Author: Prashanth Pagilla

చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలంటే రాజీనామాలే కరెక్ట్ అని ఆ పార్టీ లెజిస్లేచర్ విభాగం సమాలోచనలు జరుపుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై పార్టీ పరంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా లెజిస్లేచర్ పరంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశంపై సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీకి ప్రస్తుతం 21మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ వీరంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు అవుతుంది. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే సందేశం జనాల్లోకి వెళ్తుంది..అదే సమయంలో టీడీపీకి సానుభూతి పెరుగుతుందని భావనలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు…

Read More

సెప్టెంబర్ 17న ఊహించని విధంగా పార్టీలో చేరికలు ఉంటాయని, ఊహించని విధంగా ట్విస్టులు ఇస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. సోనియా సమక్షంలో బీఆర్ఎస్ , బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేర్పించేందుకు రేవంత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్టులు ఉంటాయని చెప్తుండటంతో తెలంగాణలో సొనియా సభ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వర్ రావుతో రేవంత్ భేటీ అవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారన్న సంకేతాలను ఇచ్చారు. ఆయన సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మైనంపల్లి హన్మంతరావు కూడా తన కుమారిడితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటిస్తుండటంతో హస్తం వైపు వెళ్తున్న నేతలెవరు? అనే ప్రశ్నలు బీఆర్ఎస్ , బీజేపీల్లో కలవరం రేపుతున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బీఆర్ఎస్ లో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కూడా కొందరు…

Read More

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పతనం అవుతోంది. వారం , వారం తెలంగాణ పొలిటికల్ పల్స్ పై తెలంగాణ ఇంటెన్షన్ సర్వే చేపడుతోన్న ఫలితాలు వీటిని రుజువు చేస్తున్నాయి. గత వారం నుంచి బీఆర్ఎస్ అదే గ్రాఫ్ ను మెయింటేన్ చేస్తున్నా కాంగ్రెస్ పుంజుకోవడం అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 38శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా తరువాత 29శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేసులో కాంగ్రెస్ కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య ఏమంత పెద్దగా ఓటింగ్ శాతం గ్యాప్ లేకపోవడం.. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటుందని నివేదికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎదురుదాడిని పీక్స్ కు తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ నెల 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ఇవ్వనుంది. రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ…

Read More

జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. మొదట్లో టీడీపీ నేతలను పలు కేసుల పేరుతో అరెస్ట్ చేయించిన జగన్ రెడ్డి తాజాగా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయించారు. బాబు అరెస్ట్ రాజకీయ కక్ష అని మాట్లాడిన లోకేష్, పవన్ కళ్యాణ్ లను కూడా లోపల వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు సీఐడీ కూడా జత కలిసింది. అనంతరం మంత్రులు తమ వంతు వచ్చిందనుకున్నారో ఏమో కానీ రెచ్చిపోయారు. చంద్రబాబు 420అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అంబటి రాంబాబు లోకేష్ ను టార్గెట్ చేస్తూనే మరోసారి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై మాట్లాడారు. ఈ సినిమా కలెక్షన్స్ పై విచారణ చేయించి బ్రో ను క్లోజ్ చేయిస్తానని బెదిరించారు. చంద్రబాబును అరెస్ట్ పై సీఐడీపై పలు అనుమానాలను వ్యక్తం చేసినందుకు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామని సీఐడీ చీఫ్ చెప్పారు. లోకేష్ ను ఈ స్కిల్…

Read More

కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహణ జమిలి ఎన్నికల కోసమేనని వార్తలు వస్తుండగా కేంద్రమంత్రి, బీజేపీ ఎన్నికల తెలంగాణ ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు ఉండబోవని …లోక్ సభ , అసెంబ్లీకి వేర్వేరుగానే ఎన్నికలు జరుగుతాయని జమిలి ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును ఈ పార్లమెంట్ లో సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించినా.. రాజ్యసభలో ఆమోదం పొందటం కష్టమే. దాంతో కేంద్రం ఈ బిల్లు ఆమోదం కోసం ఎం చేయబోతుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. జమిలి ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది. దీంతో వీటన్నింటిని దాటుకొని జమిలి ఎన్నికలు ఈసారి సాధ్యం కాదని న్యాయనిపుణులు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జమిలి ఎన్నికలను కేంద్రం వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకోచ్చిందన్న విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇండియా…

Read More

పది మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉందని సీఎం కేసీఆర్ కు అందిన ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తేలింది. 10మందిపై వ్యతిరేకత ఉండటంతో ఇది నిజమో కాదో తెలుసుకునేందుకు ఈ రిపోర్ట్ ను క్రాస్ చెక్ చేసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే చేయించారు కేసీఆర్. అయినా ఫలితం సేమ్ రావడంతో మంత్రులను కేసీఆర్ అలర్ట్ చేశారు. ఓటమికి దగ్గరలో ఉన్నారని…గెలుపు వరించాలంటే అంత ఈజీ కాదని మంత్రులకు కేసీఆర్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఓటమిని ఆహ్వానించినట్లు అవుతుందని హెచ్చరించారు. కొసమెరుపు ఏంటంటే.. గజ్వేల్ లో కేసీఆర్ కూడా డేంజర్ జోన్ ఉన్నట్లు సమాచారం. 1.శ్రీనివాస్ గౌడ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై భూకబ్జాలతోపాటు తన వ్యతిరేకులకు అనుచరులతో బెదిరించినట్లు ఆరోపణలు ఉండటంతో ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగింది. మంత్రిగా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదని…సొంత ఎదుగులకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్…

Read More

మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. మైనంపల్లితోపాటు ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించడంతో వారిద్దరూ హస్తం గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సోనియా గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మెదక్ అసెంబ్లీ సీటు తన కుమారిడికి బీఆర్ఎస్ నిరాకరించడంతో మైనంపల్లి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా చర్చలు జరిపాయి. మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ కూడా అంగీకరించింది. కానీ మెదక్ లో కాంగ్రెస్ కు మాత్రమే స్కోప్ ఉండటంతో మైనంపల్లి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో తన అనుచరులు, కార్యకర్తలతో మైనంపల్లి సమావేశమై కాంగ్రెస్ లో చేరికపై…

Read More

ఈ నెల 18నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది కేంద్రం. సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం ఈ సమావేశాల ఎజెండా ఏంటో మాత్రం పేర్కొనలేదు. పలు కీలక బిల్లులను ఆమోదించేందుకునేందుకు ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురాబోయే ఐదు బిల్లులు ఇవేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుతోపాటు రోహిణి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని బిల్లులు రాజ్యసభలో వీగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభలో అధికార బీజేపీకి సరిపడా సభ్యులు లేరు. దీంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వంటి కీలక బిల్లులకు బ్రేక్ పడుతుందా..? అనే చర్చ ఆసక్తి రేపుతోంది. Also…

Read More

తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తీన్మార్ మల్లన్న ఆ పార్టీకి అద్యక్షుడిగా వ్యవహరించనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి తీన్మార్ మల్లన్న దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం షురూ అయింది. ఇందులో భాగంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీలోపు తెలిజేయాలని ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. ఏప్రిల్ లో కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన మల్లన్న అప్పుడే తాను వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మల్లారెడ్డిని ఓడించి తీరుతానన్నారు. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో మల్లారెడ్డి ఇష్యూను ప్రస్తావిస్తూ.. ఆయన కబ్జాల బాగోతాన్ని బయటపెడుతూ మేడ్చల్ వాసులకు మరింత దగ్గర అవుతున్నారు. కొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ తో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్…

Read More

తెలంగాణ బీజేపీని సెట్ రైట్ చేయాలనుకుంటున్న జాతీయ అధినాయకత్వం ప్రయత్నాలు ఫలించడం లేదు. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా నియమించినా పార్టీ ఎదుగుదలలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గా కొనసాగుతున్న ఈటల , బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య వర్గపోరు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణాయాదవ్ ను బీజేపీలో చేరే దిశగా పావులు కదిపి ఈటల సక్సెస్ అయ్యారు. కానీ ఆయన చేరిక చివరినిమిషంలో ఆగిపోయింది. కారణం కిషన్ రెడ్డి వ్యతిరేకించడం. ఎందుకంటే అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి..తనకు తెలియకుండా నా ఇలాకాలో చేరికలను ఎలా ప్రోత్సహిస్తారు..? అని కృష్ణాయాదవ్ చేరికను వ్యతిరేకించినట్లు సమాచారం. దీన్ని ఈటల అవమానంగా ఫీల్ అవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం చేరికలను స్పీడప్ చేస్తుంటే కిషన్…

Read More