Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మానవ సంబంధాలు గాడి తప్పుతున్నాయి. వావివరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నిండు జీవితాలను బలిచేసుకుంటున్న కథనాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తెలిసి తెలియని వయస్సులో టీనేజ్ పిల్లలు అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగానే వివాహితులు కూడా వ్యవహరిస్తున్నారు. వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వయో బేధం లేకుండా, వావి వరుసలు లేకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన కొన్ని కుటుంబాలు అనాధలు అయిపోతున్నాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వారి కష్ట సుఖాలను పంచుకోవడానికి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.యస్ రంగాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సునీతకు పెళ్లై భర్త ఉన్నాడు. కాని ఆమె కొంతకాలంగా తనకు వరసకు మరిది అయ్యే అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం ఇంట్లో…
పవన్ కళ్యాణ్, అలీ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి సినిమాలో అలీను పక్కన పెట్టుకునే వాడు. పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేసి రాజకీయాల బాట పట్టడం.. ఆ సమయంలో అలీకి సినీ అవకాశాలు తగ్గడంతో ఆయన వైసీపీలో చేరిపోయారు. ఇంకేముంది.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సి ఉంటుంది కదా..అందుకే అలీ కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ వలెనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడం సరైంది కాదని.. తన దగ్గర ఉన్న టాలెంట్ తోనే సినీ రంగంలో ఎదిగానని 2019 ఎన్నికల సమయంలో అలీ చెప్పేశారు. మళ్ళీ ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత స్నేహితుడిపైనే పోటీకి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశిస్తే పవన్…
చంద్రబాబుతో భేటీ ఆపై రణస్థలిలో సభ తరువాత టీడీపీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. గౌరవం ఉన్న చోట ఉంటామని.. అవమానిస్తే ఆలోచిస్తే ప్రసక్తే లేదని తేల్చేశారు పవన్ కళ్యాణ్. అవసరమైతే మరోసారి ఒంటరిగానైనా పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. రణస్థలిలో పవన్ వాడిన గౌరవం అనే పదంపై మరోసారి సర్వత్ర చర్చ జరుగుతోంది. గౌరవప్రదమైన పొత్తులతో ముందుకు వెళ్తామని ప్రకటించిన జనసేన ఎన్ని సీట్లు కోరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 20సీట్లను పవన్ కోరుతున్నారని వైసీపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో భాగంగా 55 స్థానాల్లో వైసీపీకి జనసేన నుంచి టఫ్ ఫైట్ నడిచింది. అక్కడ జనసేన గణనీయమైన ఓట్లు చీల్చడం వైసీపీ విజయానికి ప్రధాన కారణమైంది. అందుకే రానున్న ఎన్నికల్లో పొత్తు కుదిరితే 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అయితే ఇది సహేతుకమైన డిమాండ్…
మోడీ అధికారంలోకి వచ్చాక పేదలు మరింత దారిద్ర్యంలో కూరుకుపోతుండగా.. ధనవంతులు మరింత కుబేరులు అవుతున్నారు. ఆందోళన కల్గించే మరో విషయం ఏంటంటే.. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాల్లో కలిసిపోతున్న దుస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ బీజేపీ హయంలోనే పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని గాలి మాటలు చెబుతున్నారు. ఇవన్నీ భూటకమేనని తాజాగా స్పష్టమైంది. భారత్‌లో ఉన్న మొత్తం సంపదలో నలభై శాతం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది. అట్టడుగుననున్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3శాతం మాత్రమే ఉందని ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ సర్వేవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరిట భారత్ లోని ఆర్ధిక అసమానతలపై నివేదిక విడుదల చేసింది. దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా ఈ నివేదిక విడుదల చేసింది. ఇండియాలో పేదలు, ధనికుల మధ్య అంతరం తీవ్రంగా పెరిగిపోతుందని వెల్లడించారు. ఆక్స్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గట్టుగానే ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కూడా అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల రంగాలలో అన్నింటా అబద్దాలే వల్లిస్తున్నారు కేటీఆర్. లక్షకుపైగానే ఉద్యోగాలు ఇచ్చామని అబద్దపు లెక్కలు చెబుతున్న కేటీఆర్.. పెట్టుబడుల విషయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ అబద్దాలను నిసిగ్గుగా చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఆయన పీఆర్ టీమ్ మాత్రం ఒకే ప్రచారం చేస్తుంటుంది. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే కేటీఆర్ పర్యటన అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తోంది. గతంలో ఇలాంటి ప్రకటనలే చేసి కేటీఆర్ టీమ్ దొరికిపోయింది. తాజాగా మరోసారి కేటీఆర్ అబద్దాల మంత్రి అని చెప్పేందుకు రుజువు దొరికింది. మంత్రి కేటీఆర్ ప్రతీ వారం ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించామని …లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ అన్నీ ఎంవోయూలే…
ఈ ఏడాది లో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి.మేఘాలయ,మిజోరాం, నాగాలాండ్, త్రిపుర,రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక,తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఎన్నికలున్నాయి. 60 సీట్లు ఉన్న మేఘాలయ లో 2018 ఎన్నికలు హంగ్ రాగా కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీ గా అవతరించింది..NPP 20 స్థానాలు UDP 6 గెలవగా BJP కేవలం రెండు గెలిచింది.బీజేపీ కేంద్రం లో అధికారం ఉపయోగించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ సారి అక్కడ కాంగ్రెస్ సింగిల్ గా అధికారం పొందుతుంది.. మిజోరాం అక్కడ మిజో తెగ బలంగా ఉండటం వారికోసమే ఒక పార్టీ ఉండటం మిగిలిన తెగల కోసం జోరం పేరుతో ఒక ఉద్యమం నడవటం మూలాన ఇక్కడ ఆ రెండు పార్టీ లే బలంగా ఉన్నాయి.ఇక్కడ కాంగ్రెస్ మూడవ స్థానం లో ఉండగా బీజేపీ ఖాతా కూడా తెరవడం కష్టం. నాగాలాండ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కు 0 ఎమ్మెల్యేలు ఉండగా…
ఎట్టకేలకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మార్పుపై వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్ లోనే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశారు . ఖమ్మం రాజకీయాలను పొంగులేటి శ్రీనివాస్ తో తన చేతుల్లోకి లాక్కోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఆయనతోపాటు తుమ్మలను కూడా కాషాయ క్యాంప్ లో చేర్చుకోవాలని ట్రై చేసింది. బీజేపీ రాజకీయాలను గమనించిన కేసీఆర్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారు. ఖమ్మం సభకు ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న హరీష్ రావు ఖమ్మం వెళ్లి తుమ్మలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు తుమ్మల. కేసీఆర్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించి చాలా కాలమే అయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ధిక్కార స్వరం వినిపించిన తుమ్మల అకస్మాత్తుగా వెనక్కి తగ్గడంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి…
కేసీఆర్… నిన్నమొన్నటి వరకు ఓ ప్రాంతీయ పార్టీ అధినేత. ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా తనను తాను కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల పార్టీ పేరును మార్చి పార్టీకి జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇదంతా ఆషామాషీ కాదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు జాతీయ స్థాయి ఇమేజ్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. మరికొంతమంది కీలక నేతలు హాజరు కానున్నారు. వారంతా తన కోసమే వచ్చారని చూపించుకునేందుకు తహతహలాడుతున్నారు కేసీఆర్. ముగ్గురు ముఖ్యమంత్రులు , కమ్యూనిస్టు పార్టీ నేతల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 100 మంది ప్రముఖుల కోసం హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్,…
పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం రానురాను ఫ్యాషన్ అయిపోతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. రణ్ బీర్ కపూర్ తో పెళ్లికి ముందే కాపురం చేసి పెళ్లి అయ్యాక ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఈ వరుసలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేరిపోయారు. రాహుల్ రామకృష్ణ గత సంవత్సరం తన ప్రేయసిని పరిచయం చేశారు. హరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆ తరువాత అతని పెళ్లి గురించి ప్రకటనే వెలువడలేదు. ఇంతలోనే తండ్రిని అయ్యనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ”అబ్బాయి… సంక్రాంతి రిలీజ్” అని అప్పుడే పుట్టిన బిడ్డ ఫోటో షేర్ చేశాడు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో పోస్టులు చేసి హాట్ టాపిక్ అవ్వడం రాహుల్ కు…
దిశా పేపర్ బండి సంజయ్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థ యాజమాన్యం పెద్ద తలకాయాలనే టార్గెట్ చేస్తోంది. బండి అండ చూసుకొని పొలిటికల్ లీడర్స్ మొదలు ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తుంది. రేవంత్, ఈటెలను కూడా డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వమని చెప్పగానే వాళ్లపై వ్యతిరేక వార్తలు రాస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది దిశ. బెదిరింపు వార్తలు, నిరాదర వార్తలతో దిశ దిగజారిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తే వాటిపై స్పష్టత ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం ప్రారంభించింది యాజమాన్యం. మేము ఎవరికి అమ్ముడు పోలేదని, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని..తమపై వస్తోన్న కథనాలను కట్టడి చేయడండంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక్కడే దిశ విశ్వసనీయత ఏంటో అర్థం అవుతుంది. పొలిసు స్టేషన్ లో ఫిర్యాదుతోనే దిశ సరిపెట్టిందా లేదు. డైలీ కథనాల్లో సగం పేజీ తాను బ్లాక్ మైలర్ ను కానని…