Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Admin
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 మంది నిరసనకారులు వేదిక ముందుకు వచ్చి రైతు నేతలపై ఇంక్ చల్లారు. టికాయత్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్ వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. టికాయత్ సహా రైతు నేతలుపై ఇంక్ చల్లిన ముగ్గురు నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన టికాయత్, కర్ణాటక ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి తాము విజయం…
-మున్నురు కాపుల ఓట్లపై గురిపెట్టిన తెరాస, బీజేపీ.-మున్నురు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా క్యాస్ట్ బేస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలు కులాల వారీగా ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి వారికి రాజకీయ ప్రాథమ్యం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు మున్నురు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. జనాభాలో 18శాతం ఉన్న వీరిని తమ వైపు తిప్పుకునేందుకు తెరాస, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. గతంలో మున్నురు కాపులు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. పార్టీలో సైతం వీరికి అదే స్థాయిలో ప్రాథమ్యం ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి నలుగురికి మంత్రి పదవులు వచ్చాయి. పార్టీ పగ్గాలు సైతం డీ. శ్రీనివాస్, పోన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ వంటి వారికి అప్పగించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మున్నురు కాపులకు ఆధరణ తగ్గింది.…
తెలంగాణకు వచ్చి మోదీ తెచ్చింది ఏముంది ?చెన్నైకి వెళ్లి రూ. 31 వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనతెలంగాణలో కేసీఆర్ ది అవినీతి పాలన అంటూ విమర్శలుమరి ప్రధానిగా ఉన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోరు ? తెలంగాణ అంటే… ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు అంత చిన్నచూపు ? కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు తీరుని గమనిస్తే.. ఎవరికైనా ఇదే ప్రశ్న అడాగలని అనిపిస్తుంది. ఒకవేల అలా అనిపించకపోతే ఒకటి.. వారికి దేశ పరిపాలనపై అవగాహన లేకుండా ఉండాలి లేదా రెండు.. వారు మోడీ భజన భక్తులైనా అయి ఉండాలి. కాంగ్రెస్ ధృడ సంకల్పంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి నేటి వరకు .. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చింది అరకొర నిధులే. ఆ ఇచ్చినవి కూడా హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన వాటానే.…
భారత్ లో నిరుద్యోగిత 24 శాతంప్రపంచంలోనే అత్యధికంవిభజిత విధానాలతో ఆర్థిక పునాదులకు నష్టందేశంలో 1990 ల నాటి పరిస్థితులుఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు భారత దేశంలో రోజు రోజుకీ ఎక్కువ అవుతోన్న నిరుద్యోగిత, పతనం అవుతోన్న వృద్ధి రేటు ఆర్థిక, సామాజిక నిపుణులను కలవరపెడుతోంది. దేశ ఆర్థిక పునాదాలు బలంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుత తిరోగమానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని పరోక్షంగా విమర్శిస్తున్నారు. 2009 నుంచి 2012 వరకు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ గా వ్యవహరించిన ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు.. తాజాగా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల మధ్య విభజన తెచ్చే విధానాలు దేశ ప్రగతి పునాదులను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నప్పటికీ, సమాజంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయని,…
కాంగ్రెస్ రహిత కూటమి కోసం పాట్లు సాధ్యం కాదంటున్న రాజకీయ ప్రముఖులు కొండంత రాగం తీసినా.. వృథా ప్రయాసే ! బీజేపీని ఢీకొట్టాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరిక ఎక్కువైనట్లుంది. అందుకే జాతీయ స్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన అడుగులకి మడుగులొత్తే ఆస్థాన మీడియా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసి నరేంద్ర మోడీని బలంగా ఢీకొట్టాలనేది కేసీఆర్ సంకల్పమని కథనాల మీద కథనాలు వండి వారుస్తోంది. 2018 రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ జాతీయ రాగం అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత కూటమి ఏర్పాటు అంటూ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తో మంతనాలు జరిపారు. ఇళ్లు వెతుక్కుంటూ వచ్చిన కేసీఆర్ అండ్ బృందానికి మంచి అతిథి మర్యాదలు చేసిన మమతా, నవనీన్ లు.. ఆ తర్వాత కూటమి…
ఆధునిక భారత నిర్మాత, దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన దూరదృష్టి కలిగిన నాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ. టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్.. సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ. 1984 అక్టోబర్ 31న ఇందిర గాంధీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజీవ్ ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి మరణం బాధపెడుతున్నా ఎంతో ఓర్పుతో బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయసు 40 ఏళ్లే. దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో ప్రధాని…
మరో రెండేళ్లు పెంచిన ప్రభుత్వంగతంలో 3 ఏళ్ల పెంపుభారీగా పెరగనున్న దరఖాస్తులుదరఖాస్తు గడువు ఈ రోజుతో ఆఖరు ?గడువు పెంపుపై ఇంకా వెలువడని ప్రకటనఆందోళనలో అభ్యర్థులు – ఇంటర్నెట్ తో కుస్తీలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేండ్ల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని కోరుతూ వచ్చిన విన్నపాలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజీపీని ఆదేశించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేండ్ల వయోపరిమితి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 2 ఏళ్లు పెంచడంతో… మొత్తంగా యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి 5 ఏళ్లు పెంచినట్లైంది. వయోపరిమితి మరో రెండేళ్లు పెంచడంతో… ఓసీ అభ్యర్థుల ఏజ్ లిమిట్…
తేల్చిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిన కమిషన్పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారు10 మంది పోలీసులపై హత్యానేరం కేసులకి సిఫార్సు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసు.. తెలంగాణ పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎన్ కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులు చట్టపరమైన నిబంధనలు, పోలీసు మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించింది. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, తమపై దాడి చేశారన్న పోలీసుల వాదనలో నిజం లేదని పేర్కొంది. నిందితులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కునేందుకు యత్నించారనడం కట్టుకథలాగే ఉందని, ఈ విషయంలో పోలీసులు చెప్పినవేవి నమ్మశక్యంగా లేవని పేర్కొంది. ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం 2019 డిసెంబర్ 6వ…
12 నెలల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 69 వేల కోట్ల అప్పు7 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్తెలంగాణలో శ్రీలంక పరిస్థితులుప్రజలు తిరగబడే దుస్థితి కల్పించారుత్వరలో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లుమీట్ ది ప్రెస్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి 30 రోజుల్లో రైతులకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ హామీ అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామన్నారు. సబ్బండ వర్ణాల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని.. వారిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్ కే…
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్నాయి కనుకనే కావచ్చు కానీ, ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతం గురించీ, వ్యవసాయ రంగం గురించీ చాలా కాలం తరువాత మళ్ళీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో, రాజకీయ పార్టీల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలు రాష్ట్ర రైతులకు అనేక హామీలు గుప్పిస్తుంటే, , ప్రాంతీయ పార్టీగా ఉన్న తెరాస కూడా జాతీయ వ్యవసాయ విధానం గురించి చర్చలు కొనసాగిస్తోంది. వీటన్నిటి మధ్యలో నిజమైన రైతులు,ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా, ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలకు, ఆర్ధిక నష్టాలకు బలవుతూ , అప్పుల ఊబిలో కూరుకుపోతూ , బలవన్మరణాలవైపు నడుస్తూనే ఉన్నారు .ఇప్పటి రాజకీయ పార్టీలు , నాయకులు అవకాశవాదంతో వ్యవసాయ రంగాన్ని గందర గోళంలోకి నెట్టారు కానీ , భారత రాజ్యాంగ రచయితలు వ్యవసాయ రంగం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగానే బాధ్యతలను నిర్దేశించారు . స్థానిక వైవిధ్య పూరిత…