Author: Prashanth Pagilla

ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా కమెడియన్స్ అధికార వైసీపీకి , జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. అలీ వైసీపీలో ఉండగా.. 30ఇయర్స్ పృధ్వీ గతేడాది వైసీపీని వీడి జనసేనలో చేరారు. హైపర్ ఆది కూడా జనసేనకు ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ సభలో హైపర్ ఆది వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోయారు. రోజాపై కూడా కౌంటర్లు వేశారు. జబర్దస్త్ లో చాలాకాలంపాటు జడ్జిగా వ్యవహరించిన రోజాతో ఆదికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయినప్పటికీ ఆ సాన్నిహిత్యాన్ని కూడా కాదనుకొని రోజాపై సెటైర్లు వేశారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను మెప్పించింది. అయితే.. హైపర్ ఆది వైసీపీ నేతలపై సెటైర్లు వేసిన వీడియోస్ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆదికి కౌంటర్ ఇచ్చేలా జబర్దస్త్ కమెడియన్స్ పై వైసీపీ నేతలు ఒత్తిడి…

Read More

సంక్రాంతి తరువాత కేంద్రమంత్రి వర్గాన్ని విస్తరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పండగ అయిపోవడంతో మంత్రివర్గ విస్తరణపై అందరి దృష్టి పడింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఎన్నికలున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసిన తెలంగాణ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎంపీలకు కేంద్రమంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓ కేంద్రమంత్రి ప్రాతినిధ్యం ఉంది. కాని ఏపీకి లేదు. దీంతో ఏపీకి కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాని అలాంటి ఛాన్స్ లేనట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచే మరో ఎంపీకి కేంద్రమంత్రి వర్గంలో అవకాశం కల్పించనున్నారు. తెలంగాణకు బెర్త్ ఖరారు చేసి తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు మంత్రుల్ని ఇచ్చినట్లు చెబుతారని తెలుస్తోంది. ఏపీ నుంచి బీజేపీకి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాత్రమే ఉన్నారు.…

Read More

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త రాష్ట్రంలో సహజంగానే పాలకుల నుంచి ప్రజలు కొత్తదనాన్ని ఆశిస్తారు. సంక్షేమ, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధిని కోరుతుంటారు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి.. స్వతహాగానే తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అందరూ ఆశిస్తారు. కాని మన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య హంతకుడిగా చరిత్రలోకెక్కుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలిష్టంగా ఉండేందుకు పక్కపార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్… ఇప్పుడు తనచూపును జాతీయ రాజకీయాల్లోకి మళ్ళించడంతో ఇతర రాష్ట్రాల్లోని నేతలతో బేరసారాలు నడుపడంపై కేంద్రీకరించారు. కర్ణాటకకు చెందిన 25మంది కాంగ్రెస్ నేతలను తన ఫామ్ హౌజ్ కి పిలిచి వారికీ 500కోట్ల ఆఫర్ చేశారు కేసీఆర్. వారంతా గెలిచే నేతలని తెలియడంతో కేసీఆర్ ఈ విధమైన నీచరాజకీయాలకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ ప్రజా ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి కంటే తనేం తక్కువ కాదనుకున్నారో ఏమో కాని బీజేపీ విష…

Read More

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీని గద్దె దించుతామని ప్రకటిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వాల ఏర్పాటుకు విపక్షాలన్నీ ఏకం కావాలని ఖమ్మం సభలో కేసీఆర్ పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్ ఆసీనులైన వేదిక నుంచే కేసీఆర్ ఈ పిలుపు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చ జరుగుతోంది. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కొన్ని స్థానాల్లో కమ్యూనిస్టుల అవసరం ఎలాంటిదో కేసీఆర్ కు తెలిసి వచ్చింది. దాంతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించనున్నారు. అందుకే కమ్యూనిస్టులు రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ తో.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా…

Read More

తెలంగాణ బీజేపీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. బండి సంజయ్, ఈటల మధ్య అసలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే వివేక్ – ఈటల డబ్బు వ్యవహారాన్ని బండి సంజయ్ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈటల తనేమి తక్కువ కాదని.. బండి సంజయ్ కు చెక్ పెట్టేందుకు బండి భగీరధ్ వ్యవహారాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతల పోటాపోటీ ఫిర్యాదులతో అధిష్టానం ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది. ఈటల బీజేపీలో చేరిన నాటి నుంచి బండి సంజయ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఈటలను అగ్రనేతలు అభినందించి.. ఆకాశానికేత్తేయడం బండి కు అస్సలు రుచించలేదు. ఇది చాలదన్నట్లు.. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఈటల అంటూ ఆయన వర్గీయులు ప్రచారం మొదలెట్టారు. ఈ విషయం బండి సంజయ్ కు తెలియడంతో పార్టీలో ఈటలకు క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. దీంతో పార్టీ…

Read More

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఐదు లక్షల మంది సభకు హాజరు అవుతారని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాని ఐదు లక్షల మందిని రప్పించలేకపోయారు. కాకపోతే నిండుగా జనం కనిపించేలా కవర్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా వెయిట్ చేశారు కాని, ఆయన ప్రసంగం తుస్సుమనించింది. మునుపటి వాగ్ధాటి కనిపించలేదు. పంచ్ లు అసలే లేవు. దీంతో కేసీఆర్ కు అసలు ఏమైందని బీఆర్ఎస్ వర్గాలే ఆశ్చర్యపొయాయి. ఇంతటి కీలకమైన సభలో కేసీఆర్ ఇంత పేలవంగా మాట్లాడుతున్నారనుకోలేదని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ , పంజాబ్, కేరళ సీఎంలు వచ్చారు. దాంతో జాతీయ మీడియా కవరేజ్ ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పార్టీ ఆవిర్భావ సభ పెట్టి తెలుగులో ప్రసంగిస్తే జాతీయ మీడియా ఎందుకు కవరేజీ ఇస్తుంది?…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ తెరవెనక కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకకు చెందిన 25మంది కాంగ్రెస్ నేతలను పిలిచి వారికీ 500 కోట్ల ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఇదంతా జరిగిందన్నారు. ఈ విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియడంతో కాంగ్రెస్ నేతలను పిలిచి క్లాస్ పీకిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న సునీల్ కనుగోలు ఆఫీసుపై తెలంగాణ పోలీసులు దాడి చేయడానికి ప్రధాన కారణం.. కాంగ్రెస్ పార్టీ స్టోర్ చేసి పెట్టుకున్న వ్యూహాలను తస్కరించేందుకేనని రేవంత్ ఆరోపించారు. మాదాపూర్ లోని సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి చేసి.. కంప్యూటర్లలో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని కేసీఆర్ తెలుసుకొని రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచే నేతలను కేసీఆర్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారని.. ఈ విషయం జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా…

Read More

ఖమ్మంలో నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జేడీఎస్ నేత కుమారస్వామి కనిపించలేదు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతోనే కుమారస్వామి పాల్గొనలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా..ఇంతటి కీలకమైన సభకు కనీసం పార్టీ ప్రతినిధి అయిన పంపించాల్సింది. కాని జేడీఎస్ తరుఫున ఎవరూ ఈ సభకు హాజరు కాలేదు. దీంతో బీఆర్ఎస్ కి ఆదిలోనే మిత్రులు దూరమైతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మర్చుతున్నామని కేసీఆర్ ప్రకటించిన తరువాత జరిగిన ప్రతి కార్యక్రమాల్లో కుమారస్వామి పాల్గొన్నారు. తీర్మానం చేసినప్పుడు.. అధికారికంగా ఈసీ నుంచి వచ్చి సంతకం చేసినప్పుడు..ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ హాజరయ్యారు. కాని పార్టీ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కుమారస్వామితోపాటు ప్రకాష్ రాజ్ కూడా ఈ సభలో కనిపించలేదు. గతంలో ఆయన బీఆర్ఎస్ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఫామ్ హౌజ్ లో కేసీఆర్ ను కలిసి చర్చించారు. కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు ప్రకాష్ రాజ్…

Read More

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమారుడి వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపింది. కాలేజ్ లో సహా విద్యార్ధిపై బండి కుమారుడు భగీరథ దాడి చేసిన ఘటన చర్చనీయాంశం అయింది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ ను టార్గెట్ చేసుకొని ఆయన కుమారుడిపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆర్జీవీ తనదైన శైలిలో సంజయ్ పై ట్వీట్ చేశారు. సంజయ్ ను సద్దాం హుస్సేన్ గా కొడుకును ఉదయ్ హుస్సేన్ అని పోల్చుతూ ట్వీట్ చేశారు. సంజయ్ ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరాక్ ను వణికించిన సద్దాం హుస్సేన్ సంజయ్ రూపంలో బతికే ఉన్నాడని ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. సినీ అంశాలపైనే కాకుండా రాజకీయపరమైన అంశాలపై కూడా స్పందిస్తుంటారు ఆర్జీవీ. పలువురిపై నిత్యం విమర్శలు చేస్తుంటారు. తాజాగా బండి సంజయ్ కుమారుడి ఇష్యూపై…

Read More

ఒంగోలులో మహానాడు నిర్వహించే సమయంలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీని సంప్రదించింది టీడీపీ. కాని ఒక్క బస్సు కూడా కేటాయించలేదు. పైగా.. రవాణా శాఖ అధికారులు మహానాడుకు వెళ్ళకుండా ప్రైవేట్ వాహనాలను కట్టడి చేశారు. చేసేదేమీ లేక టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులంతా వ్యక్తిగత వాహనాలపైనే మహానాడుకు వెళ్ళారు. మహానాడు నిర్వహణ సమయంలో పండగలు.. ప్రత్యేక ఈవెంట్లు కూడా ఏమి లేవు. అయినా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించలేదు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఖమ్మం సభకు వందల బస్సులను కేటాయిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి వందలాది బస్సులను ఏర్పాటు చేశారు. జనాన్ని తరలిస్తున్నారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సహకరించడం విశేషం. సంక్రాంతి పండగకు వెళ్ళిన వారంతా తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. వారికీ బస్సుల అవసరముంది. అయినప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధపడి..బీఆర్ఎస్ సభకు బస్సుల్ని కేటాయించారు. నాడు మహానాడుకు బస్సుల కేటాయింపునకు అబ్జెక్షన్ చెప్పిన ఆర్టీసీ అధికారులు.. ఇప్పుడు బీఆర్ఎస్…

Read More