Author: Prashanth Pagilla

తెలంగాణ పట్ల  కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందని.. మోడీ సర్కార్ తీరును ఎండగట్టేందుకు డిసెంబర్ లో అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. వారం రోజులపాటు శాసన సభ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా ప్రకటించాయి. డిసెంబర్ చివరి వారం వచ్చింది కాని, అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ను మాత్రం ప్రకటించలేదు. దీంతో సభ సమావేశాల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్రం వల్ల తెలంగాణకు 40వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని..తెలంగాణ పట్ల కేంద్రం వైఖరితో రాష్ట్ర అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోందని , దీనిపై చర్చించాలని డిసెంబర్ నెలలో వారం రోజులపాటు ఉభయ సభలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని లీకులు ఇచ్చారు కాని, చివరి వారం సమీపించిన ఇంతవరకు సభ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు. క్రిస్మస్ తరువాత అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోన్న.. ప్రస్తుతం కేంద్రం…

Read More

చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ లో కూడా కోవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని అలర్ట్ గా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కరోనా నిబంధనలను విధిగా పాటించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో పేర్కొంది. మాస్క్ లను తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను ఉపయోగించడం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరికపోవడం ఇలాంటి జాగ్రత్తలను పాటించేలా పౌరులను జాగృతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అయితే, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను గతంలో మనం పాటించినవే. ఇదిలా ఉండగా.. చైనాలో కేసుల తీవ్రతను చూసి మనం భయపడాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి గణాంకాలను ప్రస్తావించారు. కేసుల సంఖ్య తక్కువే. డిసెంబర్…

Read More

మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తిని సీఎం కేసీఆర్ లైట్ తీసుకోవడానికి కారణం ఏంటి..? ఒకేసారి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైనా, వారిని కేసీఆర్ మందలించకపోవడం వెనకున్న కథేంటి..? తెలియాలంటే ఈ స్టొరీ చదవాల్సిందే. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. జనరల్ గా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే పార్టీ హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. కాని మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీపై ప్రగతి భవన్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దాంతో ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వారంతా జట్టుగా తిరుమల వెళ్ళారు. అయినప్పటికీ హైకమాండ్ సైలెంట్ గానే ఉంది. ఎందుకంటే వారు హైకమాండ్ డైరక్షన్ లోనే మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ లోనే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్ళడమేనని అంటున్నారు. ఇటీవల మల్లారెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలని భావించిన కేసీఆర్ కు ఏదీ కలిసిరావడం లేదు. ముఖ్యంగా ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థల గుప్పిట్లోకి వెళ్ళకుండా చేయాలని ప్రయత్నించి విఫలమైనట్టు కనిపిస్తోంది.ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో నడుస్తుందని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఈడీ వేట మొదలు పెట్టింది. మనీలాండరింగ్ జరిగిందని రంగంలోకి దిగింది. సీబీఐకైతే పర్మిషన్ కావాలి. ఈడీకి అనుమతులు అవసరం లేదు. దీంతో ఈ కేసుపై ఈడీ కాముష్ గా  విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే ఇస్తామన్న వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగానున్న నందకుమార్ చుట్టే ఈ వ్యవహారమంతా తిరుగుతోంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ…

Read More

టాలీవుడ్ ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా సమయంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆరోగ్యం కుదుటపడింది. ఈ మధ్య మళ్ళీ ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ లో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరుగుతాయి. నటన రంగంలో కైకాల చెరగని ముద్ర వేశారు. చిత్ర పరిశ్రమతో 60ఏళ్ల అనుబంధంలో 777సినిమాలో నటించారు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. హాస్యం పండించడం కావొచ్చు, విలనిజం చూపించడం కావొచ్చు, అగ్రెసివ్ రోల్ పోషించడం కావొచ్చు. ఇలా క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోవడం కైకాలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌముడు అయ్యాడు. ఎన్టీఆర్ తరువాత అంతటి పేరు, ప్రఖ్యాతలు పొందిన నటుడు కైకాలనే. రాజకీయాల్లోనూ రాణించారు. 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు రాజకీయం జనవరిలో మొదలు కాబోతోంది. ఇప్పటివరకు ఈడీ, సీబీఐలు విడివిడిగా చార్జీ షీట్ లు దాఖలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తోన్న ఒక్కొక్కరి పేరును చార్జీషీట్ లో చేర్చుతున్నారు. జనవరి ఆరో తేదీన ఈడీ కామన్ చార్జీషీట్ ను దాఖలు చేయనుంది. ఎలాగంటే..అన్ని చార్జీషీట్ లను కలిపి మొత్తం వ్యవహారాన్ని చేధిస్తూ ఒక చార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇందులో అసలు నిందితులు ఎవరు..? కుట్రలు ఎవరెవరు ఎలా చేశారు..? పరోక్షంగా ఎవరైనా సాయమందించారా..? అనేది డిటెయిల్ గా ప్రస్తావించనున్నారు. లిక్కర్ స్కాం కామన్ చార్జీషీట్ లో ఉండే పేర్లు.. నిందితులే ఫైనల్. అయితే, ఎఫ్ఐఆర్ లో ఏ1గా చేర్చిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా పేరును ఇప్పటివరకు నిందితుడిగా చేర్చలేదు. కవిత పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు. మొత్తం ఆమె మద్యం వ్యాపారాన్ని నడిపించారని ఇటీవలి చార్జీషీట్ లో…

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో పార్టీ నేతలతో చర్చిస్తుండగా… బయట ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే విమర్శలు చేస్తావా..? అంటూ పీసీసీ కార్యదర్శి అనిల్ ను ఓయూ జేఏసీ కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టారు. ఆయన ఎదుటే సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్లను విమర్శించిన అనిల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో లో ఒకరినొకరు తోసుకున్నారు. గల్లాలు పట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మల్లురవి వచ్చి శాంతింపజేశారు. అనిల్ ను అడ్డుకున్న ఓయూ విద్యార్ధి నేతలను ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. వీరంతా రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అయితే, ఇటీవల ప్రకటించిన పీసీసీ నూతన కమిటీలో ఓయూ విద్యార్ధి కాంగ్రెస్ నేతల్లో కొంతమందికి…

Read More

టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి రావాలని చంద్రబాబు కబురు పంపుతున్నారు. ఫోన్లు చేసి స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలో జరిగిన సభ వేదిక నుంచే టీడీపీ పాత నేతలను ఆహ్వానించారు. తెలంగాణలో టీడీపీని నేతలే వీడారు కాని, ఆ పార్టీ క్యాడర్ మాత్రమే అలాగే ఉందని సభకొచ్చిన జనసందోహం రుజువు చేసింది. చంద్రబాబు ఖమ్మం పర్యటన ఊహించని విధంగా సక్సెస్ కావడంతో రాజకీయ వర్గాల్లో ఓ కొత్త చర్చ ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ల మధ్య పొత్తు ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే కమలం పార్టీకి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా…

Read More

తెలంగాణలో కుదిరితే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి. లేదంటే బీజేపీనైనా పవర్ లో ఉండాలని ఏపీ సీఎం కోరుకుంటారు. అది ఆయన అవసరం. ఈ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయం. అందుకే అవమానకరంగా చెల్లిని టీఆర్ఎస్ సర్కార్ అరెస్ట్ చేసిన జగన్ నోరు మెదపలేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నోరు తెరిస్తే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జగన్ ఆస్తులపై విచారణ సంస్థలను రంగంలోకి దింపే ప్రమాదం ఉండటంతో కేసీఆర్ తో స్నేహాన్నే జగన్ కోరుకుంటున్నారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే…విచారణ దశలోనున్న జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కనుసైగలతో బీజేపీ జగన్ ను జైల్లో వేయించగలదు. అందుకే తన ఆస్తుల భద్రత, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా టీఆర్ఎస్ , బీజేపీలతో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు జగన్. ఇకపోతే, తెలంగాణలో కాంగ్రెస్ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని…

Read More

తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభాన్నికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చారు. తొమ్మిది మంది సీనియర్ నేతలతో సమావేశమై వారి అసంతృప్తిపై చర్చించనున్నారు. ఎలాగైనా వారిని శాంతింపజేసేలా చొరవ తీసుకోవాలని అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను పంపింది. అయితే, తమ అసమ్మత్తిని గుర్తించి దూతను పంపుతుండటంతో సీనియర్లు మరి బెట్టు చేసే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ ను మార్చాలని సీనియర్లు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. బుధవారమే ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. పార్టీలో ఏర్పడిన వర్గపోరుపై తన వాదనను వినిపించారు. సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉండటం, సొంత పార్టీకి తలనొప్పులు తెచ్చేలా పదేపదే ప్రకటనలు చేయడం వంటి అంశాలపై డిగ్గీ రాజాకు రేవంత్ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్ వర్గం ఆందోళనేమి చెందటం లేదు. రేవంత్…

Read More