Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. అయితే అందంలోనే కాదు వివాదాల్లోనూ అప్పుడప్పుడు తలదూర్చుతూ ఉంటుంది ఈ భామ. లైగర్ సినిమా విడుదల సమయంలో అంటీ అన్న పదాన్ని వివాదంగా మలిచి పోలీసు స్టేషన్ కు లాగింది. ఇటీవలే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిన అనసూయ వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈవెంట్స్ లలో కూడా యాంకర్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఇన్ స్టా లో అనసూయ పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహితురాళ్లతో కలిసి అనసూయ ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ మద్యం గ్లాస్ ను చేతిలో పట్టుకొని నవ్వుతున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.…
క్యారెక్టర్ నచ్చాలే కాని ఎలాంటి పాత్రలోనైనా ఓదిగిపోవడం మంచు లక్ష్మి ప్రత్యేకత. ఇప్పుడు అలాంటి పాత్రే ఒకటి ఆమె చేసింది. అది తెలుగు సినిమా కాదు కనుక ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు కాని, తెలుగు సినిమానే అయ్యుంటే మంచు లక్ష్మి రోల్ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళే. మంచు లక్ష్మి అనగానే మోహన్ బాబు కూతురని గుర్తుపట్టేస్తారు. “అనగనగా ఓ ధీరుడు” తొలి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అదే సినిమా అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత పలు సినిమాల్లో మంచు లక్ష్మి కనిపించినా పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు ఏవి లేవు. తాజాగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’మూవీలో పనిమనిషి క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రలో మంచు లక్ష్మి నటించడం అనేదానికంటే ఆ క్యారెక్టర్ లో జీవించిందని చెప్పొచ్చు. తెలుగులో హీరోయిన్, విలన్ రోల్స్ చేసిన…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నర్సంపేట సంఘటనపై మోడీ వాకబు చేశారని వైఎస్సార్ టీపీ శ్రేణులు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ వార్తను బీజేపీ వర్గాలు ఖండిస్తున్నాయి. మోడీ నేరుగా షర్మిలకు ఫోన్ చేసే అవకాశం లేదని అంటున్నాయి. అదే సమయంలో మోడీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టమే కాబట్టి షర్మిలకు ఫోన్ చేసి ఉండొచ్చునన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం మధ్య చర్చ సందర్భంగా షర్మిలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని జగన్ ను మోడీ ప్రశ్నించారనే ప్రచారం జరిగింది. ఓ కీలక సమావేశంలో షర్మిల ఇష్యూను వీరిద్దరూ చర్చించే అవకాశం లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. అయితే, కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకుగాను షర్మిలకు ప్రధాని ఫోన్ చేసి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదేసమయంలో…
హైదరాబాద్ లోని ఆసుపత్రుల కంటే కూడా నెక్కొండ మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రీ బాగా ఫేమస్. అయితే ఇదేదో అత్యుత్తమ వైద్యం అందించడంలో అనుకునేరు. లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అని తేలితే భ్రుణ హత్యలు చేయడంతోపాటు గర్భం దాల్చిన అవివాహితులకు అబార్షన్ చేయడంలో ఆ ఆసుపత్రి ఫేమస్ అయింది. ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెక్కొండ గ్రామ పంచాయితీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఈ కొత్త బిజినెస్ ప్రారంభించింది. మొదటి సంతానంగా ఆడపిల్ల కల్గిన వివాహితులు, గర్భం దాల్చిన యువతులను ఆసుపత్రి యాజమాన్యం టార్గెట్ చేయడం అలవాటుగా మార్చుకుంది. లింగనిర్ధారణతోపాటు, అబార్షన్స్ కోసం ఆసుపత్రికొచ్చే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అడిగినంత సొమ్ము దండుకోవచ్చునని నిబంధనలను బ్రేక్ చేసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ పిల్ల అని తెలియగానే భ్రుణహత్యలు చేస్తూ పసిపిండాలను…
కాస్టింగ్ కౌచ్ పై మహానటి ఫేమ్ కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెయిట్ చేసే హీరోయిన్స్ కు వేధింపులు నిజమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, ఒకవేళ వేధింపులు ఎదురైతే ఇండస్ట్రీని వదిలేసి ఎంచక్కా జాబ్ చేసుకుంటానని స్పష్టం చేసారు కీర్తి సురేష్. అంతేకాని సినిమాలో అవకాశాల కోసమని కమిట్మెంట్ ఇవ్వనని తేల్చి చెప్పారు. తనతోపాటు నటించిన కొంతమంది హీరోయిన్స్ , ఇతర నటులు ఎదుర్కొన్న వేధింపులను తనతో పంచుకున్నారని కీర్తి సురేష్ వివరించారు. మన ప్రవర్తనను బట్టి మనల్ని జడ్జ్ చేస్తుంటారని అందుకే బిహేవియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనం ఉండే విధానం బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే తనను ఎవరూ అలా అడగలేదని వివరించారు. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మెగాస్టార్…
హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ బుల్లితెర యాంకర్ గా సెటిల్ అయింది. హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ఈ బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. సినిమాలో ఛాన్స్ రావాలంటే అందాలను అరబోయాలనే అంటుంటారు. అందుకేనేమో రష్మీ మరోసారి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఈ బుల్లితెర యాంకర్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రను దూరం చేస్తోంది. ఎప్పుడు లేని విధంగా రష్మీ అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలను షేర్ చేయడం వెనక బలమైన కారణం ఉందట. హీరోయిన్ అవకాశాల కోసమే ఈ అందాల ఆరబోత ప్రోగ్రాం అని కొందరు.. పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయని దాంతో కొన్నాళ్ళు ఆమె తీరిక లేకుండా గడపాల్సి వస్తుందని అందుకే రిలాక్స్…
పశ్చిమ బెంగాల్ లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్దం అవుతోంది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారిని మమతా బెనర్జీపై బరిలో నిలిపినట్లుగానే.. తెలంగాణలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటలను కేసీఆర్ పై పోటీలో నిలపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈటలకు హైకమాండ్ బ్లూ ప్రింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ పై పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేసినా ఆలేరు నుంచి బరిలో నిలిచినా అక్కడే నుంచే పోటీలో ఉంటానని ఈటల చెప్పారు.కేసీఆర్ ను డీకొట్టాలంటే అందుకు సరైన ప్రత్యర్ధి ఈటలనేనని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈమేరకు ఈటలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన ఆయన కొన్నిరోజులు అక్కడే మకాం వేసి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలపై చర్చ జరిగినట్లు…
జబర్దస్త్ కామెడి షో లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ మాటలతోనే మెస్మరైజ్ చేయడం కాదు గ్లామర్ ను కూడా ప్రదర్శించింది. అందుకే రష్మీకి తొందరగా ఇండస్ట్రీ వర్గాల్లో గుర్తింపు లభించింది. అలాగే, సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ సెట్ చేయడం కూడా రష్మీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. బోల్డ్ గా నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయని రష్మీకి వెండితెర నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. రష్మీ రెండు, మూడు సినిమాల్లో నటించగా.. హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. గుంటూర్ టాకీస్ మూవీలో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోసినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఆ సినిమా. సినిమాలో సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై బలమైన ముద్ర వేస్తోంది రష్మీ. జబర్దస్ట్ తోపాటు ఇతర షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల జబర్దస్త్ కు రష్మీ గుడ్ బై చెప్పిందని వార్తలు వచ్చాయి కాని జబర్దస్త్ ను వీడేది…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాలి మాటలు అసలే మాట్లాడరు. ఆయనకు పక్కాగా సమాచారం ఉంటేనే నోరు మెదుపుతారు. అలాంటిది తాజాగా రేవంత్ చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసినట్లుగా భావిస్తున్నారు. సోమవారం రైతు సమస్యలపై వికారాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రైతుల పట్ల కేసీఆర్ అవలంభిస్తోన్న వ్యతిరేక విధానాలను తూర్పారబడుతు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని అందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలంటూ రేవంత్ పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నా, ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం వేగం పెంచడం చూస్తుంటే ముందస్తుకు తధాస్తు అని కేసీఆరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు. పరిస్థితులను అంచనా వేసి రేవంత్ ముందస్తుపై ప్రకటన చేశాడో లేక ఎక్కడి నుంచైనా సమాచారం వచ్చిందో తెలియదు…