Author: Prashanth Pagilla

రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం ద్వారా కేంద్రం వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం డిసెంబర్ మొదటివారంలో వారంరోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. నవంబర్ లో ఇందుకు సంబంధించిన ప్రకటనను సీఎంవో చేసింది. కాని అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సర్కార్ నుంచి ఇంతవరకు క్లారిటీ లేదు. కేంద్రం వల్ల తెలంగాణకు 40వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని.. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరితో తెలంగాణ ప్రగతి క్షిణిస్తోందని , దీనిపై చర్చించాలని డిసెంబర్ నెలలో వారం రోజులపాటు ఉభయ సభలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే, ఈ మధ్యలోనే బీఆర్ఎస్ ఆవిర్భావం, కవితకు సీబీఐ నోటిసులు రావడంతో కేసీఆర్ బిజీ అయిపోయారు. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కసరత్తు అలాగే నిలిచిపోయింది. క్రిస్మస్ పండగ సమీపిస్తుండటంతో ఈ నెలలో అసలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా..? లేదా అన్న మీమాంస కూడా నెలకొంది.…

Read More

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు సీనియర్లు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ పీసీసీ పదవిని ఊడపీకితేగాని సీనియర్ల మనస్సు చల్లారేలా లేదు. అందుకోసం సీనియర్ నేతలు జట్టుగా ఏర్పడ్డారు. వీరికి దామోదర రాజనర్సింహ నాయకత్వం వహిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనక మరో సీనియర్ నేత ఉన్నట్టు అనుమానం వ్యక్తం అవుతోంది. టీపీసీసీ జంబో కమిటీ నియామకంపై అసంతృప్తిని సీనియర్లు మొదట బాహాటంగా వెళ్ళగక్కలేదు. రేవంత్ తో కూర్చొని మాట్లాదామనే ధోరణిలో కనిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో భేటీ అయిన మరుసటి రోజే, సీనియర్లు పార్టీ ధిక్కారణ చర్యలకు పాల్పడటం ఆసక్తికరంగా మారింది. మోడీతో వెంకట్ రెడ్డి ఏం చర్చించారో క్లారిటీ లేదు కాని, ఎన్నికలు నెల రోజులు ఉన్నాయనంగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెబుతానని ఆయన ప్రకటించారు. ఆ తరువాత సీనియర్లు భట్టి నివాసంలో సమావేశమై రేవంత్ టార్గెట్ గా విమర్శలు…

Read More

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ చేస్తోన్న సీనియర్లు పార్టీ మారేందుకు దారి వెతుక్కుంటున్నట్లు అర్థం అవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించి పార్టీ మారుతారా అనే విమర్శలకు రేవంత్ ను బూచిగా చూపి గోడ దూకేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగమే సీనియర్ల పార్టీ ధిక్కార ప్రకటనలు. పార్టీ అంటే ప్రాణమని చెబుతూనే ఎన్నికల్లోపు కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయాలనేది సీనియర్ల ప్లాన్. ఆ తరువాతే కాంగ్రెస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నూతన కమిటీలో నియామకమైన వారు 50శాతానికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వాస్తవానికి టీపీసీసీ జంబో కమిటీలో పదవులు పొందిన 196మందిలో జస్ట్ 12మంది మాత్రమే వలస నేతలు. మిగిలిన వారంతా మొదటి నుంచి కాంగ్రెస్ లోనున్న వారే. పైగా ఆ 12 మంది కూడా పార్టీ పటిష్టత కోసం…

Read More

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తొండి వాదన ప్రారంభించారు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ నూతన కమిటీల్లోని 108 మందిలో 58 మంది టీడీపీ వాళ్లే ఉన్నారని అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు  కాంగ్రెస్ లో చేరిన వలస నేతలకే పెద్దపీట వేశారంటూ గోలగోల చేస్తున్నారు. నిజంగా , రేవంత్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే నూతన కమిటీలో ఛాన్స్ ఇచ్చారా..? అసలు నిజాలెంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మొత్తం రిలీజ్ అయిన కమిటీలు 5 1.పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఈ జాబితాలో ఏఐసీసీ ప్రకటించిన 18 మంది మరియు నలుగులు వర్కింగ్ ప్రెసడెంట్ లు కలిపి 22 మంది అందరూ సీనియర్లు ఉన్నారు.  AICC General Secretary & Telangana Incharge Manikkam Togore అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి పేరు తప్ప రేవంత్ రెడ్డి మనుషులు అని ఎవ్వరూ లేరు. So 100% Congress…

Read More

తెలంగాణ ఉద్యమ నినాదం..నీళ్లు, నిధులు, నియామకాలు ప్రాతిపదికన కొనసాగిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించారని కేసీఆర్ నుద్దేశించి ప్రస్తావిస్తూ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా అన్నీ మర్చిపోయి వారి నోట్లో మట్టి కొట్టారన్నారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రాసిన లేఖ యధావిధిగా టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో తీవ్ర నిరాశ మిగిల్చారని విమర్శించారు. పోలీస్ విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం గత ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానాన్ని చూస్తే చాలు కొలువుల భర్తీలో మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోంది.ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ రెండూ ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది.…

Read More

ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మారేలా లేరు. టీపీసీసీ అద్యక్షుడిగా రేవంత్ ఏం నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడమే సీనియర్ల పని అయిపొయింది. అధిష్టానం దగ్గర రేవంత్ పరపతి పెరుగుతుందని టీపీసీసీ జంబో కమిటీ తేల్చడంతో అసంతృప్త రాగాలను ఆలస్యం లేకుండా వినిపించేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెబుతూనే తెరవెనక సీనియర్ నేతలు కత్తులు నూరుతున్నారు. రేవంత్ పై నిత్య అసంతృప్తి రాగాలను వినిపించే నేతలంతా మరోసారి భేటీ అయ్యారు. ఇందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసం వేదికైంది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి,ఏలేటి మహేశ్వర్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రేమ్ సాగర్ రావులు సమావేశమయ్యారు. కొత్తగా ప్రకటించిన టీసీసీ కమిటీలో తమ వర్గానికి చెందిన నాయకులకు చోటు దక్కలేదన్నది సీనియర్ నేతల అసంతృప్తి. టీడీపీ నుంచి వచ్చిన వారికే నూతన కమిటీలో చోటు కల్పించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…

Read More

నమ్రత శిరోద్కర్.. మహేష్ బాబు భార్య. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వచ్చిన వంశీ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటించింది నమ్రత. ఈ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరికి గౌతమ్, సితార ఇద్దరు సంతానం. ఒకప్పుడు మిస్ ఇండియా కిరీటం అందుకున్న నమ్రత, పెళ్లి తరువాత పూర్తిగా మోడలింగ్ కు దూరమైంది. ప్రస్తుత కుటుంబ వ్యవహారాలను చూసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత.. మీడియాకు మాత్రం కొంచెం దూరంగానే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానెల్ కు నమ్రత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో నమ్రత మాట్లాడుతూ.. మహేష్ తో ప్రేమ పెళ్లి, కెరీర్, పిల్లల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూ అలా ఆసక్తికరంగా సాగుతుండగానే నమ్రతతో మీకు, మహేష్ బాబుకు ఎప్పుడైనా గొడవలు అయ్యాయా..?…

Read More

దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలుండటంతో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చాయి. కాని తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయి. అయితే, తెలంగాణలో కనిపిస్తోన్న పరిస్థితులే హిమాచల్ ప్రదేశ్ లో ఎదుర్కొన్న కాంగ్రెస్ అక్కడ ఊహించని విజయం అందుకుంది. దాంతో తెలంగాణలోనూ గట్టిగా ఫోకస్ చేస్తే అధికారంలోకి రావడం అసాధ్యమేమీ కాదని అధిష్టానంకు అర్థమైంది. హిమాచల్ ప్రదేశ్ లో ఎలాంటి వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరించిందో తెలంగాణలోనూ అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసాక.. ప్రియాంక గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిమాచల్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు…

Read More

ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. అభివృద్ధి పనుల మీదే మోడీతో భేటీ అయినట్లు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కాని ఇద్దరు రాజకీయ నేతల మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాకుండా ఉంటాయా..? అసలు ఆ చాన్సే లేదు. ప్రధానితో కోమటిరెడ్డి భేటీ సమయంలో రాజకీయాలపై చర్చ జరిగే ఉంటుంది. అయితే , ఏం చర్చించారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అది ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ జంబో కమిటీ ఎందులోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సీనియర్లమైన తమను పట్టించుకోవడం లేదని ఆయన వర్షన్ ఆయన వినిపించారు. అయితే, ఖర్గే నుంచి పాజిటివ్ నెస్ కనిపించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయటకు చెప్పుకుంటున్నారు. కాని ఆయనను…

Read More

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ వీరిద్దరి ప్రేమాయణం వార్తలకు బలం చేకూర్చుతోంది. రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే పాప. లవ్యూ. నువ్వు చేసే అన్ని పనుల్లో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. స్టే బ్లేస్ద్ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ పిక్ ను కూడా షేర్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. https://twitter.com/sundeepkishan/status/1602521668982824962 దీంతో సందీప్ కిషన్, రెజీనాల మధ్య ప్రేమాయణం నిజమేనని నెటిజన్లు స్పందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రారా కృష్ణయ్య, నక్షత్రం అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం…

Read More