Author: Prashanth Pagilla

తెలంగాణ బీజేపీలో నైరాశ్యం కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడం…ఆ తరువాత చేరికలు ఉంటాయని ప్రచారం చేసుకున్నా.. పేరున్నా నేతలు ఎవరూ పార్టీలో చేరలేదు. దీంతో పార్టీలో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. అయితే.. ఆ నిస్తేజాన్ని తొలగించేందుకు బీజేపీ నేతలు కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రధాని మోదీని తెలంగాణ నుంచి పోటీ చేయమని కోరుతారట. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మహబూబ్ నగర్ లో సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సమావేశంలో మోడీ పాలమూరు నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అగ్రనేతలకు పంపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం..ఎన్నికలను ఎదుర్కోవడం.. ప్రజా సమస్యలపై ఉద్యమించడం వంటి అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. అయితే..తెలంగాణపై అగ్రనాయకత్వం ఫోకస్ చేసినా.. పార్టీ అనుకున్నంత రేంజ్ లో పుంజుకోలేదు. కాబట్టి…మోదీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా పార్టీకి బలం వస్తుందని బీజేపీ నేతలు…

Read More

దేశంలోనే అత్యంత అందమైన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అనే పేరుంది. ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనకుండా సివిల్ ఎందుకు రాసిందని మన రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఓ మీటింగ్లో కంప్లీమెంట్ ఇచ్చాడు. ఆమె ఏ మీటింగ్ కి వెళ్లినా అందరి చూపు ఆమె మీదే ఉంటుదని ఒప్పుకోక తప్పదు. ఆమె క్రమశిక్షణకు మారు పేరని కేసీర్ మెచ్చుకున్నారు. ఇప్పుడున్న అతికొద్దిమంది నిజాయితీ గల ఐఏఎస్ లో ఆమె ఒకరు అని కేటీఆర్ చాలాసార్లు మెచ్చుకున్నారు. ఆమెను చూస్తుంటే మనకు ఇలాంటి ఓ చెల్లెలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నిజాయితీకి ఆమె నిలువెత్తు కటౌట్. అలాంటి స్త్రీమూర్తి ఇంటిలోకి, అడుగడునా జెడ్ సెక్యూటిరీటీలా ఉండే ఐఏఎస్ హెడ్ క్వార్టర్ గ్రేటర్ కమ్యూనిటీ లో పట్టపగలే ఓ అగంతకుడు జొరబడ్డాడు. అతను క్రిమినల్ ఐతే అసలిది వార్తనే కాదు. కానీ అతను మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్…

Read More

హైదరాబాద్ లో భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యులకే కాదు ఉన్నాతాధికారులకు కూడా భద్రత లేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఓ డిప్యూటీ తహశీల్దార్ చొరబడటం సంచలనంగా మారింది. తనకు రాత్రి ఓ భయానక ఘటన ఎదురైందని.. ఓ అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని.. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు కాల్ చేయాలని.. ఇంటి తలుపులు కరెక్ట్ గా లాక్ చేశారో లేదో చెక్ చేసుకోవాలని ఆమె పెర్కొనడటం చూస్తుంటే… హైదరాబాద్ లో భద్రత ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అనంద్ కుమార్ రెడ్డి అనే డిప్యూటీ తహశీల్దార్ ఆదివారం రాత్రి ఆమె ఇంట్లొకి చొరబడ్డారు. తలుపులు తీసుకుని నేరుగా లోపలికి వెళ్లిపోయారు. స్మితాసభర్వాల్ ఆ వ్యక్తిని గమనించి గట్టిగా అరవడంతో…

Read More

బీజేపీలో చేరికపై ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మత్తి నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారు. బీజేపీలో చేరడం ఖాయమనుకున్నా ఆఖరి నిమిషంలో రేవంత్ చక్రం తిప్పడంతో పొంగులేటి ఆగిపోయారు. కాంగ్రెస్సా..? బీజేపా.? ఏది అయితే బెటర్ ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సమైక్యవాదానికి మొగ్గు చూపిన వైఎస్సార్ సీపీ నుంచే 2014 ఎన్నికల్లో పోటీ గెలిచి సత్తా చాటారు. ఆ తరువాత అధికార పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కారెక్కారు. నాటి నుంచి జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆయనకు… 2019 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన సైలెంట్ గానే ఉన్నారు. కేసీఆర్ ఏదైనా పదవి కట్టబెట్టకపోరా అని వెయిట్ చేశారు. కానీ ఏ పదవి కట్టబెట్టలేదు. పైగా ఆయన అనుచరవర్గాన్ని పార్టీలో ఇబ్బంది పెట్టడం…

Read More

తొమ్మిదో తరగతి చదువుతోన్న 14ఏళ్ల బాలిక ప్రసవించిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… 14ఏళ్ల బాలిక కడప జిల్లా వాల్మీకిపురంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం ఉన్నట్టుండి బాలిక కడుపునొప్పి అంటూ విలవిల్లాడింది. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మొదట ఫుడ్ పాయిజన్ అనుకున్నారు పాఠశాల సిబ్బంది. కాని ఆసుపత్రిలో వైద్యులు బాలికకు పరీక్షలు చేసిన అనంతరం గర్భవతిగా తేల్చారు. ఆ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న స్థానిక తాహశీల్దారు ఫిరోజ్ ఖాన్, ఎస్ఐ బిందుమాధవిలు వెంటనే ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం బాలికను, బిడ్డను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు…

Read More

తమ భాషే గొప్పది. తామున్న చోటుకు వచ్చి తమ భాషను మాట్లాడకపోవడమంటే మా భాషను అవమానించినట్టేననే మూర్ఖత్వం తమిళులు, కన్నడిగులలో ఎక్కువైపోతుంది. భాషాభీమానంతో హద్దులు మీరి మరీ ప్రవర్తిస్తున్నారు. సందర్భాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా దాడులకు పాల్పడుతున్నారు. కన్నడలో మాట్లాడనందుకు సింగర్ మంగ్లీపై దాడికి పాల్పడ్డారు. బళ్ళారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్ళు రువ్వారు. దుండగులు రాళ్ళు రువ్వుతున్న సమయంలో అసలేం ఏం జరుగుతుందోనని కారులోనున్న మంగ్లీ, ఆమె సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మంగ్లీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కారు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. మంగ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అసలేమైందంటే..బళ్ళారి మున్సిపల్ స్టేడియంలో ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ కు పయనమయ్యారు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. దాడికి కారణం ఏంటంటే.. కన్నడలో మాట్లాడేందుకు…

Read More

పెళ్లిల విషయంలో వింత పోకడలు పోతుంది నేటి యువత. పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం.. తండ్రి వయస్సున్న వ్యక్తిని ప్రేమించడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ విచిత్ర సంఘటన సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి అతడి తండ్రినే పెళ్లి చేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడం కామన్. కాని ఆ మహిళ భర్త తండ్రినే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. అమెరికాలోని కెంటూకి చెందిన ఎరికా అనే మహిళ జస్టిన్ అనే వ్యక్తిని కొన్నాళ్ళ క్రితం పెళ్లి చేసుకుంది. వారికీ ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం సాఫీగా సాగిన వారి కాపురంలో మెల్లగా కలహాలు స్టార్ట్ అయ్యాయి. చివరికి ఇలా నిత్యం గొడవలు పడుతూ లైఫ్ ను లీడ్ చేయడం సాధ్యం కాదని విడాకులు తీసుకోవాలనుకున్నారు. విడిపోయి మంచి మిత్రులా ఉండాలని భావించారు. దీంతో ఎరికా.. జస్టిన్ ఇద్దరు కలిసి…

Read More

బేబీ వరలక్ష్మి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలకు చెల్లెలి రోల్ చేసి మెప్పించిన అలనాటి నటి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదు దశాబ్దాలు అవుతుంది. మూప్పై ఏళ్ళపాటు నటిగా కొనసాగుతున్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు వరలక్ష్మి. హీరోలకు చెల్లెలు పాత్రలో ఆమె అయితేనే సెట్ అవుతుందన్న స్టార్ డం సంపాదించుకున్నారు. అయితే.. అప్పట్లో ప్రతి సినిమాలో రేప్ సీన్స్ ఉండేవి. హీరో చెల్లిలిని విలన్లు అత్యాచారం చేసే సన్నివేశాలు ఉండేవి. అలా చెల్లిలి పాత్రలో నటించిన బేబి వరలక్ష్మి చాలా సినిమాలో రేప్ సీన్స్ లో అత్యాచారానికి గురయ్యే అమ్మాయి పాత్రల్లో నటించారు. తాను చేసిన చెల్లెలి పాత్రల కంటే ఎక్కువగా రేప్ కి గురైన పాత్రలనే జనం ఎక్కువగా…

Read More

సోషల్ మీడియాలో వచ్చే వాటిని చదువుతూ మనకు తెలియకుండానే మన పెదవిపై చిరునవ్వు వెలుగుతుంది. ఒక్కోసారి వాటిని చూసి నవ్వాపుకోలేక పక్కున నవ్వేస్తుంటాం. ఒక్కొక్కసారి మనకి నిజ జీవితంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో భార్యాభర్తల జోక్స్ మనకి కనబడుతూ ఉంటాయి. వీటిని చూస్తే మనం అసలు నవ్వపుకోలెం. అయితే ఒక భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి వాట్సప్ లో మెసేజ్ పెడుతుంది. ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సందేశం ఏంటో చదివి మీరు కూడా నవ్వేయండి.. 1.పార్టీలు లాంటివి ఇంట్లో పెట్టొద్దు. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు రెండు రోజులు పడుతోంది. 2. పక్కింటి వాళ్ళని పాలు వచ్చాయా పేపర్ వచ్చిందా అని పొద్దున్నే లేపకండి.. వాళ్లని ఆస్తమాను ఇలా పిలిచి చిరాకు పెట్టొద్దు. మిమ్మల్ని తిట్టడం సరి కదా ఊరెళ్ళి నిద్ర చెడగొట్టినందుకు నన్ను కూడా…

Read More

ఏపీలోనూ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ దృష్ట్యా ఫిబ్రవరిలోనే బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలనుకుంటున్నట్లు ఏపీ సర్కార్ చెప్పదల్చుకున్న… ముందస్తు ఆలోచతోనే తొందరగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మార్చి మొదటి వారంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముందు వారం రోజులు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి బడ్జెట్ వంటి కీలక సమావేశాలు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఆ సదస్సు ముగిసిన వెంటనే జీ20 సన్నాహాక సదస్సు విశాఖలో జరగాల్సి ఉంది. ఇది కేంద్రం నిర్వహించేదే అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఇబ్బందే. అందుకే ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీలో లాగా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే పనులేమి లేకపోయిన ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. అదే నెలలో బడ్జెట్ కూడా పెట్టేస్తారు.…

Read More