Author: Prashanth Pagilla

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను చూసిన వారికీ మునుపటి మెగాస్టార్ గుర్తుకువచ్చినట్లు అనిపిస్తుంది.మెగాస్టార్ కామెడీ, డ్యాన్స్ , ఫైట్స్ తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ స్టేజ్ కు తీసుకెళ్ళింది. చిరంజీవి హీరోగా గతంలో వచ్చిన ఆచార్య , గాడ్ ఫాదర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. చిరు నుంచి మంచి హిట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ అభిమానుల అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. అభిమానుల పల్స్ ను పసిగట్టిన దర్శకుడు చిరంజీవి ప్రమోట్ చేసి చూపించారు. Also Read : చిరుతో స్లివ్ బ్లౌజ్ తో కష్టంగా అనిపించిందన్న శృతి హసన్ తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్ రవితేజ , రవితేజ డైలాగ్ చిరంజీవి చెప్పడం ఫన్నీగా…

Read More

తెలంగాణ ప్రగతికి కేంద్రం అడ్డం పడుతోందని అసెంబ్లీని సమావేశపరిచి లెక్కలతో సహా వివరిస్తామని ఆ మధ్య కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ లో వారం రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చేసింది. కాని అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ముచ్చటే లేదు. జనవరిలోనూ అసెంబ్లీ నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే సంక్రాంతి రానుంది. ఆ తరువాత జనవరి 26. ఆ తరువాత అసెంబ్లీ నిర్వహించాలనుకుంటే నిర్వహించొచ్చు. కాని కేసీఆర్ తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అప్పులు కావాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం ఉదారభావంతో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడిగిన దాని కన్నా ఎక్కువ అప్పు పరిమితి మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 6,572 కోట్లు కావాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన పెట్టగా కేంద్రం మాత్రం ఏకంగా రూ. 9,572 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇంతకాలం అప్పులపై కొర్రీలు పెడుతూ…

Read More

పబ్లిక్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకమైన డ్రెస్ లు ధరించి హీరోయిన్స్ విమర్శల పాలవుతుంటారు. పబ్లిక్ లో కొంతమంది హీరోయిన్స్ డ్రెస్ పక్కకు తొలగిపోవడంతో ప్రైవేట్ పార్ట్స్ కనిపించడం జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు నలుగురిలో ఇబ్బంది పడుతూ డ్రెస్ ను సర్దుకోవడం మినహా ఇంకేం చేయలేం. అలాంటి పరిస్థితినే కియారా అద్వానీ ఎదుర్కొన్నారు. ముంబైలోని ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లేందుకు కియారా అద్వానీ కారులో వచ్చారు. కారు దిగి బిల్డింగ్ లోపలికి వెళ్లే ముందు అక్కడనున్న ఫోటోగ్రాఫర్స్ కోరిక మేరకు ఫోజులిచ్చారు. ఆ తరువాత మెట్లపైకి వెళ్తుంటే పైరగాలికి ఆమె డ్రెస్ పూర్తిగా పైకెళ్ళిపోయింది. దీంతో వెంటనే కియారా డ్రెస్ ను సరి చేసుకున్నారు. కాని అక్కడే ఉండి ఆమె ఫోటోలను క్లిక్ మనిపిస్తోన్న ఫోటోగ్రాఫర్లు ఆ ఫోటోలను కూడా షూట్ చేసేశారు. ఇంకేముంది ఆ వీడియో పిచ్చ వైరల్ కాగా జనాలు ఎంజాయ్ చేశారు. వదులుగా ఉన్న కట్ ఫ్రాక్…

Read More

అప్పట్లో ఏపీ గవర్నర్ గా చేసిన తివారీ తన తండ్రి అని ఓ వ్యక్తి పోరాడిన సంగతి తెలిసిందే. అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో డీఎన్ఏ టెస్టు కీలకమైంది. దాంట్లో వీరిద్దరూ తండ్రికొడుకులని తేలడంతో..ఆ తరువాత అతను తన కొడుకేనని తివారీ అంగీకరించాడు. ఇప్పుడు అదే తరహలో వైసీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎవరో కాదు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తన తండ్రి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని శివచరణ్ రెడ్డి అనే యువకుడు లేఖ ద్వారా మీడియాకు సమాచారం అందించాడు. అతను కేవలం లేఖతో సరిపెట్టలేదు. బాల్యంలో చంద్రశేఖర్ రెడ్డి తమ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను చూపించారు. తండ్రిలాగా నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలను పంపారు. తన తల్లి అనంతరం ఆయన లైఫ్ లోకి వచ్చిన మహిళలకు చంద్రశేఖర్ గుర్తింపు ఇచ్చారు కాని, తమకు ఆ గుర్తింపు ఇవ్వడం లేదని ఆ యువకుడు చెబుతున్నాడు.…

Read More

నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. పవిత్రని నరేష్ విహాహం చేసుకుంటారన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో పెళ్లి ఆలోచనే లేదన్న నరేష్.. ఇటీవల విడుదల చేసిన వీడియోలో మాత్రం కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పవిత్రతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటానని..తమ మధ్యనున్న అనుబంధం ఎంతవరకు వెళ్తుందో చూడాలని నరేష్ చెప్పారు. ఇక ,నరేష్ నాలుగో పెళ్లి ప్రకటనపై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి దారుణమైన ఆరోపణలు చేసింది. తనను వదిలించుకోవడానికి నాకు కృష్ణగారితో ఎఫైర్స్ అంటగట్టాడు. దేవుడు లాంటి కృష్ణగారితో అక్రమ సంబంధాలు ఉన్నాయని మానసిక వేదనకు గురి చేశాడు. డ్రైవర్ తో కూడా సంబంధం అంటకట్టాడు. ఇలా నాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కృష్ణగారికి నా వలన ప్రాణహాని ఉన్నట్లు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశాడు. అది కృష్ణగారు నాపై కంప్లైంట్ చేస్తున్నట్లు…

Read More

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పొద్దునలేస్తే బహుజనవాదం పల్లవి వినిపిస్తాడు. బహుజన రాజ్యాధికారం అంటూ తూటలాంటి తన మాటలతో అందర్నీ ఆలోచింపజేస్తాడు. అయితే, గతంలో బీసీలకు రాజాకీయాధికారంలో సముచితమైన స్థానం కల్పించిన టీడీపీతో ఆయన కలిసే నడిచే అవకాముందన్న ప్రచారం తాజాగా జోరుగా జరుగుతోంది. టీడీపీ తెలంగాణలో బలపడాలని అనుకుంటోంది. మళ్ళీ పునర్వైభవం కోసం తహతహలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడిగా బక్కని నరసింహులును తప్పించి ఆయన స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కు బాధ్యతలు అప్పగించింది.పార్టీ బలోపేతం కోసం ఆయన దూకుడు పెంచుతున్నారు. ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మరికొన్ని జిల్లాలో సభలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీని వీడి వెళ్ళిన నేతలను తిరిగి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు… తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే యువ నేతలను కూడా పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్‌ మల్లన్న ఆశాదీపంలా కనిపించారు. ఆయనతో కలిసి పని చేస్తే పార్టీ…

Read More

సాఫ్ట్ వేర్ దంపతులకు ఆరేళ్ళ కొడుకు. తను ఉన్నట్టుండి జబ్బు బారిన పడటంతో వైద్యులకు చూపించారు. పరీక్షలు చేయగా మెదడు కేన్సర్ అని తేల్చేశారు. ఆరేళ్ళ కొడుక్కి ఈ విషయం అర్థం అవుతుందో లేదో తల్లిదండ్రులకు తెలియదు. కాని ఈ విషయం బిడ్డకు తెలియకుండా ఆ జంట జాగ్రతపడాలనుకున్నారు. బిడ్డను చూస్తున్న ప్రతిసారి మెదక్ కేన్సర్ అనే విషయం గుర్తొచ్చినా తనకు విషయం చెప్పకుండా లోలోపల తల్లిదండ్రులు కుమిలిపోయారు. చిన్న కన్నీటిచుక్క కూడా బయటపడకుండావ్యవహరించారు. కాని అసలు విషయం వాళ్లకు తెలియదు. డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు చూసి తనకు ఏమైందో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. ఆరేళ్ళ పిల్లాడు తనకు ఏమైందో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకోవడం ఏమాత్రం ఆషామాషీ విషయం కాదు. అయితే.. కన్నీరు పెట్టించే విషయం ఏంటంటే… సాధారణంగా రోగులకు వ్యాధి గురించి చెప్పకండి. వారు ఆందోళన చెంది తొందరగా కాలం చేస్తారని రోగుల సంబంధీకులకు…

Read More

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వధువు.. ప్రేమించిన యువకుడితో లేచిపోవడం చూస్తుంటాం. కాని ఈ కేసులో మాత్రం అత్తయ్య అల్లుడితో లేచిపోయి అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. విదేశాల్లో ఉండే అల్లుడు ఇటీవల తన భార్యతో కలిసి అత్తింటికి వచ్చాడు. వారి ముగ్గురు పిల్లలను మాత్రం విదేశాల్లోనే ఉంచారు. అల్లుడితో లేచిపోదామనుకున్న అత్త ముందుగానే మంచి స్కెచ్ వేసింది. తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండి పెట్టింది. అతని భార్య (తన కూతురు), మామగారు (భర్త)కు మాత్రం మటన్ కర్రీ వండి పెట్టింది. ఆ మటన్ కర్రీలో నిద్రమాత్రలు కలిపింది. అత్త కూడా చికెన్ తింది. ఇక భోజనం చేశాక కూతురు, భర్త నిద్ర మత్తులోకి జారుకోగా.. అల్లుడితో కలిసి అత్త విదేశాలకు వెళ్ళిపోయింది. అత్త- అల్లుడి మధ్య 13ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇక, సాయంత్రం అయ్యాక నిద్రమత్తు నుంచి తెరుకున్నా భర్తకి, కూతురికు ఆసలెం జరిగిందో…

Read More

ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఇటీవల అసంతృప్తి వ్యాఖ్యలు చేసినా హైకమాండ్ పిలిచి మాట్లాడకపోవడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు..? ఎప్పుడు కండువా కప్పేదామా అనే ఆతృతతోనున్న కమలనాథులు ఈ ఇద్దరు నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో తుమ్మల , పొంగులేటిలు పార్టీ మారే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి ఎలాగైనా పోటీ చేసి తీరాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామన్న అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని ఇటీవల ఆయన ధిక్కార వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను.. తన అనుచరులు పోటీ చస్తారని స్పష్టం చేశారు. పొంగులేటినే గతంలో పక్కనపెట్టిన కేసీఆర్ ఈసారి ఆయనకూ ఛాన్స్…

Read More

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈటల బీజేపీలో చేరిన తరువాత బండి సంజయ్ వ్యతిరేకులంతా ఆయన చెంతకు చేరారు. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఈటలే అని ఆయన వర్గం ఫుల్ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో బండి సంజయ్ వర్గం కూడా బండికి మైలేజ్ ఇచ్చే విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు రెండు పేరు మోసిన పేపర్లు తమ నేతల కోసం పోటాపోటీగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రతి విషయాన్ని తమ నేతకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకీ ఆ పేపర్లు ఎవనేగా మీ సందేహం. వెలుగు , దిశా పేపర్ లు. “కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి మరొకరు” అని శుక్రవారం వెలుగు పేపర్ కథనం ప్రచురించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాసుకొచ్చింది వెలుగు. వచ్చే నెలలో బండి సంజయ్ రాష్ట్ర అద్యక్ష పదవి కాలం ముగియనుండటంతో ఆయన్ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే…

Read More