Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో లోక్ సభ ఎన్నికలపై బీజేపీ అప్పుడే ఫోకస్ పెట్టింది. పలు రాష్ట్రాల్లో పార్టీ బలబలాలపై అంతర్గత సర్వే నిర్వహించగా షాకింగ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా ఈసారి మాత్రం అధికారం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంటుందని తేలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురు కానుందని సర్వేలో తేలినట్లు సమాచారం. Also Read : ఆ విషయంలో రేవంత్ పోరాడుతున్నారు – బండి సంజయ్ మౌనమేలా.? కేంద్రానికి మరో ఏడాదిన్నర పదవి కాలం మిగిలి ఉంది. రాజకీయ పరిస్థితులు కొంత సంక్లిష్టంగా మారడంతో కమలం కాంపౌండ్ లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన హిమాచల్ ప్రదేశ్ ఫలితంతో బీజేపీ అలర్ట్ అయింది. అక్కడ అధికారం కోల్పోవడంతో భారత్ జోడో యాత్ర ప్రభావం దేశమంతా ఉందని గ్రహించింది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు ఈశాన్యా రాష్ట్రాలతోపాటు…
వివాదాలతో నిత్యం కాలక్షేపం చేస్తుంటుంది నటి శ్రీరెడ్డి. ఎప్పుడు ఎవరిపై ఏం మాట్లాడుతుందో తెలియదు. సడెన్ గా ఎవర్నో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న శ్రీరెడ్డి ఆ తరువాత నేచురల్ స్టార్ నానిపై పడింది. అదే వరుసలో రకుల్ ప్రీత్ సింగ్ , దగ్గుబాటి రానాతోపాటు పలువురు దర్శకులు, నిర్మాతలపై రెచ్చిపోయింది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈ వేడుకకు జబర్దస్త్ టీమ్స్ ను ఆహ్వానించింది జబర్దస్త్ మాజీ జడ్జి, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా. రోజా ఆహ్వానం మేరకు జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో కలిసి ఆది అటెండ్ అయ్యాడు.…
ఇండియాలో క్రేజీ టాక్ షో గా మారింది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. ఆహలో ప్రసారం అవుతోన్న ఈ షో కు రోజులు గడిచే కొద్ది ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ షో ను ప్రసారం చేస్తోన్న ఆహ మీడియా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’పుణ్యమా అని ఇండియాలో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా చోటు దక్కించుకుంది. వరుసపెట్టి సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తుండటంతో ఆహ కు ఆడియన్స్ పోటెత్తుతున్నారు. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ ను ఆహ మీడియా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు ఆడియన్స్ తాకిడి ఎక్కువవ్వడంతో దెబ్బకు యాప్ క్రాష్ అయింది. సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆహ టీం ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది. అయినా ప్రభాస్ మొదటి ఎపిసోడ్ కొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ ఎపిసోడ్ కు దాదాపుగా కోటి వ్యూస్ వచ్చాయట.…
ఖమ్మం కారులో అసంతృప్తులు మెల్లగా బయటకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2023 ఎన్నికల సంవత్సరం కావడంతో నూతన సంవత్సరం పురస్కరించుకొని బీఆర్ఎస్ పై అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపించారు. తమను పట్టించుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని అధినేతకు షాక్ లు ఇచ్చారు. ఇన్నాళ్ళు వేచి చూశామని ఇక ఓపిక లేదని చెప్పేశారు. అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే సీనియర్ నేతలు ఎవరి దారి వారు చూసుకునే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాభై వేల మంది హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంతో మరోసారి తుమ్మల బల ప్రదర్శన చేసినట్లు అనిపించింది. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో ఉంటానని అనుచరులకు తుమ్మల స్పష్టం చేశారు. ఇది ఓ రకంగా పార్టీ అధినేతకు హెచ్చరికలు…
తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆరాధించే, అభిమానించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన్ను ఇండస్ట్రీ పెద్ద అంటుంటారు.కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయన ఆదర్శప్రాయులే. సినిమా రంగంలో ఎంత ఎదిగినా నెగిటివిటిని ఎదుర్కోవడం కామనే. ఇందుకు చిరంజీవి మినహాయింపేమి కాదు. చిరంజీవి ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఆయన కుటుంబంపై నోరు పారేసుకున్నారు. చిరుపై ఈర్ష్యతో చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిన వారున్నారు. ఇది ఒక్క మెగాస్టార్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన వారసుడు రామ్ చరణ్ ను కూడా హత్తుకుంది. సినిమాల పరంగా ఎంత ట్రోల్స్ వేసిన పర్వాలేదు కానీ, వ్యక్తిగతంగా వచ్చే విమర్శలు తీసుకోవడానికి చాలా కష్టం గా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.ఆ మాటలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని డిసెంబర్ లో ప్రకటించారు…
టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఇక, ఇందిరా పార్క్ కు బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. సర్పంచ్ ల సమస్యలపై కాంగ్రెస్ వెంటనే రియాక్ట్ అయింది. గ్రామ పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా… కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించడంతో వెంటనే సర్పంచ్ ల సమస్యలపై కాంగ్రెస్ కార్యచరణ ప్రకటించింది. నిజానికి, ఈ అంశంలో లీడ్ తీసుకోవాల్సిన బీజేపీ పేపర్ ప్రకటనలకే పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపడుతామని ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరగడంతో ఓ మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. చంద్రబాబు సభకు జనం పెద్ద ఎత్తున రావడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరునొకరు తోసుకోవడంతో జనాలు కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళా అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. చంద్రబాబు వెళ్ళిన తరువాత కానుకలు తీసుకోవడానికి భారీగా మహిళలు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. సభా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కందుకూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
విజయనిర్మల మొదటి భర్త సంతానమే నరేష్. కృష్ణను విజయనిర్మల వివాహం చేసుకున్నాక వారి వద్దే నరేష్ పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నరేష్ సక్సెస్ ఫుల్ నటుడిగా గురింపు పొందారు. 1982లో జంధ్యాల తెరకెక్కించిన రొమాంటిక్ కామెడి చిత్రం ‘నాలుగు స్తంభాలాట’ మూవీతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కామెడి కథాంశంతో తెరకెక్కే సినిమాల్లో నరేష్ హీరోగా ఉంటె ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అప్పట్లో అందరి దర్శకుల నమ్మకం. నరేష్ కెరీర్ లో అతి పెద్ద హిట్ జంబలకడిపంబ. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆయన దర్శకత్వంలో నరేష్ చేసిన మరో హిట్ సినిమా “ఆమె”. ఈ లేడి ఓరియంటెడ్ సినిమాలో మరో హీరోగా శ్రీకాంత్…
సీనియర్ నటి సుధ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు చిత్ర అభిమానులకు సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మ, వదిన క్యారెక్టర్ లకు ఆమె పెట్టింది పేరు. అందుకే ఆమెకు టాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు బాలచందర్ వలనే తాను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండగాలిగానని చెప్పారు. మీరు హీరోయిన్ గా కంటే అమ్మ పాత్రలకు బాగా సెట్ అవుతారని ఆయన సూచించినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో అమ్మ క్యారెక్టర్ లు చేస్తుంటే చాలామంది వద్దన్నారు. మొదట్లోనే ఆ పాత్రలు చేస్తే కెరీర్ మొత్తం అవే పాత్రలకు సెట్ చేస్తారని చాలామంది అన్నారని చెప్పుకొచ్చింది సుధ. కాని దర్శకుడు బాలచందర్ సూచన వలెనే తాను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలిగానని చెప్పారు. మదర్ రోల్స్ చేయడం నేను ఆస్వాదించాను. ఏనాడూ అమ్మ పాత్రలు…
శృ*గా** విషయంలో అగ్రరాజ్యం అమెరికా అక్కడి పౌరులకు అపరిమితమైన స్వేఛ్చను కల్పించింది. శృ*గా***నికి సంబంధించి టీనేజ్ పిల్లలకు ప్రత్యేక హక్కులుంటాయి. హద్దు దాటితే ఇండియాలో లాగా తల్లిదండ్రులు మందలించికుండా ఉండేలా హక్కులున్నాయి. శృ*గా*** ఎవరూ అడ్డు చెప్పరు. ఫలితంగా అక్కడి యువత డేటింగ్ పై అక్కడి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రపంచానికి ప్రవచనాలు వల్లిస్తుంది కాని, తన లోపాలను మాత్రం సరి చేసుకోదు. శృంగా*** సంబంధించి అమెరికా అక్కడి యువతకిచ్చిన అపరిమితమైన స్వేచ్చే ప్రపంచం ముందు అమెరికాను అభాసుపాలు చేస్తోంది. టీనేజ్ అమ్మాయిలు పెళ్లి కాకుండానే తల్లులు అవుతున్నారు. ఆ పిల్లలను తీసుకొనే స్కూల్స్ కి వెళ్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో లింకన్ పార్క్ అనే స్కూల్ ఉంది. అక్కడ విద్యార్థుల అల్లరితోపాటు పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. అక్కడి క్లాస్ రూమ్ లో విద్యార్థినిలతోపాటు పసి పిల్లలు కూడా ఉంటారు. కనీసం పదో…