Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి చేదు అనుభవం ఎదురైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైనే ఆదికి గుండు కొట్టేశారు. ఎందుకు ఆదికి గుండు కొట్టేశారని అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయంపై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లోకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా ఎదిగాడు. సుధీర్ స్కిట్ కోసం ఎగబడి చూసిన జనాలు అంతే ఇంట్రెస్ట్ తో ఆది స్కిట్ లో అతను వేసే పంచ్ ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక, జబర్దస్త్ లోనే కాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లోనూ ఆది లీడ్ రోల్ పోషిస్తున్నారు. Also Read : రెండో పెళ్లికి మీనా గ్రీన్ సిగ్నల్ – వరుడు అతనే శ్రీదేవి డ్రామా కంపెనీలో…
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనను అవమానించారని చర్లపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టారు. తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తనకు సమాచారం అందించడం లేదని చెప్పుకొచ్చారు. ఒకే పార్టీకి చెందిన కార్పొరేటర్ , ఎమ్మెల్యే మధ్య వైరం తారాస్థాయికి చేరడంతో ఇష్యూ మరింత పెద్దదైంది. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్నారు బొంతు శ్రీదేవి భర్త, మాజీ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా వర్గాన్ని కూడా తయారు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ కే చెందిన బేతి సుభాష్ రెడ్డి కొనసాగుతున్నా బొంతు రామ్మోహన్ మాత్రం పండగలు, ఎవైనా కార్యక్రమాలు ఉంటె తనప్లెక్సీలు నియోజకవర్గం అంతటా వేసుకొని హడావిడి చేస్తున్నారు. ఆయన హంగు ఆర్భాటం బేతి సుభాష్ రెడ్డికి ఏమాత్రం…
ఎంతమంది కొత్త యాంకర్లు తెరపైకి వస్తున్నా సీనియర్ యాంకర్ సుమ క్రేజ్ అస్సలు మాత్రం తగ్గడం లేదు. స్పాంటేనియస్ పంచ్ లతో అలరించే సుమ తన యాంకరింగ్ ఎవరికీ బోర్ కొట్టకుండా విజిల్స్ వేసేలా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా సుమ యాంకర్ గా చేస్తోన్న షో క్యాష్. ఈ షో కు సంబంధించిన ప్రోమో ను తాజాగా విడుదల చేశారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో హరితేజ, హేమ, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ లు పాల్గొని సందడి చేశారు. వారి మాటలతో, సుమ పంచ్ లతో ప్రోమో హైలెట్ గా మారింది. ప్రోమో చివర్లో సుమ ఓ స్కిట్ చేసింది. ఇందులో సుమ కాలేజ్అమ్మాయిగా కనిపించగా.. అంతలో ఓ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగా, నువ్వు మా అబ్బాయి క్లాస్ మెట్ కదా అంటూ ఆ కుర్రాడికి కౌంటర్లు వేస్తూ నవ్వులు పూయించింది సుమ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగానున్న తుషార్ వెల్లపల్లి సీబీఐ విచారణ కోసం పట్టుబడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ సిట్ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే ఈ కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. తనకు సిట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పినా లుక్ అవుట్ నోటిసులు ఇచ్చారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేతలకు సైతం ప్రమేయం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సిట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటిసులు ఇచ్చింది. ఈ నోటిసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మరికొంతమంది బీజేపీ నేతలకు సిట్ నోటిసులు ఇచ్చేందుకు రెడీ అవుతుందన్న లీకులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన…
శృతి హసన్ స్టైలే డిఫరెంట్. సాధారణంగా హీరోయిన్స్స్ అందరూ మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అస్సలు ఇష్టపడరు కాని, ఇందుకు శృతి హసన్ మాత్రం మినహాయింపు. మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సైతం సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. హీరోయిన్స్ మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నెటిజన్ల నుంచే విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, సినీ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని భయపడుతుంటారు. అయితే , ఇలాంటి భయలేవి తనకు లేవంటూ శృతి హసన్ మేకప్ లేకుండా దిగిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుండగా .. తాజాగా మారోసారి అలాంటి పనే చేసింది. తాజా ఫోటోలకు శృతిహసన్ సరికొత్త క్యాప్షన్ ఇచ్చింది. తాను ఫీవర్ , సైనస్ తో బాధపడుతున్నానని , ఋతుస్రావంలో ఉన్నానని పేర్కొంది. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో తన సెల్ఫీలు…
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సీనియర్ నటి మీనా రెండో పెళ్లికి రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో మీనాకు మరో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఇందుకోసం మీనాపై ఒత్తిడి తెచ్చారట. కుటుంబ సభ్యులు మీనా వద్ద రెండో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సెకండ్ మ్యారేజ్ కు మొదట ససేమీరా అందట. తను విద్యాసాగర్ ను మరిచిలేకపోతున్నానని చెప్పిందట. అయితే, నీకు రెండో పెళ్లి అవసరం లేకపోవచ్చును కాని, నీ కూతురికి తండ్రి అవసరముందంటూ మీనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కూతూరి భవిష్యత్ కోసం ఆలోచించమని మీనాను కుటుంబ సభ్యులు కోరగా ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకునేందుకు ఆలోచించి ఒకే చెప్పారని వార్తలు గుప్పుమంటున్నాయి. 2009లో విద్యా సాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను మీనా వివాహం చేసుకున్నారు. వీరికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఈజీగా అంతుచిక్కవు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం, అంచనా వేయడం కష్టం. ముందస్తు ఎన్నికల్లుండవని కేసీఆర్ పదేపదే చెబుతున్నా.. ఎందుకోఆయన ప్రకటనలు ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. అందుకు కారణం ఎన్నడు లేనంతగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ ఆదేశిస్తుండటమే. అభివృద్ధిలో దూకుడు డబుల్ బెడ్ రూమ్, సొంత జాగాలున్న వారికీ 3 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల్లో వేగిరంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారడంతో మార్చినాటికీ రోడ్లను అద్దంలా మార్చాలని ఆదేశిస్తున్నారు. సచివాలయ నిర్మాణ పనులు కూడా సంక్రాంతికి ఫినిష్ చేయాలని అధికారులకు గడువు విధించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఉద్యోగాల భర్తీ వేగవంతం మార్చిలో జరిగిన అసెంబ్లీలో ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేసీఆర్ ప్రకటించారు.…
కొన్నాళ్ళపాటు బుల్లితెరపై మహారాణిలా సందడి చేసింది యాంకర్ శ్రీముఖి. తనదైన యాంకరింగ్ తో అభిమానులను అలరించింది. పంచ్ లు, ఏకధాటిగా మాట్లాడేగలిగే శ్రీముఖిని యాంకర్ గా బుల్లితెరను శాసించేలా చేసింది. కామెడి షో లలో యాంకరింగ్ చేస్తూనే అడపాదడప సినిమాలోనూ నటించేది. యాంకర్లలో సుమ తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది శ్రీముఖి. తన ఎనర్జీ.. స్పాంటేనియస్ పంచ్ లు, చలాకీగా మాట్లాడటం.. క్యూట్ , క్యూట్ మాట్లాడుతూ ఎంతటి వారినైనా అట్రాక్ట్ చేయడం శ్రీముఖికే సొంతం. అయితే, మూడు పదుల వయస్సులోకి వచ్చినా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని చర్చ జరుగుతోంది. ఇందుకు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీముఖి కాలేజ్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించిందట. అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిందట. అతని ప్రేమని నిజమని నమ్మి సరదాగా మెలిగిందట. ఆ తరువాత అతని నిజ స్వరూపం తెలియడంతో శ్రీముఖి అతని దూరం పెట్టిందట. శ్రీముఖి…
తెలంగాణ కాంగ్రెస్ ను ఎవరో వెనక్కి లాగాల్సిన పని లేదు. ఆ పార్టీ సీనియర్లే ప్రత్యర్ధి పార్టీలకు సహాయపడుతు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసికట్టుగా మార్చుతున్నారు. టి. కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు రాగానే పోటీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర పల్లవి అందుకున్నారు. భట్టి పాదయాత్ర రాగాల వెనక ఎవరో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ను ముందుంచి సీనియర్లు రేవంత్ పాదయాత్రకు అడ్డుపుల్లలు వేసేందుకు భట్టి పాదయాత్రను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అధిష్టానం రేవంత్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా..? లేదా అందరితో కలిసి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా అనే దానిపై సమాలోచనలు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను డీకొట్టాలంటే అంతటి వాక్చుతుర్యం, ఆ తేజస్సు, బలమైన వ్యూహాలను అమలు చేయగల నేర్పు కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడికే ఉంది. ఈ క్వాలిటీస్ కల్గిన రేవంత్ రెడ్డికి ప్రతిసారి సీనియర్లు పక్కలో…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా గాయకుడు గద్దర్. నియంతలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన రాజకీయ హామీలను విస్మరించారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ కేసీఆర్ అని విమర్శించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గద్దర్ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తోన్న కేసీఆర్.. అసలెందుకు రాజ్యాంగాన్ని మార్చాలో చెప్పాలన్నారు. పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ తన పార్టీ జాతీయ ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుడు ఎవరైనా ఆర్థిక పరమైన హామీలు ఇస్తారు కాని కేసీఆర్ మాత్రం ఉద్యమ సమయంలో రాజకీయపరమైన హామీలను ఇచ్చారని చెప్పారు గద్దర్. దళితుడ్ని సీఎం చేస్తానని తెలంగాణ దళిత సమాజాన్ని మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు ఇస్తానని ప్రామిస్ చేసిన మూడెకరాల భూమి ఇవ్వకుండా దళిత బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్…