ఒకప్పుడు ఆకట్టుకునే విధంగా మాట్లాడితే సరిపోతుంది అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆకట్టుకునేలా మాట్లాడటంతోపాటు గ్లామర్ గా కనిపించాల్సి ఉంటుంది. ఇలాగైతేనే తెరపై కనిపించే అవకాశం తడుతుంది లేదంటే నో ఛాన్స్. కొత్తగా తెరపై సందడి చేస్తోన్న యాంకర్లంతా గ్లామర్ ను నమ్ముకొని క్రేజ్ ను పొందిన వారే. బుల్లితెరపై సందడి చేస్తోన్న రష్మీ, అనసూయలు ఎలాగైతే గ్లామర్ డోస్ పెంచి క్రేజ్ ను పొందారో ఇప్పుడు అదే దారిలో వెళ్తుంది మరో యాంకర్ శ్రీముఖి. పటాస్ రియాలిటీ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం యాంకరింగ్ తోపాటు సినిమాల్లోనూ చేస్తోంది. కాని అవకాశాలు బాగా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లామర్ పాత్రలకు నేను రెడీ అంటూ హింట్ ఇచ్చేలా శ్రీముఖి రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటోలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. ఎద…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ క్షణాన కేంద్రంతో వైరం పెట్టుకున్నాడో ఏమో కాని టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర నివాసాలలో ఈడీ అధికారులు తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లను తీసుకెళ్ళారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, బంధుల ఇళ్ళు, వ్యాపార సంస్థలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. యాభై బృందాలు ఈ సోదాలు చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి కుబేరుడు. ఆయనకు ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజ్ లతోపాటు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అయితే, ఆయనపై భూకబ్జా అనేక ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంస్థలకు అనుమతులను ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి తెచ్చుకున్నాడని టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే ఫిర్యాదు చేశారు. తను అన్ని ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఎందుకు పట్టించుకోవడం లేదని రేవంత్ పలుమార్లు ప్రశ్నించారు. Also Read : నన్ను గవర్నర్ చేయండి సారూ..! షా…

Read More

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడంతా ఒకటే చర్చ. పవిత్ర , నరేష్ లు జంటగా ఓ లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వీరిద్దరూ ఇంతకుముందు పలు సినిమాల్లో కనిపించారు. భార్య భర్తలుగా, అన్న చెల్లెళ్ళుగా నటించారు. మొదటి సారి హీరో , హీరోయిన్ గా ఓ లవ్ స్టొరీ సినిమాలో నటించనున్నారని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కథ కూడా సిద్దమైందని, ఈ సినిమా కథను వీరిద్దరికీ వినిపించగా ఒకే కూడా చెప్పారని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నరేష్ , పవిత్రలు ప్రస్తుతం కలిసే ఉంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంతకుముందు వీరిద్దరూ ఓ హోటల్ లో సహజీవనం చేస్తూ నరేష్ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే.

Read More

సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సమంత- నాగ చైతన్య, ధనుష్- ఐశ్వర్య జంటలు విడిపోగా తాజాగా మరో జంట విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హీరో శ్రీకాంత్ తన భార్య ఊహకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండటంతో ఇక కలిసి ఉండటం అసాధ్యమని భావించి విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారని నెట్టింట పుకారు షికారు చేస్తోంది. Also Read : ఫ్యాన్స్ కు సుడిగాలి సుధీర్ గుడ్ న్యూస్..! ఆర్ధిక సమస్యలే వీరి మధ్య గొడవలకు కారణమని, చిన్న, చిన్నగా మొదలై ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో మనస్పర్ధలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడాకులకు సిద్దపడిందనే ప్రచారం నమ్మశక్యంగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఊహ – శ్రీకాంత్…

Read More

సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది. సీబీఐ దర్యాప్తుకు ప్రత్యేక జీవోలు జారీ చేసి దర్యాప్తుపై కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటంతో..ఆ అంక్షలేవి సీబీఐకి వర్తించకుండా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం ప్రకారం సీబీఐ పని చేస్తున్నందున్న ఈ చట్ట సవరణ చేసి… సీబీఐపై ఆంక్షలు విధించిన రాష్ట్రాలకు షాక్ ఇవ్వనుంది కేంద్రం. వచ్చే నెలలో మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. Also Read : తెలంగాణలోకి ప్రవేశించిన ఫ్యాక్షన్ పాలిటిక్స్..! సెంట్రల్ సర్కార్ పరిధిలోని దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందాలని కొన్ని రాష్ట్రాలు స్పెషల్ జీవోలు జారీ చేశాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, చత్తీస్ ఘడ్, మిజోరాం, మహారాష్ట్రల్లో దర్యాప్తు…

Read More

కరోనా పీడ విరగడైనట్టేనని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వేళ భారతదేశాన్ని మరో వైరస్ భయపెడుతోంది. తమిళనాడులో “మద్రాస్ ఐ” అనే వైరస్ విజృంభిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి తమిళనాడును తాజాగా షేక్ చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తమిళనాడును కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో మళ్ళీ కరోనా నాటి పరిస్థితులు పునరావృత్తం అవ్వనున్నాయా..? అని తమిళనాడు జనం ఆందోళన చెందుతున్నారు. కంటివాపు, కళ్ళు ఎర్రబారడం వంటివి ఈ వైరస్ లక్షణాలుగా వైద్యులు చెప్తున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారు ఐదు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వ్యాధి ప్రాణంతకం కాదు కాని వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.

Read More

పార్టీ సీనియర్లమంటూ చెప్పుకునే కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతుండటంతో ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లే అందరు అంటుండగా.. కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. పార్టీలో పనికిమాలిన చెత్త పేరుకుపోయిందని.. ఆ చెత్త తొలగిపోతే హర్షం వ్యక్తం చేయాలే కాని, చింతించకూడదంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అద్యక్ష బాధ్యతలను చేపట్టాక పార్టీకి ఊపు వచ్చింది. ఆ జోష్ ను కంటిన్యూ చేస్తోన్న సమయంలో అసూయ పుట్టిన సీనియర్లు రేవంత్ దూకుడును అడ్డగించేందుకు తెరవెనక అనేక ప్రయత్నాలు చేశారు. రేవంత్ ఎదో కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ప్రతిసారి సీనియర్లమంటూ రచ్చ చేయడం కొంతమంది నేతలకు అలవాటుగా మారింది. దీంతో సీనియర్ నేతల వైఖరి కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు. Also Read : బీజేపీకి బిగ్ షాక్ – టీఆర్ఎస్ లోకి ఈటల..? పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ తో చేతులు కలపాల్సిన…

Read More

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆయా పార్టీలకు చెందిన నేతలను కాంట్రాక్ట్ లతోపాటు పదవుల ఆశ చూపించి బీజేపీలో చేర్చుకుంటున్న కమలనాథులు.. తాజాగా కాషాయ క్యాంప్ లో చేరేందుకు సిద్దపడిన మర్రి శశిధర్ రెడ్డిని ఏ హామీ ఇచ్చి బుట్టలో వేసుకున్నారు..? అమిత్ షా ముందు శశిధర్ రెడ్డి ఉంచిన షరతులు ఏంటి..? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సనత్ నగర్ లో మర్రి శశిధర్ రెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ లేదు. అభిమానులు లేరు. సనత్ నగర్ నుంచి గతంలో గెలిచినా ఆయన పార్టీ వేవ్ లో గెలిచారు తప్ప సొంత ఇమేజ్ తో కాదన్నది బహిరంగ రహస్యమే. దీంతో ఆయనకు గవర్నర్ గిరిపై ఆశ కల్గింది. వెంటనే బీజేపీ తలుపు తట్టారు. తనకు గవర్నర్ గిరి ఇప్పించాలని షా ముందు ఓ ప్రతిపాదన ఉంచారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే, గవర్నర్…

Read More

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ప్రియురాలితో జీవితాంతం హ్యాపీగా ఉండాలని ఎన్నో కళలు కన్నాడు. కాని విధి వారిని విడదీసింది. ప్రియురాలిని అనారోగ్యం బలి తీసుకోవడంతో…ఆమె మృత దేహానికి తాళి కట్టి ఇకపై మరెవరిని పెళ్లి చేసుకోనని ప్రియుడు శపథం చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో ప్రాథనా బోరా మృతి చెందింది. విషయం తెలిసి తములి తట్టుకోలేకపోయాడు. విగత జీవిగా ప్రాథనా బోరాను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. జీవితాన్ని తనతోనే పంచుకోవాలని భావించిన బిటుపన్ తములి మృతి చెందిన తన ప్రియురాలి మృత దేహానికి తాళి కట్టాడు. అంతే కాదు…తాను బతికినంత కాలం ప్రాథనా బోరా పంచిన ప్రేమతో బతుకుతాను అంటూ..జీవితంలో ఇక ఎవర్ని పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. తములి ప్రేమతో కూడిన ఆవేదనను చూసిన వారంతా ఒక్కసారిగా విలపించారు. స్వచ్ఛమైన ప్రేమకు…

Read More

తుమ్మల నాగేశ్వరరావును టీఆరెఎస్ లో ఒంటరి చేస్తున్నారు. పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు. పార్టీ నేతలే తుమ్మల నాగేశ్వరరావును అవమానిస్తున్నారు. ఆయన హాజరయ్యే సభలకు తాము రామని బహిరంగంగా చెప్పేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇంతా జరుగుతున్నా టీఆరెఎస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. పిలిచి నేతల మధ్య సమన్వయం కుదర్చడం లేదు. వరంగల్ జిల్లాకు చెందిన రవి చంద్ర, పార్థ సారథి లకు టీఆరెఎస్ అధిష్టానం రాజ్యసభ పదవులను కట్టబెట్టింది. తమకు లభించిన పదవుల కారణంగా సన్మాన సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభకు హాజరు కావాలంటూ జిల్లా నేతలకు, ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. తుమ్మలకు మాత్రం ఆహ్వానం పంపలేదు.దీంతో పార్టీలో తనను అంటరాని వాడ్నిగా ట్రీట్ చేస్తున్నారని ఆయన ఫీల్ అవుతున్నారు. పార్టీ వీడుతున్నాననే తనను దూరం పెడుతున్నారుని అంచనా వేసి…ఇటీవల సమావేశం నిర్వహించి పార్టీ మార్పు వార్తలకు తుమ్మల నాగేశ్వరరావు తెరదించారు. టీఆరెఎస్ ను…

Read More