Author: Prashanth Pagilla

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. టీపీసీసీ నిర్వహిస్తోన్న శిక్షణ తరగతులకు హాజరు కావాలని అధిష్టానం కోరినా ఖాతరు చేయలేదు. దీంతో సీనియర్లపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ నెల 26నుంచి ప్రారంభించనున్న హత్ సే హత్ జోడో , ఎన్నికల నిబంధనలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కావాలని ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోరారు. అన్ని మెల్లగా సర్దుకుంటాయని సమావేశానికి తప్పక హాజరు కావాలని సీనియర్లకు ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. కాని సీనియర్లు అధిష్టానం మాటను లెక్క చేయలేదు. ఈ శిక్షణ తరగతులకు భట్టి విక్రమార్క, కోదండరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఉత్తమ్‌, మధుయాష్కీ, విహెచ్,…

Read More

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. సోనియా గాంధీతో ఆమె కూతురు ప్రియాంక గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. అయితే ఆమె సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రీకి వెళ్ళారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు, 76ఏళ్ల సోనియా గాంధీ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని పీటీఐ మీడియా సంస్థ వెల్లడించింది. మంగళవారం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. సోనియా ఆరోగ్యం బాగోలేదని తెలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి ఢిల్లీకి వచ్చారు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆకాంక్షించారు. ఆమె అనారోగ్యానికి గురికావడం బాధాకరమని చెప్పారు.

Read More

పునర్నవి భూపాలం అందరికీ తెలిసిన నటి. సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించిన ఛాన్స్ లు రాకపోవడంతో మళ్ళీ చదువుపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య బిగ్ బాస్ హౌజ్ లో కనిపించి అభిమానుల అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. హౌజ్ లో ఉన్నాన్నాళ్ళు రాహుల్ సిప్లిగంజ్ తో సన్నిహితంగా మెదిలింది. దాంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. పునర్నవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాక రాహుల్ ను గెలిపించాలని తన ఫ్యాన్స్ ను కోరింది. బిగ్ బాస్ సీజన్ 3విన్నర్ గా రాహుల్ గెలుపొందాక వీరిద్దరూ అక్కడక్కడ కనిపించడంతో పున్నూ బేబి- రాహుల్ లు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కాని తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చి ఊహాగానాలకు తెరదించారు. తాజాగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజులుగా తాను ఊపిరితిత్తుల సమస్యలతో…

Read More

అమెరికా, ఇంగ్లాండ్ ను వణికిస్తోన్న కరోనా సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15 తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ తరహ కేసులు రాష్ట్రంలో మూడు నమోదైనట్లు హైదరాబాద్ లోని జన్యు ఆధారిత ప్రయోగశాల తెలిపింది. కరోనా సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15 శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఈ కేసులు వెలుగు చూడగా, తాజాగా తెలంగాణలో కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ని న్యూయార్క్‌లో గుర్తించారు జేపీ వీలాండ్‌ సహా ఇతర జన్యు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్ వైరస్ ను వేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ గా తెలిపారు. దీనివల్ల కరోనా వేవ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది ఓమిక్రాన్ వేరియంట్ కంటే ప్రమాదకారి అని, చాలా వేగంగా వ్యాప్తి చెందగల సామర్ధ్యం…

Read More

హీరోయిన్ శృతి హసన్ పై గట్టిగానే ట్రోల్స్ జరుగుతున్నాయి. డబ్బుల కోసం తండ్రి వయస్సున్న హీరోలతో ఆడిపాడేందుకు సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా వేదికగా శృతి హసన్ పై దాడి జరుగుతోంది. కొన్నాళ్ళు ఈ ట్రోల్స్ ను చూసి చూడనట్టు వదిలేసిన ఈ బ్యూటీ తాజాగా ఘాటుగా సమాధానం ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే. గతంలో నాకంటే చాలామంది హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించారు. అప్పుడు జరగని ట్రోలింగ్ ఇప్పుడెందుకు జరుగుతుందని ప్రశ్నించింది శృతి హసన్. బాలయ్య, మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది శృతి హసన్. చిరంజీవి, బాలకృష్ణల వయసు ఆమె వయసుకు డబుల్ ఉంటుంది. దీంతో ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బుల కోసం మీ డాడి వయస్సున వారితో స్టెప్పులేస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. శృతి హసన్ తండ్రి కమల్ హసన్…

Read More

సమంత తనకు క్లోజ్ ఫ్రెండ్ అని హీరోయిన్ రష్మిక మందన  తాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ సమంత ఓ నటియే కాదు. చాలా మంచి మనస్తత్వం ఉన్న స్త్రీ అని వ్యాఖ్యానించింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత నాతో చెప్పేవరకు తనకు తెలియదని తెలిపింది రష్మిక. సమంత నాతో కలిసిన సందర్బాలలో ఏనాడు కూడా మయోసైటిస్ గురించి చెప్పలేదని వెల్లడించింది. ఈ వ్యాదితో బాధపడుతున్న సమంతకు మరింత హాని కలుగకుండా ఆమెలో మనోస్థైర్యాన్ని నింపి తనను అమ్మలా రక్షించుకుంటానని రష్మిక తెలిపింది. జీవితంలో ఇబ్బందులనుఎదుర్కొనే వక్తుల నుంచి అందరు స్పూర్తి పొందుతారని, తాను కూడా సమంత నుండి అదే స్ఫూర్తి పొందుతానని పేర్కొంది. తనకు అత్యంత సన్నిహితురాలయిన సమంత త్వరలోనే కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నానని వ్యాఖ్యానించింది. తాను హీరోయిన్ గా నటించిన పుష్ప మూవీ లో ” ఊ అంటానా మామ ఊ ఊ…

Read More

బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొదటి సీజన్ కాస్త చప్పగా అనిపించిన సెకండ్ సీజన్ మాత్రం దుమ్మురేపుతోంది. రెండో సీజన్ లోనూ మూడు ఎపిసోడ్ లు అంతగా మెప్పించలేదు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో కు మరింత పాపులారిటీ వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ఎపిసోడ్ చూసేందుకు చాలా మంది ఆహ యాప్ లో కొత్తగా లాగిన్ అయ్యారు. ఇటీవలే ప్రసారమైన ప్రభాస్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ టాక్ షో కు మెగాస్టార్ కూడా వస్తే బాగుండేదని ఆడియన్స్ అనుకుంటుండగా ఓ వార్త వైరల్ అవుతోంది. చిరంజీవి ‘అన్…

Read More

ఇక కల్వకుంట్ల కుటుంబం పని అయిపొయింది. జైలుకు వెళ్ళడం ఖాయమని బీజేపీ హడావిడి చేయగా… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీల నేతల అరెస్టులు ఉంటాయని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు పేల్చారు. రోజులు గడుస్తున్నాయి కాని అరెస్టులు లేవు. కేసుల విచారణలో ఎలాంటి ముందడుగు లేదు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మెల్లగా నిందితులకు బెయిల్స్ వస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి చేరినా ఇంకా కేసు నమోదు చేయలేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాతోపాటు కవితల అరెస్ట్ తథ్యమని లీకులు ఇచ్చినా..ఈడీ, సీబీఐలు వారిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాని చార్జీషీట్ కాని దాఖలు చేయలేదు. Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు – వందల కోట్ల లెక్క తేల్చే పనిలో ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఓ నిందితుడి చార్జీషీట్ లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక భాగస్వామి అని ఈడీ పేర్కొంది. ఈ…

Read More

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న సమంత ఆరోగ్యపరిస్థితి విషమించిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె సోషల్ మీడియాలో రిప్లై ఇస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే బాలీవుడ్ మేకర్స్ ఆమె సైన్ చేసిన ప్రాజెక్టుల నుంచి తప్పించారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె సన్నిహితులు ఈ వార్తలను కొట్టిపారేశారు. సమంత స్ట్రాంగ్ విమెన్. విడాకుల తరువాత మానసిక వేదనకు గురయ్యారు. ఆ తరువాత ఆమెపై అనేక నిరాదర వార్తలు వచ్చినా తట్టుకొని కెరీర్ పై దృష్టి పెట్టింది. అలాంటి సమంత మయోసైటిస్ వ్యాధిని ఎదుర్కొని నిలబడటం పెద్ద కష్టమేమి కాదు. ఆమె క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గతంలో కన్నా మెరుగ్గా కనిపిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కూడా కాబోతుంది అంటూ సామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆమె సన్నిహితులు. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆమె క్యాన్సిల్ చేసుకుందని వార్తలను నిరాధారమని చెప్పినట్లు…

Read More

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో వివాహంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కావాలనిపిస్తుందని… కాకపోతే ఈ ఏజ్ లో సెట్ కాదేమోనని చెప్పుకొచ్చారు. 1997లో ప్రగతి వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లికి ముందే తమిళ, మళయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. 1976లో జన్మించిన ప్రగతి 21ఏళ్లకే వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఆమె ఇష్టపూర్వకంగానే జరిగినట్లు సమాచారం. పెళ్లి తరువాత మ్యారేజ్ విషయంలో తొందరపడినట్లు అనిపించిందని ప్రగతి చెబుతున్నారు. మ్యారేజ్ చేసుకునే సమయంలో మనకు మొత్తం తెలుసుననే పెళ్లి చేసుకుంటామని తెలిపారు ప్రగతి. జీవితంలో పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ అని, దాని విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోవద్దని సూచించారు. ఏమాత్రం తొందరపడిన జీవితంలో తరువాత ఎదురయ్యే అనుభవాలు మామూలుగా ఉండవని హెచ్చరించారు. భర్తకు విడాకులు ఇచ్చాక ప్రగతి తన కూతురితో పాటు ఒంటరిగానే ఉంటున్నారు. ఇటీవలప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా…రెండో…

Read More