Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఆర్జీవీ – అషూరెడ్డిలు ఒకే దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది..? సె* సంబంధించిన వాటి గురించే ఎక్కువగా డిస్కషన్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అదే జరిగింది. ఆర్జీవీ దర్శకత్వంలో ” డేంజరస్ మా ఇష్టం” అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఇక, ఈ మూవీ ప్రమోషన్ కోసం బోల్డ్ బ్యూటీతో ఆర్జీవీ చేసిన ప్రమోషన్ వీడియో ఒకటి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇందులో ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ రచ్చ రచ్చ చేశారు. నోటికి ఎంతోస్తే అంతగా వాగుతూ గబ్బు, గబ్బు చేసేశారు. సినిమా ప్రమోషన్ కోసమని చేసిన ఇంటర్వ్యూ కాస్త సె*పై అవగహన కోసం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ క్లాస్ గా మారిపోయింది. సినిమా విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అషు తొడల గురించి ప్రశంసించడం కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినట్లు అనిపించింది. ఆమె కుర్చీలో కూర్చోగా.. అషు పాదదాసిగా…
టీఆర్ఎస్ కథ ఓడిసింది. ఆ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక నుంచి టీఆర్ఎస్ ఉనికిలో ఉండదు. బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం తాజాగా ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది. కేసీఆర్ ఈ లేఖను ఆమోదిస్తూ సంతకం చేసి ఎన్నికల సంఘానికి పంపితే టీఆర్ఎస్ అంతర్ధానం అయినట్లే. బంగారు తెలంగాణ ఎలాగైతే చేసానో , దేశాన్ని బంగారు భారత్ చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. అందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చుతున్నామని తెలిపారు. తెలంగాణ అనే పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మెరుగైన ఫలితాలు రావన్ని తనకు అధికారం తెచ్చిపెట్టిన పదాన్ని కేసీఆర్ వదిలేశారు. మరి ఈ నిర్ణయం ఏరకమైన ఫలితం ఇస్తుందో కాలమే సమాధానం చెప్పనుంది. బీఆర్ఎస్ కు అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇది మిగిలింది కేసీఆర్ జాతీయ స్థాయికి వెళ్ళడమే. పార్టీ పేరు…
సింగర్ గా గుర్తింపు పొందిన సునీత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసేందుకు సిద్దమయ్యారంటూ ఫిలింవర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాటలతో ఇంతకాలం అలరించిన ఆమె సినీ అరంగేట్రం చేయనుందంటున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో సునీత నటించనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి SSMB 28అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు అక్క పాత్ర కోసం చిత్ర యూనిట్ వెతుకులాటలో ఉండగా..సింగర్ సునీత పేరును మహేష్ బాబు సజెస్ట్ చేశారని టాక్. అందుకు డైరక్టర్ త్రివిక్రమ్ కూడా అంగీకరించారని అంటున్నారు. ఇందుకోసమే సునీతను త్రివిక్రమ్ కలిశారని.. సినిమాలో…
గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో రాష్ట్రంలో విజయం సాధించాయి. అయితే, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురుంచే. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో 40 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. గుజరాత్ లో మాత్రం కాంగ్రెస్ దారుణ పరాభవం ఎదురుచూసింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను ఆప్ చాలా వరకు దెబ్బతీసింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు 27శాతం , ఆప్ కు 13శాతం ఓట్లు పడ్డాయి. ఆప్ ఖాతాలో పడిన 13శాతం ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకే. ఇదే గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభావం చూపకపోవడానికి కారణమైంది. 53శాతం ఓటు బ్యాంక్ తో బీజేపీ గుజరాత్ లో సంపూర్ణ ఆధిక్యాన్ని కైవసం చేసుకొని ఏడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.…
వైఎస్ షర్మిల అరెస్ట్ పై ఆమెకు రాజకీయాలకతీతంగా సంఘీభావం వ్యక్తం అయింది. ఏకంగా ప్రధాని మోడీ వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు కాని, సొంత అన్నయ్య, ఏపీ సీఎం జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై షర్మిల స్పందిస్తూ తనకు మద్దతు తెలిపిన వాళ్ళకు కృతజ్ఞతలు, చెప్పని వాళ్ళకు డబుల్ కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది జగన్ నుద్దేశించేనని చెప్పాల్సిన పనిలేదు. చెల్లిని అవమానకరంగా అరెస్ట్ చేస్తే జగన్ ఎందుకు నోరు విప్పలేదన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. జగన్ ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా నోరు ఎత్తితే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. జైలు గోడలు ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఉన్న కేసులతో జగన్ లో భయం మిణుకు మిణుకుమంటుంది. అందుకే ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా నిలదీయడం లేదు. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత…
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అటో డ్రైవర్ రమేష్ ఆత్మహత్యతో తేలిపోయిందని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు కావాలంటే అధికార పార్టీ నేతలు అడిగినంత ఇచ్చుకోలేక లబ్దిదారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. సిద్ధిపేట కౌన్సిలర్ ప్రవీణ్ కు లక్ష రూపాయలు మూటజెప్పినా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోగా వేధింపులు ఎక్కువవ్వడంతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా, మంత్రి హరీష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్ధిపేటలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే, రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీలో ఎలాంటి అవకతకలు జరుగుతున్నాయో చెప్పనవసరం లేదన్నారు. రమేష్ మృతిపై ఇంతవరకు కేసీఆర్ ,హరీష్ రావులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా కౌన్సిలర్ అడ్డుకున్నారంటే ఆయన ఎవరి ఆదేశాలతో కలెక్టర్ పై…
తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తమన్నా. తెలుగులోనైతే ఆమె కాల్ షీట్స్ కోసం స్టార్ డైరక్టర్స్ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇక, తమన్నాతోపాటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారంతా పెళ్లి చేసుకున్నారు. కాజల్ , హన్సికలు పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేశారు. తమన్నా మాత్రం ఒంటరిగానే ఉంటోంది. మిల్క్ బ్యూటీ పెళ్లి ఖాయమైందని త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని ప్రచారం జరిగింది. ఓ బిజినెస్ మెన్ తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని వార్తలొచ్చాయి. దీంతో తన పెళ్లి వార్తలపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. నన్ను అభిమానించే అభిమానులకు నా పెళ్లి విషయం తప్పక చెప్తాను. రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. నేను చేసుకోబోయేవాడెవరో అందరికీ తెలియజేస్తా అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనైతే లేదు. పెళ్లి చేసుకోమని ఇంట్లో నుంచి ఒత్తిళ్ళు…
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఓ మూవీ ద్వారా హీరోయిన్ అప్సరరాణి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. డేంజరస్, క్రాక్ సినిమాలోనూ ఐటెం సాంగ్స్ తో ఆదరగొట్టేసింది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అందాలను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆర్జీవీ తెరకెక్కించిన లెస్బియన్ మూవీలో అపర్స రాణి బోల్డ్ గా నటించింది. ఈ సమయంలోనే ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్సర రాణి మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కన్నడ ఇండస్ట్రీలో మొదటిసారి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ డైరక్టర్ ఛాన్స్ ఇస్తానని కబురు పెట్టాడని చెప్పింది. సినిమా విషయాలపై చర్చించేందుకు ఆ డైరక్టర్ గదికి రమ్మని పిలిచారు. అయితే , నేను మా నాన్నను వెంటతీసుకెళ్ళాను. మా నాన్నను బయట నిలిపివేయడంతో.. నేను ఒంటరిగా గదిలోకి వెళ్ళాను. అప్పుడు…
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టీపీసీసీ చీఫ్ ను ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ పెద్దల విధానాలపై పోరాడేందుకు రేవంత్ ను అనుసరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని గతంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ విసరగా తాజాగా అదే సవాల్ ను బండి సంజయ్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కౌంటర్ గా బండి సంజయ్ డ్రగ్స్ కేసును ఎత్తుకున్నారు. ఏడాదికిందటి బెంగళూర్ డ్రగ్స్ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ తారల ప్రమేయముందని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ తప్పదని అంత అనుకున్నారు. కాని తరువాత రాజకీయ జోక్యంతో ఆ కేసు చప్పున చల్లారిపోయింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. టెస్టులకు రావాలని ఒత్తిడి చేశారు. దాంతో ఆరోపణలు చేయకుండా కోర్టుకు వెళ్లి కేటీఆర్ స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో…
దుబారా ఖర్చులకు పెట్టింది పేరు తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టని సాగునీటి నిపుణులు చెబుతున్నా, వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా లక్ష కోట్లకు పైగా కాళేశ్వరంకు తగలేసింది. భారీగా ప్రజా ధనాన్ని వెచ్చించి రెండు టీఎంసీలతో కాళేశ్వరం ఫస్ట్ ఫేజ్ ను నిర్మించగా.. ఇప్పుడు మరో టీఎంసీకి అనుమతి ఇవ్వడంటూ కేంద్రాన్నికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు పంపింది. 36 లక్షల ఎకరాలకు సాగునీరని (18 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్థిరీకరణ) కట్టినా.. ఈ ప్రాజెక్టు నుండి మూడు లక్షల ఎకరాలకు కూడా సాగునీరు పారే అవకాశం లేదు. ఒక్క ఏకరాకు, ఒక పంటకు ఏటా అయ్యే ఖర్చు కనీసం లక్షన్నర రూపాయల నుండి రెండున్నర లక్షల రూపాయలు. ఒక్క ఎకరా పారకున్నా, ఏటా 13,500 కోట్ల రూపాయలు అసలు, వడ్డీ రూపంలో బ్యాంకులకు కట్టాలి. ఈ ఖర్చులన్నీ ప్రజలనుండి ఏదో రూపంలో పిండాల్సిందే. అదనంగా రిపేర్లకు,…