Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి సంక్రాంతితో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు ఉంది. సంక్రాంతి వస్తే చాలు బ్యాట్ తో వీరవిహారం చేస్తాడు. ప్రత్యర్ధి టీం బౌలర్లు ప్రపంచ స్థాయి బౌలర్లైనా ఉతికిఆరేయడం పనిగా పెట్టుకుంటున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన విధ్వంసకరమైన ఆట తీరును అభిమానులకు పరిచయం చేశాడు.. 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు.. తన అసాధారణ బ్యాటింగ్ తో అభిమానులకు సంక్రాంతి సంబరాలను డబుల్ చేశాడు.. 2017లో 2017లో సంక్రాంతి రోజే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… 2018 సంక్రాంతికి సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019లో సంక్రాంతి సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇక…
మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఒకే రాజధాని ఉండాలనే కాన్సెప్ట్ కు జగన్ అంగీకరించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఆ ఒక్క రాజధాని అమరావతి కాదు విశాఖపట్నం. ఇంత హడావిడిగా ఒకే రాజధాని నిర్ణయానికి జగన్ ఒకే చెప్పడానికి కారణం ఉంది. త్వరలో అక్కడ అక్కడ ఇన్వెస్టర్స్ మీట్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే పెట్టుబడిదారులకు రాజధాని అంటే ఏం చెబుతామని ఆలోచించి.. విశాఖపట్నంకు ఓటేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారుల సదస్సుకు జగన్ చాలామందిని ఆహ్వానించారు. ఈ సదస్సుకు వచ్చిన వారంతా మీ రాజధాని ఏదని అడిగితే మూడు రాజధానులు అని చెప్తే బాగుండదని అనుకున్నారో ఏమో కాని విశాఖను రాజధానిగా ఫైనల్ చేశారు. ఇన్వెస్టర్స్ కు విశాఖ రాజధానిగా చేబితే వారంతా సటిస్ ఫై అవుతారని వైసీపీ నేతల నమ్మకం. అమరావతిని కాదని విశాఖను మాత్రమే రాజధానిగా ప్రకటించాలంటే అనేక చట్టబద్దమైన…
మంత్రి హరీష్ రావు. కేసీఆర్ మేనల్లుడు. బీఆర్ఎస్ కీలక నేత. టీఆర్ఎస్ ఆవిర్భావం మొదలు బీఆర్ఎస్ వరకు కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తోన్న నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై ఈగ వాలకుండా చూసుకున్నారు. అందుకే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ రాజకీయ నిర్ణయం తీసుకుకోవాలనుకున్న హరీష్ రావును సంప్రదిన్చాల్సిందే. అలా ఉద్యమాన్ని పార్టీని సమన్వయము చేసుకుంటూ వచ్చిన హరీష్ కు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత కరువైపోతు వచ్చిందనేది ఆయన వర్గీయుల మాట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటగా సాగునీటి పారుదల శాఖను కట్టబెట్టారు కేసీఆర్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అలాగే, శాసన సభ వ్యవహారాల ఇంచార్జ్ గా కీలక బాధ్యతలను కట్టబెట్టారు కేసీఆర్. ఆ తరువాత ఆయనకు పార్టీలో పెరుగుతోన్న ఫాలోయింగ్ చూసి కేసీఆర్ కు భయం మొదలైందట. హరీష్ రావు దూకుడును కట్టడి చేయకపోతే కేటీఆర్ కు ఇబ్బంది అవుతుందని…
కేసీఆర్ పై అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తోన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అస్సలు వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు ఆయన ఝలక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు పరోక్షంగా ప్రకటించేశారు. ఆదివారం ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో మార్పులు చేసి ఈమేరకు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ నుంచి కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను తొలగించేశారు. పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారనే వార్తల నేపథ్యంలోపొంగులేటి తన సోషల్ మీడియా ఖాతాలో కేసీఆర్ , కేటీఆర్ ల ఫోటోలను తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోన్న వేళ ఖమ్మం సభకు ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీజేపీలో చేరాలనుకునే వారి తమ గోతిని తామే తోవ్వుకున్నట్లని హరీష్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.…
తొలి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్న నటుడు రామిరెడ్డి.1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాలో విలన్ గా నటించి ఈ ఆవార్డ్ పొందాడు. ఈ మూవీలోని క్యారెక్టర్ అందరికీ నచ్చడంతో ప్రతి నాయకుడిగా ఆయనకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. అంకుశం సినిమాలో రామిరెడ్డి డైలాగ్ వినని వాళ్ళు, ఆ డైలాగ్ చెప్పని వాళ్ళు బహుశ ఎవరూ ఉండరేమో. అంతగా అప్పట్లో ఆ డైలాగ్ ఫేమస్ అయింది. స్పాట్ పెడ్తా.. ఇప్పటివాళ్లకు ఏమో కానీ 90వ దశకంలో ఈ డైలాగ్ విననివాళ్లు, అననివాళ్లు ఉండరు. ‘అంకుశం’ మూవీతో నటుడిగా పరిచయమయిన రామిరెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది. ఆ చిత్రంలో విలన్ రోల్ తో మెప్పించాడు. విలన్ అంటే ఇలా చేయాలని ఆయనను చూసి ఎంతోమంది విలన్ క్యారెక్టర్ లు చేయాలనుకునే వారు నేర్చుకున్నారు. తెలుగు మాత్రమే కాదు అటు బాలీవుడ్‌లో సైతం సత్తా చాటారు. ఇక తమిళం, మలయాళం, కన్నడ,…
మనకు తెలియని విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటాం. గూగుల్ ఉండగా చింత ఎందుకు దండగ అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. అయితే, గూగుల్ లో దేనైనా సెర్చ్ చేయవచ్చు కాని కొన్నింటిని సెర్చ్ చేస్తే క్రిమినల్ యాక్ట్ వర్తిస్తుంది. గూగుల్ లో అన్ని విషయాలను సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కాని బాంబును ఎలా తయారు చేయాలో వెతికితే సైబర్ క్రైం నిఘాలో పడి అరెస్ట్ అయ్యే అవకాశం వందశాతం ఉంటుంది. బాంబు సమాచారాన్ని సేకరించడం శిక్షార్హమైన నేరం. అదే విధంగా 18ఏళ్లలోపు పిల్లల అశ్లీల చిత్రాల కోసం వెతికితే పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారు. ఇంటర్నెట్‌లో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం అంటే అబార్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడం, కాపీరైట్ ఉన్న చిత్రాలను వెతకడం కూడా శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. అందుకే గూగుల్ లో ఈ తరహ వాటిని సెర్చ్ చేయకండి.
సంక్రాంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ప్రారంభిస్తామని మొదట ప్రకటించారు. కాని ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరికి మార్చారు. కేసీఆర్ పుట్టిన రోజునే ఈ కార్యక్రమం పెట్టుకుంటే అన్నింటికి కలిసి వస్తుందని చివరికి ఆ తేదీనే ఖరారు చేశారు. ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నిజానికి ఆరేడు నెలల్లోనే తెలంగాణ సచివాలయం పూర్తి చేయాలనుకున్నారు. కాని మూడేళ్ళు దాటిపోయింది. మధ్యలో కరోనా కారణంగా మరికొంత ఆలస్యం అయింది. దసరాకు ప్రారంభించాలని అనుకున్నా ఆ తరువాత సంక్రాంతి అనుకున్నారు. కాని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. 20ఎకరాల స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో కొత్త సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. ఆరు అంతస్తుల్లో పాలన విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్ ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల…
మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామందులు మారడం లేదు. బరితెగించి రెచ్చిపోతున్నారు. వయో బేధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో 90ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాకు చెందిన వృద్దురాలిపై అత్యాచారం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలు తన బంధువులను కలిసేందుకు గురువారం రాత్రి జబల్ పూర్ వెళ్లింది. అక్కడ నుంచి షాదోల్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళింది. చీకటి పడటంతో ఆమె రాత్రిపూట రైల్వే స్టేషన్ లో వుండిపోయింది. ఆపై ఆటో రిక్షా ద్వారా అంట్రా గ్రామంలోని మెయిన్ రోడ్డుకు చేరుకుంది. ఆమె బంధువుల ఇంటికి చేరుకునేందుకు మరో వాహనం ఎక్కాలంటూ రిక్షా డ్రైవర్ వృద్ధురాలిని రోడ్డుపై వదిలి వెళ్ళిపోయాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా..బైక్ పై అటుగా వెళ్ళిన ఓ వ్యక్తి చూపు ఆమెపై పడింది. ఇంకేముంది ఆమెకు మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి…
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూనే ఉంటారాయన. సినీ విషయాలపైనే కాకుండా రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తుంటారు. కుదురుగా అసలే ఉండరు. అందుకే ఆయన్ను వివాదాస్పద దర్శకుడుగా పిలుస్తుంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే రాంగోపాల్ వర్మకి ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అందరిలో ఎక్కువగా శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమెతో కలిసి గోవిందా గోవిందా, క్షణక్షణం వంటి సినిమాలను తెరకేక్కించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలు రూపొందించే సమయంలోనే శ్రీదేవి- రామ్ గోపాల్ వర్మ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే ప్రతి విషయాన్ని ఆర్జీవీతో శ్రీదేవి షేర్ చేసుకునేదట. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేదట. ఈ క్రమంలోనే శ్రీదేవిని పెళ్లి కూడా చేసుకోవాలని ఆర్జీవీ…
ప్రేమికుడితో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. సాయంత్రం సమయాలను అలా వీక్షిద్దామని బయటకు వెళ్ళిన ఆ ప్రేమ జంటపై అక్కడే మద్యం సేవిస్తోన్న దుండగులు దాడి చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాంచిపురంలో 19ఏళ్ల యువతి తన కాలేజ్ లో చదివే అబ్బాయితో కలిసి బెంగళూర్ , పుదుచ్చేరి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మూడు కి. మీ దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ వద్దకు వెళ్ళింది. అక్కడ కలిసి మాట్లాడుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అదే సమయంలో అక్కడ ఇద్దరు మద్యం సేవిస్తున్నారు. వీరూ మరో ముగ్గురికి కాల్ చేసి రమ్మని చెప్పారు. దాంతో ఆ ఐదుగురు కలిసి ఆ ప్రేమ జంటను బెదిరించారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ను గట్టిగా పట్టుకొని అతని ముందే యువతిపై సామూహిక…