Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన మూడో భార్య రమ్యతో ప్రాణహాని ఉందంటూ కోర్టులో నరేష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిందంటూ కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ రాకేశ్ శెట్టితో తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు నరేష్. కృష్ణ మరణించిన సమయంలోనే ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అంతేకాదు..ఓ పోలీసు అధికారి సహాయంతో తన ఫోన్ ను హ్యాక్ చేసిందన్నారు. నరేష్, పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. వాళ్ళ పెళ్లి జరగనివ్వని.. తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటారని రమ్య ప్రశ్నిస్తోంది. నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని.. తన కొడుకు తండ్రి కావాలని కోరుతున్నాడని చెప్పుకొచ్చింది. మా విడాకుల కేసు కోర్టు విచారణలో…
లోకేశ్ పాదయాత్రలో జనాల తాకిడికి సొమ్మసిల్లిన తారకరత్న. ▪️ఆస్పత్రికి తరలించిన పార్టీ శ్రేణులు. ▪️కుప్పం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు. ▪️కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన బాలకృష్ణ. ▪️మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించనున్న టీడీపీ నేతలు. ▪️తారకరత్నను కేసీ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే పల్స్ లేదు ▪️శరీరం బ్లూ కలర్ లోకి మారింది, ఆందోళనకరంగా ఆరోగ్య పరిస్థితి – డాక్టర్లు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న టాలీవుడ్ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. యువగళం పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్ధనలు నిర్వహించారు. ఇందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. మసీదు నుంచి లోకేష్ బయటకు రాగానే ఆయనను కలిసేందుకు కార్యకర్తలు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారి తాకిడికి గురై తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు…
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగు , తమిళ చిత్రాలకు ఎన్నోసార్లు డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస మూర్తి. తెలుగులో సూర్యా, మోహన్ లాల్, అజిత్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది హీరోలకు డబ్బింగ్ చెప్పారు. గొప్ప టాలెంట్ ఉన్న శ్రీనివాస మూర్తి చిన్న వయస్సులోనే చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శ్రీనివాస మూర్తి లాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో చూసిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. కొన్నేళ్లుగా మోస్ట్ సక్సెస్ ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. విక్రమ్ అపరిచితుడు, సూర్య సింగం సిరీస్, 24, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు, అల వైకుంఠపురంలో జయరామ్ సుబ్రమణియన్, రాజశేఖర్ కు ఇలా ఎన్నో గొప్ప చిత్రాలు, ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాస మూర్తి…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలిపేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోందా..? ఇందిరాగాంధీ నడయాడిన నేలపై ప్రియాంక గాంధీని పోటీలో నిలిపి సెంటిమెంట్ ను పునరావృతం చేయాలనుకుంటుందా..? ప్రియాంకను మెదక్ నుంచి పోటీ చేయించడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోందా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. 1980లో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ రెండు లక్షల మెజార్టీతో గెలుపొంది ప్రధానమంత్రి అయ్యారు. ఆమె హయంలోనే మెదక్ పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. నాన్నమ్మ నడయాడిన నేలపై ఇప్పుడు మనవరాలు ప్రియాంక గాంధీని బరిలో నిలిపేందుకు టీపీసీసీ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకోవాలంటే మెదక్ నుంచి ప్రియాంకను బరిలో నిలడమే అత్యుత్తమని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈమేరకు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు టీపీసీసీ ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి…
కొడంగల్ లో B R S కు బిగ్ షాక్.. సీనియర్ నేత మాజీ MLA గురునాథ్ రెడ్డి కుటుంబం తో భేటీ అయిన రేవంత్.. గురునాథ్ రెడ్డీ తో పాటు కాంగ్రెస్ లో చేరనున్న కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ముద్దప్ప.. 7 సార్లు MLA గా చేసిన గురునాథ్ రెడ్డీ కొడంగల్ లో తిరుగులేని నేత.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కీలక పాత్ర పోషించిన గురునాథ్ రెడ్డి గురునాథ్ రెడ్డీ దెబ్బకు కొడంగల్ కకావికలం అయిన టీఆర్ఎస్ సొంతంగా 30 వేల ఓట్లు కలిగిఉన్న నేత గురునాథ్ రెడ్డీ పార్టీ వీడడం తో టీఆర్ఎస్ కు గట్టి షాక్… పాదయాత్ర పై చర్చించిన రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డి… ఎన్నికలకు సమయం ముంచుకొస్తోన్న వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింగి. ఆ పార్టీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు…
రిపబ్లిక్ డే నిర్వహణ విషయంలో గవర్నర్ , తెలంగాణ సర్కార్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరేడ్ తో రిపబ్లిక్ డే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోపాటు గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండటంతో సీన్ గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లు మారింది. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. తెలంగాణలో జెండా వందనం ఆవిష్కరణ అనంతరం పుదుచ్చేరి వెళ్ళిన గవర్నర్ అక్కడి తమిళ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. కరోనా సాకుతో గణతంత్ర వేడుకలకు సర్కార్ అనుమతి ఇవ్వలేదని.. ఖమ్మంలో ఐదు లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారని తమిళిసై గుర్తు చేశారు. వీటన్నింటిపై కేంద్రానికి నివేదిక పంపానన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లోనూ గవర్నర్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు…
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం రాజేందర్ బీజేపీలోకి వెళ్ళాడో .. ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో రాజేందర్ బీజేపీలో చేరారని కానీ, బీజేపీలోకి వెళ్ళాక అక్కడ కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని ఈటెలకు అర్థమైందన్నారు. రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చిందని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు .. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరన్నారు. బీజేపీ కేసీఆర్ ఒక్కటేనన్న విషయం ఈటెల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైందని తెలిపారు.కేసీఆర్ విష ప్రయోగంలో ఈటెల కూడా పాత్రధారి అవుతున్నాడని.. రాజెందర్ కు ఇష్టం లేని పనులను కేసీఆర్ చేపిస్తున్నారన్నారు. ఈటెల లెఫ్టిష్ట్… కానీ రైటిస్ట్ పార్టీలోకి పోయేలా…
అక్కినేని.. తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఇండస్ట్రీలో బాలయ్యకు మద్దతుగా కొందరు.. అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా మరికొందరు నిలిచారు. ఈ క్రమంలోనే హిందూపురంలో మీడియాతో మాట్లాడిన బాలయ్య తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు ఆయన పిల్లల కంటే తనపై ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని ప్రేమగా పిలుచుకునేవాడిని.. తన గుండెల్లో ఎప్పటికీ అపరిమితమైన అభిమానం ఉంటుందన్నారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. పొడగ్తలకు పొంగిపోకపోవడం..విమర్శలకు క్రుంగిపోకుండా పట్టుదలతో ఉండటం అక్కినేని నాగేశ్వర్ రావు నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు బాలయ్య. ఎన్టీఆర్ ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. అదంతా ఆయనపై చూపే అభిమానంగానే పరిగణిస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని స్పష్టం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరైన శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యాడు. హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ గురువారం జరిగింది. హైదరబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్ధం జరగగా.. పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. శర్వానంద్ కు చిన్నప్పటి నుంచి స్నేహితుడైన రామ్ చరణ్ తన సతీమణితో కలిసి ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే.. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చూద్దాం. రక్షిత రెడ్డి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి మనవరాలట. అతను టీడీపీ సీనియర్ నేత అని సమాచారం. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అంటన్నారు. ఇక, రక్షితరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఎన్నారై.…
నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు అక్కినేని వారసులు కౌంటర్లు ఇచ్చారు. అటు అక్కినేని.. తొక్కినేని అని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తమతోపాటు ఎస్వీ రంగారావు కుటుంబాన్ని కూడా అవమానించడంతో వారిని కూడా అక్కినేని ఫ్యామిలీకి సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. ఎస్వీఆర్ కుటుంబానికి బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. తామంతా ఒకే కుటుంబంగా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన చాలా జనరల్ గా చెప్పారని వివరించారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించలేదని ఎస్వీఆర్ మనవళ్లు రంగారావు, ఎస్ వి ఎల్ ఎస్ రంగారావు చెప్పుకొచ్చారు. ఇక, ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవద్దని కోరారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి తమకు..తమ…